ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గౌరవం, సేవల నుంచి స్ఫూర్తిని పొందిన ప్రజా ఉద్యమంగా


రూపుదాల్చిన పరిపాలన విధానాన్ని వివరిస్తూ కాలమిస్టు, రచయిత శ్రీ సుహేల్ సేథ్ రాసిన
వ్యాసాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 10 JUN 2026 10:21PM by PIB Hyderabad

కాలమిస్టు, రచయిత శ్రీ సుహేల్ సేథ్ రాసిన ఓ వ్యాసాన్ని ప్రజలతో ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ పంచుకున్నారు.
ఈ వ్యాసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పదవీ కాలంపై అభిప్రాయాలను వివరిస్తూ సాగింది. శ్రీ నరేంద్ర మోదీ ఎవరూ అనుసరించని విధానాలను అమలులోకి తెచ్చారని... ఆత్మగౌరవం, ప్రభావవంతమైన సేవల అందజేతల నుంచి స్ఫూర్తిని పొందిన ప్రజా ఉద్యమంగా పాలన రూపురేఖలను తీర్చిదిద్దారని ఈ వ్యాసంలో  శ్రీ సుహేల్ సేథ్ పేర్కొన్నారు. ప్రభావవంతమైన ప్రధానమంత్రిగా శ్రీ మోదీ పేరు తెచ్చుకున్నారనా, భారత్‌కు కావలసిన సమర్థ సారథ్యాన్ని ఆయన అందించారని శ్రీ సేథ్ తన వ్యాసంలో స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో  ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ :
‘‘ఈ వ్యాసంలో, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పదవీ కాలంపై శ్రీ సుహేల్ సేథ్ తన అభిప్రాయాలను పొందుపరిచారు. ఆయన (శ్రీ మోదీ) ఎవరూ అనుసరించని విధానాలను అమలులోకి తెచ్చారని... ఆత్మగౌరవం, ప్రభావవంతమైన సేవల అందజేతల నుంచి స్ఫూర్తిని పొందిన ప్రజా ఉద్యమంగా పాలన రూపురేఖలను తీర్చిదిద్దారని శ్రీ సుహేల్ సేథ్ రాశారు. ప్రభావవంతమైన  ప్రధానమంత్రిగా శ్రీ మోదీ పేరు తెచ్చుకున్నారని, భారత్‌కు కావలసిన సమర్థ సారథ్యాన్ని అందించారని శ్రీ సేథ్ స్పష్టం చేశారు’’ అని పేర్కొన్నారు.

***


(रिलीज़ आईडी: 2271542) आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Tamil , English , Urdu , हिन्दी , Bengali , Assamese , Punjabi , Gujarati , Kannada , Malayalam