రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జాతీయ రహదారుల పరివర్తన: వికసిత భారత్ దిశగా దేశ ప్రయాణానికి మరింత శక్తి

నాడు పోస్టు చేయడమైనది: 14 JUN 2026 2:45PM by PIB Hyderabad

రహదారి మౌలిక వసతుల రంగంలో గడచిన పన్నెండేళ్లలో భారత్ అపూర్వమైన మార్పులను చూసిందిప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలోకేంద్ర రోడ్డు రవాణాజాతీయ రహదారుల మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ మార్గదర్శకత్వంలో అనుసంధాన రంగంలో నూతన శకానికి రోడ్డు రవాణాజాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (ఎంవోఆర్‌టీహెచ్నాయకత్వం వహిస్తోందిఆర్థిక వృద్ధిని బలోపేతం చేస్తోందిసరకు రవాణా సామర్థ్యాన్ని మెరుగుపరుస్తోందిలక్షలాది ప్రజలకు ప్రయాణ సౌలభ్యాన్ని అందిస్తోంది.

జాతీయాభివృద్ధికి ప్రపంచ స్థాయి మౌలిక వసతులే కీలకమైనవిగా గుర్తించిరవాణా సదుపాయాలను విస్తరించడంప్రయాణ సమయాన్ని తగ్గించడంరోడ్డు భద్రతను పెంపొందించడంసమగ్రాభివృద్ధిని ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రభుత్వం పరివర్తనాత్మక కార్యక్రమాలను చేపట్టిందివేగవంతమైన జాతీయ రహదారుల విస్తరణరికార్డు స్థాయి నిర్మాణ వేగంప్రతిష్ఠాత్మకమైన ఎక్స్‌ప్రెస్ వేల అభివృద్ధి కలసి భారతీయ రవాణా వ్యవస్థను పునర్నిర్మించాయిఆధునికమైనస్వయం సమృద్ధ దేశానికి పునాదులను బలోపేతం చేశాయి.

భారతమాల పరియోజనసమీకృత జాతీయ అనుసంధానానికి దార్శనికత

దేశవ్యాప్తంగా సరకులుప్రయాణీకుల రవాణాను మెరుగుపరచడానికి రూపొందించిన ప్రతిష్ఠాత్మక కార్యక్రమమైన భారతమాల పరియోజనజాతీయ రహదారి రంగంలో అత్యంత పరివర్తనాత్మక కార్యక్రమాల్లో ఒకటిగా ఉందిసుమారు రూ5.35లక్షల కోట్ల అంచనా వ్యయంతో 34,800 కిలోమీటర్ల జాతీయ రహదారి కారిడార్లను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా నిర్దేశించుకున్న ఈ కార్యక్రమానికి 2017 అక్టోబర్‌లో భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

ఆర్థిక కారిడార్లుఅంతర కారిడార్లుఫీడర్ మార్గాలుజాతీయ కారిడార్ల సామర్థ్య పెంపు ప్రాజెక్టులుసరిహద్దు రహదారులుతీరప్రాంత రోడ్లుఓడరేవుల అనుసంధాన రహదారులుఎక్స్‌ప్రెస్ వేల అభివృద్ధిపై ఈ కార్యక్రమం దృష్టి సారిస్తుంది. 2026, మార్చి నాటికి 26,425 కిలోమీటర్ల మేర ప్రాజెక్టులను కేటాయించగా22,590 కిలోమీటర్ల నిర్మాణం పూర్తయిందిరవాణా అనుసంధానాన్ని భారతమాల పరియోజన ప్రాజెక్టు గణనీయంగా పెంపొందించిందిసరకు రవాణా ఖర్చులను తగ్గించిందిమారుమూలవ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన ప్రాంతాలకు అనుసంధానాన్ని మెరుగుపరిచిందితద్వారా ఆర్థికాభివృద్ధికిప్రాంతీయ సమతుల్యతకుజాతీయ సమైక్యతకు దోహదపడింది.

జాతీయ రహదారుల వ్యవస్థ విస్తరణ

గత దశాబ్దంలో సాధించిన అత్యంత ముఖ్యమైన మౌలిక సదుపాయాల విజయాల్లో భారతదేశ జాతీయ రహదారుల వ్యవస్థ విస్తరణ ఒకటిగా ఉందిఈ వ్యవస్థ 2014లో దాదాపు 91,287 కిలోమీటర్ల నుంచి ఆర్థిక సంవత్సరం 2025-26లో 1,46,572 కిలోమీటర్లకు పైగా విస్తరించాయిఈ వృద్ధి దాదాపు 61 శాతంగా ఉంది.

