ఆర్థిక మంత్రిత్వ శాఖ
‘‘ఆదాయపు పన్ను -2025 కొత్త చట్టంపై అవగాహన సదస్సు: అంతర్జాతీయ పన్నులు, బదలాయింపు ధరల ఖరారు సంబంధిత దృష్టికోణాలు’’ అన్న అంశంపై వెబినార్‌ను నిర్వహించిన సీబీడీటీ
प्रविष्टि तिथि:
12 JUN 2026 11:45AM by PIB Hyderabad
ఆదాయపు పన్ను విభాగం, పీడబ్ల్యూసీ ఇండియా కలిసి ఒక వెబినార్‌ను 2026 జూన్ 9న నిర్వహించాయి. ఈ వెబినార్‌ను.. ఆదాయపు పన్ను నూతన చట్టం- 2025, ఆదాయపు పన్ను కొత్త చట్టం-2026లకు మారడానికి ‘‘ఆదాయపు పన్ను నూతన చట్టం-2025ను అర్థం చేసుకోవడం: అంతర్జాతీయ పన్నులు, బదలాయింపు ధరల ఖరారుకు సంబంధించిన దృష్టికోణాలు’’ శీర్షికన నిర్వహించారు.
ఈ వెబినార్‌లో అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, చైనా, సింగపూర్, సైప్రస్, జపాన్, మారిషస్, కతార్, యూఏఈలు సహా 16 దేశాలకు చెందిన 1,100 మంది కన్నా ఎక్కువ మంది పాల్గొన్నారు. భారత్‌లో మార్పులకు లోనవుతున్న పన్నుల విధాన ప్రాథమిక ప్రణాళికపై పరస్పరం చర్చలతో పాటు జ్ఞానాన్ని కూడా పంచుకోవడానికి కీలక వేదికగా ఈ వెబినార్ ఉపయోగపడింది.
ఆదాయపు పన్ను విభాగం తరఫున ప్రిన్సిపల్ చీఫ్ ఇన్‌కం ట్యాక్స్ కమిషనర్ (ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్) మోనికా భాటియా, ఇన్‌కం ట్యాక్స్ చీఫ్ కమిషనర్ (ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్) శ్రీ రమణ్ చోప్రా, ఇన్‌కం ట్యాక్స్ కమిషనర్ (ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్)-2 డాక్టర్ అంజులా జైన్‌లు పాల్గొనగా, పీడబ్ల్యూసీ ఇండియా పక్షాన సీనియర్ భాగస్వాములు పాలుపంచుకున్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి మోనికా భాటియా ప్రసంగిస్తూ, ఆదాయపు పన్ను చట్టం-2025 లో మార్పుల దిశగా పయనం సాఫీగా సాగడానికి విభాగంతో పాటు ఆసక్తిదారుల ఉమ్మడి ప్రయత్నాలు తోడ్పడ్డాయన్నారు. సరిహద్దులకు ఆవల బదలాయింపు ధరల ఖరారు విధానాలు, అంతర్జాతీయ సహకారం, అంతర్జాతీయ పన్నుల విధాన సంబంధిత విస్తారిత అనుబంధ వ్యవస్థలో భారత్ పాత్ర అంతకంతకూ విస్తరిస్తుండడం.. వీటికి ఉన్న ప్రాధాన్యాన్ని ఆమె సమగ్రంగా వివరించారు. అడ్వాన్స్ ప్రైసింగ్ ఒప్పందాలు విజయవంతం కావడం, వాటికి ఉన్న సందర్భశుద్ధి గురించి కూడా ఆమె మాట్లాడారు. పన్నుచెల్లింపుదారులకు నమ్మకాన్నీ, నియమాలను పాటించడంలో సౌలభ్యాన్నీ కలగజేయడంలో సేఫ్ హార్బర్ నిబంధనలకు ఉన్న ప్రాధాన్యాన్ని మోనికా భాటియా చాటిచెప్పారు.
ఆదాయపు పన్ను చట్టం-2025కీ, ఆదాయపు పన్ను చట్టం-1961కీ మధ్య కీలక మార్పులు, వ్యవస్థాగత సంస్కరణలు, తులనాత్మక కోణాల గురించి ఈ కార్యక్రమంలో ఒక ప్రజెంటేషన్‌ను ఇచ్చారు. దీనిలో.. కొత్తగా ప్రవేశపెట్టిన నియమాలు, ఫారాలు, విధాన సంబంధిత తాజా సమాచారాన్ని తెలిపారు. వెబినార్‌లో పాల్గొన్న వారు ముఖాముఖి కార్యక్రమంలో అనేక ప్రశ్నలను అడగగా ఆదాయపు పన్ను విభాగానికి చెందిన సీనియర్ అధికారులు ఆ ప్రశ్నలకు జవాబులిచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఆహ్వానితులు ప్రశంసిస్తూ, రాబోయే కాలంలో ఇలాంటి మరిన్ని కార్యక్రమాలను ఆదాయపు పన్ను విభాగం నిర్వహిస్తుందని ఆశిస్తున్నామన్నారు.
***
(रिलीज़ आईडी: 2272098)
आगंतुक पटल : 11