ప్రధాన మంత్రి కార్యాలయం
సుపరిపాలన అందించేందుకు, ప్రజల విశ్వాసాన్ని సంపాదించేందుకు ప్రజా సేవ అతిపెద్ద పరీక్ష వంటిదని ప్రస్తావిస్తూ, సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
10 JUN 2026 11:00AM by PIB Hyderabad
సుపరిపాలనకు ప్రజాసేవే అతిపెద్ద పరీక్ష అని పేర్కొంటూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఒక సంస్కృత సుభాషితాన్ని పంచుకున్నారు. వినయం, అంకితభావం, కర్తవ్యం పట్ల నిబద్ధతతో పనిచేసే వారు ప్రజల విశ్వాసాన్ని పొందగలరని ప్రధానమంత్రి అన్నారు.
సామాజిక మాధ్యమం 'ఎక్స్' పోస్టులో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.
"సుపరిపాలనకు ప్రజాసేవే అతిపెద్ద పరీక్ష. వినయం, అంకితభావం, కర్తవ్యం పట్ల నిబద్ధతతో నిలకడగా పనిచేసే వారు మాత్రమే ప్రజల విశ్వాసాన్ని పొందుతారు.
సదానురక్తప్రకృతిః ప్రజాపాలనతత్పరః
వినీతాత్మా హి నృపతిభ్రూయసీ శ్రియమశ్నుతే"
సేవను పవిత్రమైన బాధ్యతగా భావించి, ప్రజల సంక్షేమం కోసం అవిశ్రాంతంగా శ్రమిస్తూ.. సుపరిపాలన ద్వారా భద్రతను కల్పిస్తూ, సుభిక్షంగా ఉండేలా చేస్తూ.. వినయం, క్రమశిక్షణ, అభివృద్ధి పట్ల అంకితభావంతో సమాజ పురోగతికి కృషి చేసే ప్రజాప్రతినిధి మాత్రమే ప్రజల విశ్వాసాన్ని, గౌరవాన్ని, గుర్తింపును, ప్రాముఖ్యతను పొందుతాడు.
***
(రిలీజ్ ఐడి: 2271007)
సందర్శకుల సూచీ సంఖ్య : : 58
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam