రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మహబూబ్‌నగర్-సికింద్రాబాద్-మేడ్చల్ సెక్షన్‌లో ఎలక్ట్రిక్ ట్రాక్షన్ సిస్టమ్ అప్‌గ్రేడేషన్‌కు భారతీయ రైల్వే ఆమోదం

प्रविष्टि तिथि: 08 JUN 2026 6:03PM by PIB Hyderabad

 దక్షిణ మధ్య రైల్వేలోని మహబూబ్‌నగర్సికింద్రాబాద్-మేడ్చల్ సెక్షన్‌లో రైల్వే కార్యకలాపాలను మరింత మెరుగుపరిచేందుకు భారతీయ రైల్వే ఒక కీలక ప్రాజెక్టును మంజూరు చేసిందిఈ ప్రాజెక్టు కిందప్రస్తుతం ఉన్న 1x25 కేవీ ఎలక్ట్రిక్ ట్రాక్షన్ సిస్టమ్‌ను ఆధునిక 2x25 కేవీ ఎలక్ట్రిక్ ట్రాక్షన్ సిస్టమ్‌గా అప్‌గ్రేడ్ చేయనున్నారుసుమారు 141 రూట్ కిలోమీటర్ల పొడవున్న ఈ రైలు మార్గంలో రూ.285.01 కోట్ల వ్యయంతో పనులు చేపట్టనున్నారు.

దేశవ్యాప్తంగా రద్దీగా ఉండే రైలు మార్గాల్లో సామర్థ్యాన్ని పెంపొందించడం కోసం భారతీయ రైల్వే నిరంతర కృషిలో ఈ ప్రాజెక్టు ఒక భాగం. 2x25 కేవీ వ్యవస్థను ప్రవేశపెట్టడం ద్వారా రైల్వే కార్యకలాపాలకు మరింత స్థిరమైనసమర్థమైన విద్యుత్ సరఫరా లభిస్తుందిదీనివల్ల రైల్వే సేవలు మరింత సులభంగాసురక్షితంగావిశ్వసనీయంగా మారతాయి.

దేశంలోని ముఖ్యమైన హై-డెన్సిటీ నెట్‌వర్క్ (హెచ్‌డీఎన్మార్గాల్లో మహబూబ్‌నగర్సికింద్రాబాద్-మేడ్చల్ సెక్షన్ ఒకటిఇది ధర్మవరండోన్మహబూబ్‌నగర్-సికింద్రాబాద్మేడ్చల్ముఖేడ్ఇండోర్-అజ్మేర్ రైల్ కారిడార్‌లో భాగంగా ఉందిఈ మార్గంలో ప్రయాణికులసరుకు రవాణా గణనీయంగా ఉంటుంది.

ఈ ప్రాజెక్టు ద్వారా ఈ మార్గంలో రైల్వే కార్యకలాపాలు మరింత మెరుగుపడతాయిసరుకు రవాణా మరింత సమర్థంగా మారడం సహా... దాని వేగంసామర్థ్యం రెండూ మెరుగవుతాయిఈ ప్రాజెక్టుతో ఈ ప్రాంతమంతటా వాణిజ్యంపరిశ్రమలుఆర్థిక కార్యకలాపాలకు ఊతం లభిస్తుందని భావిస్తున్నారు.

ఆధునికభవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న రైల్వే నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయాలనే భారతీయ రైల్వే నిబద్ధతను ఈ ప్రాజెక్టు మరింత బలోపేతం చేస్తుందిమెరుగైన రైల్వే మౌలిక సదుపాయాలుకార్యాచరణ సామర్థ్యం ద్వారా ప్రయాణికులకుపరిశ్రమలకూ ఇది ప్రయోజనం చేకూరుస్తుంది.

 

 ***


(रिलीज़ आईडी: 2270591) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Gujarati , Odia , Tamil , Kannada