అద్భుతమైన రీతిలో సాధించిన ఈ వృద్ధి ద్వారా రాష్ట్రాలుప్రాంతాల మధ్య అనుసంధానం పెరిగిందివేగవంతమైన సరకుసేవల రవాణాను సులభతరం చేసిందిమార్కెట్లకు రవాణా మార్గాలను విస్తరించిందిదేశ ఆర్థిక వెన్నెముకను బలోపేతం చేసిందిమారుమూలవెనకబడిన ప్రాంతాలను వృద్ధి కేంద్రాలుఆర్థిక కేంద్రాలతో అనుసంధానించడం ద్వారా ప్రాంతీయ అసమానతలను పూడ్చేందుకు విస్తరించిన ఈ నెట్‌వర్కు సహకరిస్తోంది.

హైవేల నిర్మాణంలో రికార్డు స్థాయి వృద్ధి

జాతీయ రహదారుల నిర్మాణం వేగంలో కూడా భారత దేశం గణనీయమైన పెరుగుదలను నమోదు చేసింది2013-14లో రోజుకి సుమారుగా 11.6 కి.మీనుంచి 2025 సంవత్సరంలో రోజుకి దాదాపు 34 కి.మీ.కు సగటు నిర్మాణ వేగం పెరిగింది.

కొనసాగుతున్న విధానపరమైన మద్దతుమెరుగైన ప్రాజెక్టు అమలుక్రమబద్ధీకరించిన అనుమతుల యంత్రాంగాలుసాంకేతికపరమైన ఆవిష్కరణవిస్తరించిన సంస్థాగత సామర్థ్యాన్ని ఈ విజయం ప్రతిబింబిస్తుందినిర్మాణ వేగం పెరగడం వల్ల కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడమే కాకుండా దేశవ్యాప్తంగా రవాణా సదుపాయం బలోపేతమైంది.

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ బెంగళూరు (ఐఐఎంబీచేపట్టిన అధ్యయనం ప్రకారం జాతీయ రహదారుల అభివృద్ధి వల్ల కర్మాగారాలకు అనుసంధానం మెరుగుపడి.. సగటు సరకు రవాణా వ్యయం గణనీయంగా తగ్గిందిఫలితంగా ఫ్యాక్టరీకీసరఫరాదారుడికీ మధ్యఫ్యాక్టరీకీవినియోగదారునికీ మధ్య రవాణా ఖర్చులు తగ్గాయి.

ఢిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్ వేదూరప్రాంత అనుసంధానానికి సరికొత్త నిర్వచనం

భారత్ చేపడుతున్నఅత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో ఢిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్ వే ఒకటిరూ. 1 లక్ష కోట్ల వరకు అంచనా వ్యయంతో సుమారుగా 1,386 కి.మీపొడవుతో నిర్మించే ఈ ప్రాజెక్టు పూర్తయితే.. దేశంలోనే అత్యంత పొడవైన ప్రవేశ నియంత్రణ ఉన్న ఎక్స్‌ప్రెస్ మార్గంగా నిలవనుంది.

ఢిల్లీహర్యానారాజస్థాన్మధ్యప్రదేశ్గుజరాత్మహారాష్ట్రలను ఈ ఎక్స్‌ప్రెస్ మార్గం అనుసంధానిస్తుందిఇది దేశంలోని ప్రధాన ఆర్థిక కేంద్రాల మధ్య అనుసంధానాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది2023 ఫిబ్రవరి 12న ఢిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్ వేలో మొదటిగా నిర్మాణం పూర్తి చేసుకున్న 246 కి.మీపొడవైన ఢిల్లీ-దౌసా-లాల్‌సౌట్‌ భాగాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారురాజస్థాన్‌లో విస్తరించిన ఈ భాగాన్ని రూ12,000 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించారుదీని తర్వాత 2024 ఫిబ్రవరి 22న గుజరాత్‌లో 87కి.మీపొడవుతో నిర్మించిన వడోదర-భరూచ్ భాగాన్ని ప్రారంభించారుఅనంతరంగుజరాత్‌లోనే మరో రెండు అదనపు భాగాలైన 36 కి.మీ.ల కిమ్-ఈనా27.5 కి.మీ.ల పొడవైన గాందేవ-ఈనా సెక్షన్లను కూడా 2026 జూన్ 5న ప్రధానమంత్రి ప్రారంభించారుఈ ప్రాజెక్టు ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుందనీసరకు రవాణా సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందనీఈ కారిడార్లో పారిశ్రామిక వృద్ధినీపెట్టుబడులనూఉద్యోగావకాశాలనూ పెంపొందిస్తుందనీ అంచనా వేస్తున్నారు.

ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్ మార్గంప్రాంతీయ అనుసంధాన పరివర్తన

ఢిల్లీమీరట్ మధ్య వేగవంతమైనసురక్షితమైనమరింత సమర్థమైన ప్రయాణాన్ని అందించడం ద్వారా జాతీయ రాజధాని ప్రాంతంలో రవాణా అనుసంధాన రూపురేఖలను ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్ వే మార్చివేసిందిదాదాపు 82 కి.మీపొడవున్న ఈ రహదారిని రూ8,346 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేశారుఇది ప్రయాణీకులకూవ్యాపారులకూ ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించింది.

ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని దశల వారీగా పూర్తి చేశారుదీనిలోని వివిధ విభాగాలను 20182021 మధ్య కాలంలో ప్రారంభించారుప్రస్తుతం ఈ రహదారి పశ్చిమ ఉత్తరప్రదేశ్జాతీయ రాజధాని ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలను సులభతరం చేస్తూరద్దీని తగ్గిస్తూప్రాంతీయాభివృద్ధికి సహకరిస్తూ.. భారత దేశంలోనే అత్యంత విజయవంతమైన పట్టణ-ప్రాంతీయ అనుసంధాన ప్రాజెక్టుల్లో ఒకటిగా ఉంది.

ద్వారక ఎక్స్‌ప్రెస్ వేపట్టణ ప్రాంత రవాణాలో సరికొత్త ప్రమాణం

జాతీయ రాజధాని ప్రాంతంలో పట్టణ రవాణా మౌలిక వసతుల అభివృద్ధిలో కీలకమైన విజయంగా ద్వారక ఎక్స్‌ప్రెస్ వే నిలుస్తుందిసుమారు రూ.9,000 కోట్ల వ్యయంతో దాదాపు 29 కి.మీ.ల మేర విస్తరించిన ఈ రహదారి ఢిల్లీగురుగ్రామ్ మధ్య అనుసంధానాన్ని గణనీయంగా మెరుగుపరిచింది.

ఈ ఎక్స్‌ప్రెస్ మార్గానికి సంబంధించిన హర్యానా విభాగాన్ని 2024 మార్చిలోనూఢిల్లీ విభాగాన్ని 2025 ఆగస్టులోనూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారుదీంతో కీలకమైన పట్టణ ప్రాంత రవాణా కారిడార్ పూర్తయిందిఅధునాతన ఇంజినీరింగ్ పరిష్కారాలుబహుళ స్థాయుల్లో ఇంటర్‌ ఛేంజ్‌లుఆధునిక ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థలను కలిగి ఉన్న ఈ ఎక్స్‌ప్రెస్ వే రద్దీని తగ్గిస్తుందనీప్రయాణ సామర్థ్యాన్ని పెంపొందిస్తుందనీఈ ప్రాంతంలో పెరుగుతున్న రవాణా అవసరాలను తీరుస్తుందని అంచనా వేస్తున్నారు.

బెంగళూరు-మైసూర్ ఎక్స్‌ప్రెస్ వేదక్షిణ భారతంలో వృద్ధి వేగం

దక్షిణ భారత దేశంలో మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో ప్రధానమైనదిగా బెంగళూరు-మైసూరు ప్రాజెక్టు ఆవిర్భవించింది118 కి.మీపొడవైన ఈ ప్రాజెక్టును సుమారుగా రూ8,480 కోట్లతో అభివృద్ధి చేశారుదీనిని 2023 మార్చి 12న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు.

ఈ ప్రాజెక్టు బెంగళూరుమైసూరు మధ్య ప్రయాణ సమయాన్ని దాదాపుగా మూడు గంటల నుంచి 75 నిమిషాలకు తగ్గించి రాకపోకలనురహదారి భద్రతనుప్రయాణ సౌకర్యాన్ని గణనీయంగా మెరుగుపరిచిందిఅలాగే ఈ ప్రాంత ఆర్థికాభివృద్ధికి వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడంపర్యాటకాన్ని పెంపొందించడంకొత్త అవకాశాలను కల్పించడం ద్వారా దేశంలోనే అత్యంత నాణ్యమైన రహదారి మౌలిక వసతుల అభివృద్ధికి నమూనాగా నిలుస్తోంది.

ఢిల్లీ-డెహ్రాడూన్ ఆర్థిక కారిడార్అనుసంధానంసుస్థిరతప్రాంతీయ వృద్ధిలో పరివర్తన

అత్యంత వేగవంతమైనసమర్థమైనపర్యావరణం పట్ల బాధ్యతతో కూడిన జాతీయ రహదారుల వ్యవస్థను నిర్మించడంపై భారత్ సారిస్తున్న దృష్టిని ఇంజినీరింగ్ అద్భుతమైన ఢిల్లీ-డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్ ప్రతిబింబిస్తుందిరూ12,000 కోట్ల వ్యయంతో ఈ 213 కి.మీ.ల పొడవైన రహదారిని నిర్మించారుఆరు లేన్లతో కూడిన ఈ ప్రవేశ నియంత్రిత కారిడార్‌ను 2026 ఏప్రిల్ 14న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారుఢిల్లీడెహ్రాడూన్ మధ్య ప్రయాణ సమయాన్ని గంటల నుంచి 2.5 గంటల వరకు తగ్గించిందిప్రయాణ దూరాన్ని 235 కి.మీ.ల నుచి 213 కి.మీ.లకు తగ్గించిందితద్వారా ప్రయాణాలను వేగవంతంగాఇంధన వినియోగాన్ని తగ్గించిసజావుగా సాగేలా చేసింది.

సుస్థిరాభివృద్ధికిపర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం ఢిల్లీ-డెహ్రాడూన్ కారిడార్‌కున్న ప్రధాన ఆకర్షణగణేష్‌పూర్డెహ్రాడూన్ మధ్య ఉన్న 20 కి.మీ.ల మార్గం రాజాజీ నేషనల్ పార్కుశివాలిక్ రిజర్వ్ అటవీ ప్రాంతం మధ్య ఉన్న పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతాల మీదుగా వెళుతుందిఈ జీవావరణ సున్నితత్వాన్ని పరిగణనలోకి తీసుకునిఆసియాలోనే అత్యంత పొడవైన ఎలివేటెడ్ వన్యప్రాణి కారిడార్లలో ఒకటైన 12 కి.మీమార్గాన్ని, 'దాత్-కాళిఆలయం సమీపంలో 370 మీటర్ల సొరంగాన్ని ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించారుఅధునాతన ఇంజనీరింగ్‌ను పర్యావరణ సున్నితత్వంతో మేళవించి అనుసంధానాన్ని పునర్నిర్వచించడమే కాకుండాసుస్థిర జాతీయ రహదారి అభివృద్ధికి నమూనాగా కూడా ఈ ప్రాజెక్టు నిలుస్తోంది.

వికసిత్ భారత్ దార్శనికతను ముందుకు నడిపించడం

గత పన్నెండేళ్లుగా రోడ్డుజాతీయ రహదారుల రంగంలో చోటు చేసుకున్న మార్పులు “ పన్నెండేళ్ల విశ్వాసంఅభివృద్ధిప్రజా సంక్షేమం” అనే స్ఫూర్తికి నిదర్శనంకొనసాగుతున్న పెట్టుబడులువిధానపరమైన సంస్కరణలువేగవంతమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా  రవాణా అనుసంధానాన్ని భారత్ బలోపేతం చేసిందిఆర్థిక అవకాశాలను విస్తరించిలక్షలాది పౌరుల జీవన నాణ్యతను మెరుగుపరిచింది.

భారత్‌మాల పరియోజన అమలుజాతీయ రహదారుల విస్తరణ నుంచి రికార్డు స్థాయిలో నిర్మాణ వేగంప్రతిష్ఠాత్మక ఎక్స్‌ప్రెస్‌వేల అభివృద్ధి వరకు రోడ్డు రవాణాజాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ సాధించిన విజయాలు... మౌలిక వసతుల ఆధారిత అభివృద్ధిదేశ నిర్మాణం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తున్నాయి.

వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేసుకునే దిశగా భారత్ ముందుకు వెళుతున్న నేపథ్యంలో.. భవిష్యత్తు తరాలకు వృద్ధినీసంక్షేమాన్నీసమ్మిళిత వృద్ధినీ అందించే శక్తిమంతమైన ఇంజిన్‌గా ఆధునికమైనసమర్థవంతమైనపటిష్ఠమైన జాతీయ రహదారుల వ్యవస్థ కొనసాగుతుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2272787) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati , Odia , Tamil