ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
భారీ విస్తరణ దిశగా డిజిలాకర్
ఇక దేశవ్యాప్తంగా లక్షల మంది వినియోగదారుల అందుబాటులోకి విద్యుత్తు పంపిణీ సంబంధిత సేవలు
प्रविष्टि तिथि:
10 JUN 2026 9:15PM by PIB Hyderabad
డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారత ప్రధాన డిజిటల్ డాక్యుమెంట్ వాలెట్ ‘డిజిలాకర్’ను దేశమంతటా 68 విద్యుత్తు పంపిణీ కంపెనీలు (డిస్కం), విద్యుత్తు విభాగాలతో విజయవంతంగా అనుసంధానించారు.
ఈ ముఖ్య ఏకీకరణతో మొత్తం 35 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల విద్యుత్తు వినియోగదారులు డిజిలాకర్ యాప్‌లో తమ డిజిటల్ విద్యుత్తు బిల్లులను సురక్షితంగా పొందవచ్చు. ఫలితంగా అవసరమైన ఉపయోగకర దస్తావేజుల నిర్వహణలో ఇదివరకటితో పోలిస్తే ఎక్కువ సౌకర్యం, అందుబాటు, సామర్థ్యం సాధ్యపడుతుంది. దీనిలో దేశవ్యాప్తంగా లక్షల మంది వినియోగదారులకు సేవలను అందిస్తున్న రాష్ట్రాల విద్యుత్తు పంపిణీ కంపెనీలు, నగరపాలక సంస్థల విద్యుత్తు విభాగాలతో పాటు ప్రయివేటు పంపిణీ కంపెనీలు జతపడ్డాయి.
విద్యుత్తు బిల్లులను డిజిలాకర్ ద్వారా అందుబాటులో ఉండేటట్లు చూసుకుంటూ వినియోగదారులు అవసరమైనపుడల్లా తమ తాజా బిల్లులను డిజిటల్ రూపంలో పొందేందుకు వీలు ఉంటుంది. ఈమెయిళ్లలో వెతకడం, బిల్లు ప్రతులను కాగిత రూపంలో దాచడం, సేవా కేంద్రాలను సందర్శించడం వంటి అగత్యాలు తప్పుతాయి. వినియోగదారులు తమ విద్యుత్తు సేవా కేంద్రాలు జారీ చేసిన దస్తావేజులను సురక్షిత, విశ్వసనీయ వేదిక నుంచి పొందేందుకు ఈ ఏకీకరణ ప్రక్రియ తోడ్పడుతుంది.
డిజిలాకర్2లో తమ విద్యుత్తు బిల్లులను ఎలా చూడొచ్చో, దీనికి సంబంధించిన దశలవారీ వీడియో గైడ్‌ను చూడటానికి ఈ కింద లింకును క్లిక్ చేయగలరు:
https://www.youtube.com/watch?v=s8zl_kK_1sk
డిజిలాకర్‌లో ప్రస్తుతం అందుబాటులోకి వచ్చినముఖ్య ప్రభుత్వ, ప్రయివేటు కంపెనీలు:
1. దక్షిణాచల్ విద్యుత్ వితరణ్ నిగమ్
2. మధ్యాంచల్ విద్యుత్ వితరణ్ నిగమ్
3. పశ్చిమాంచల్ విద్యుత్ వితరణ్ నిగమ్
4. బెంగళూరు ఎలక్ట్రిక్ సప్లయ్ కంపెనీ
5. దక్షిణ్ హర్యానా బిజ్‌లీ నిగమ్
6. జార్ఖండ్ బిజ్‌లీ వితరణ్ నిగమ్
7. బీఎస్ఈఎస్ రాజ్‌ధాని పవర్
8. బీఎస్ఈఎస్ యమునా పవర్
9. చండీగఢ్ పవర్ డిస్ట్రిబ్యూషన్
10. నోయిడా పవర్ కంపెనీ తదితర సంస్థలు.
భారత్‌లో డిజిటల్ యుటిలిటీ విస్తారిత అనుబంధ వ్యవస్థను పటిష్ఠపరచడం
పౌరుల అతి ముఖ్య దస్తావేజులను ఒక సురక్షిత డిజిటల్ వేదిక సాయంతో ఇట్టే అందుబాటులోకి తీసుకువచ్చే దిశగా డిజిలాకర్ చేస్తున్న ప్రయత్నాల్లో అరవై ఎనిమిది విద్యుత్తు కంపెనీలు అనుసంధానం కావడం ఒక ప్రధాన ఘట్టం. డిజిలాకర్ తన అనుబంధ వ్యవస్థను పొడిగించుకుంటూ పోయే కొద్దీ, పౌరులకు ప్రభుత్వ, వినిమయ అంశాలను సులువుగా పొందగలుగుతారు. మరో వైపు, సంస్థలకు కూడా డిజిటల్ సేవల లభ్యతతో ముడిపడిన ప్రయోజనాలు చేకూరుతాయి.

***
(रिलीज़ आईडी: 2271607)
आगंतुक पटल : 6