మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
శాఫ్ మహిళల ఛాంపియన్‌షిప్-2026 టైటిల్ గెలిచిన భారత మహిళల ఫుట్‌బాల్ జట్టుకి కేంద్రమంత్రి శ్రీమతి అన్నపూర్ణా దేవి అభినందనలు
प्रविष्टि तिथि:
07 JUN 2026 11:55AM by PIB Hyderabad
శాఫ్ మహిళల ఛాంపియన్‌షిప్-2026 టైటిల్ గెలిచిన భారత మహిళల ఫుట్‌బాల్ జట్టుకు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి అన్నపూర్ణా దేవి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
భారతదేశ కుమార్తెలు చరిత్ర సృష్టించారని సామాజిక మాధ్యమం ఎక్స్ పోస్టులో కేంద్రమంత్రి కొనియాడారు. శాఫ్ మహిళల ఛాంపియన్‌షిప్-2026 గెలిచిన మహిళల ఫుట్‌బాల్ జట్టు యావత్ దేశం గర్వించేలా చేసిందన్నారు. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాటలు లక్షలాది మంది యువ క్రీడాకారులకు, భరతమాత పుత్రికలకు ఎంతో స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఈ విజయం నారీ శక్తికి, అంకితభావానికి, నవభారత ఆత్మ విశ్వాసానికి ప్రతీకని పేర్కొన్నారు.
జట్టు సభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేసి, వారి ఉజ్వల భవిష్యత్తుకు కేంద్రమంత్రి శుభాకాంక్షలు చెప్పారు.
***
(रिलीज़ आईडी: 2270208)
आगंतुक पटल : 14