ప్రధాన మంత్రి కార్యాలయం
ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్ ఆత్మీయ శుభాకాంక్షలకు కృతజ్ఞతలు తెలిపిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
10 JUN 2026 7:25PM by PIB Hyderabad
తనకు ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపిన ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు కృతజ్ఞతలు తెలిపారు. దేశ సేవలో మరింత కష్టపడి పని చేసేందుకు భారత ప్రజల విశ్వాసం, ఆశీస్సులు తనకు స్ఫూర్తినిస్తాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
సుసంపన్నమైన మన నాగరికతా వారసత్వం పట్ల గర్వపడే 'వికసిత్ భారత్' నిర్మాణమే తన ప్రయత్నాలన్నింటికీ దిశానిర్దేశం చేస్తుందని శ్రీ మోదీ పేర్కొన్నారు. మన తోటి భారతీయులందరి కలలు, ఆకాంక్షలను సాకారం చేసే దిశగా అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతామని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు.
‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
"ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్ గారూ, మీ ఆత్మీయ శుభాకాంక్షలకు ధన్యవాదాలు.
భారత ప్రజల విశ్వాసం, ఆశీస్సులు దేశ సేవలో మరింత కష్టపడి పని చేసేలా నాకు స్ఫూర్తినిస్తాయి. సుసంపన్నమైన మన నాగరికతా వారసత్వం పట్ల గర్వపడే 'వికసిత్ భారత్' ను నిర్మించడమే లక్ష్యంగా నా ప్రయత్నాలన్నీ కొనసాగుతాయి. మన తోటి భారతీయుల కలలు, ఆకాంక్షలను సాకారం చేయడంలో అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి..."
***
(రిలీజ్ ఐడి: 2271342)
సందర్శకుల సూచీ సంఖ్య : : 60
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam