రైల్వే మంత్రిత్వ శాఖ
ఉత్తర రైల్వేలోని అంబాలా విభాగానికి రూ.201 కోట్ల కవచ్ ప్రాజెక్టును ఆమోదించిన భారత రైల్వే
కవచ్ పరిధిలోకి హర్యానా, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్‌లోని అంబాలా కంటోన్మెంట్-లుథియానా, కాల్కా-చండీగఢ్-న్యూ మోరిండా-సాహ్నేవాల్, ఇతర కీలక మార్గాలు
प्रविष्टि तिथि:
15 JUN 2026 2:27PM by PIB Hyderabad
రైల్వే భద్రతను బలోపేతం చేస్తూ, ఉత్తర రైల్వేలోని అంబాలా విభాగంలో మిగిలిన బ్రాడ్‌గేజ్ మార్గాల్లో కవచ్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు భారత రైల్వే ఆమోదం తెలిపింది. 811 కి.మీ మేర విస్తరించిన ఈ ప్రాజెక్టును రూ.201 కోట్ల వ్యయంతో మంజూరు చేశారు. భారత రైల్వేలోని మిగిలిన మార్గాల్లో ఎల్ఈటీ ఆధారిత కమ్యూనికేషన్ వ్యవస్థతో కవచ్‌ను ఏర్పాటు చేసే సమగ్ర కార్యక్రమం ద్వారా ఈ పనులకు ఆమోదం లభించింది.
మంజూరైన ఈ పనులు అంబాలా డివిజన్‌లోని అంబాలా కంటోన్మెంట్-లుథియానా, కాల్కా-చండీగఢ్-న్యూ మోరిండా-సాహ్నేవాల్, సిర్హింద్-దౌలత్‌పూర్‌చౌక్, రాజ్‌పురా-భటిండా-శ్రీ గంగానగర్, లుథియానా-ధురి-జఖాల్ విభాగాలతో ముఖ్యమైన రైలు మార్గాల్లో జరుగుతాయి.
ఈ మార్గాలు హర్యానా, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్‌ను కలిపే కీలకమైన రైలు కారిడార్లుగా పనిచేస్తాయి. ఇవి భారీ మొత్తంలో ప్రయాణికులను, సరకు రవాణాను చేరవేస్తూ.. ఈ ప్రాంతంలో ప్రజల రాకపోకలకు, వస్తువుల రవాణాలో కీలక పాత్ర పోషిస్తాయి.
రైలు ప్రయాణ భద్రతను మెరుగుపరిచేందుకు మన దేశంలోనే సొంతంగా అభివృద్ధి చేసిన ఆటోమేటిక్ రైలు రక్షణ (ఏటీపీ) వ్యవస్థే కవచ్. ప్రమాదకర పరిస్థితుల్లో రైలు సిగ్నల్ దాటటాన్ని (ఎస్‌పీఏడీ) నివారించేందుకు ఇది సహాయపడుతుంది. ప్రమాదకర పరిస్థితులను తప్పించేందుకు ఆటోమేటిక్‌గా బ్రేకులు వేస్తుంది. క్లిష్ట పరిస్థితుల్లో రైలు వేగాన్ని నియంత్రించి, ఢీకొనే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
అధిక రద్దీ, వ్యూహాత్మకంగా ముఖ్యమైన మార్గాల్లో భద్రత, విశ్వసనీయత, సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు భారత రైల్వే చేపడుతున్న నిరంతర ప్రయత్నాల్లో భాగంగా.. వ్యవస్థ అంతటా కవచ్ విస్తరణ జరుగుతోంది.
***
(रिलीज़ आईडी: 2273214)
आगंतुक पटल : 18