లోక్‌సభ సచివాలయం
azadi ka amrit mahotsav

వికసిత్ భారత్ 2047కు ప్రజా భాగస్వామ్యం, ఔత్సాహిక పారిశ్రామికరంగం, ఆవిష్కరణే ప్రధానం: లోక్‌సభ స్పీకర్


అభివృద్ధి చెందిన దేశం దిశగా భారత్‌ను ముందుకు నడిపించాలని యువతకు పిలుపునిచ్చిన లోక్‌సభ స్పీకర్

మహేశ్వరి సమాజానికున్న సేవాభావం, నైతిక విలువలు, వ్యాపార స్ఫూర్తి దేశ నిర్మాణాన్ని బలోపేతం చేస్తాయి: లోక్‌సభ స్పీకర్
ఔత్సాహిక పారిశ్రామిక రంగం, జాతి నిర్మాణం కలసికట్టుగా అభివృద్ధి చెందాలని స్పష్టం చేసిన స్పీకర్

‘‘మహేశ్వరీస్ అండ్ ది మేకింగ్ ఆఫ్ వికసిత్ భారత్ 2047’’ కార్యక్రమంలో ప్రసంగించిన లోక్‌సభ స్పీకర్

प्रविष्टि तिथि: 07 JUN 2026 9:33PM by PIB Hyderabad

ప్రజల భాగస్వామ్యంఆవిష్కరణఔత్సాహిక పారిశ్రామిక రంగంసమష్టి సంకల్పంతోనే వికసిత్ భారత్ 2047 లక్ష్యం సాకారమవుతుందని లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం ప్రకాశ్ బిర్లా ఈ రోజు స్పష్టం చేశారు. ‘మహేశ్వరీస్ అండ్ మేకింగ్ ఆఫ్ వికసిత్ భారత్ 2047’ పేరుతో న్యూఢిల్లీలోని మహేశ్వరి సమాజం నిర్వహించిన జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారుఔత్సాహిక పారిశ్రామిక రంగంజాతి నిర్మాణం కలసి పురోగతి సాధించాలనిఅభివృద్ధి ఫలాలు సమాజంలోని ప్రతి వర్గానికి చేరువ కావాలన్నారుఅభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు భారత్ చేస్తున్న ప్రయాణం సమ్మిళిత వృద్ధిసామాజిక బాధ్యతక్రియాశీల పౌర భాగస్వామ్యం ద్వారా సాగాలని చెప్పారు.

భారత ఆర్థికసామాజిక రంగంలో ఓ చైతన్యవంతమైన శక్తిగా మహేశ్వరి సమాజాన్ని శ్రీ బిర్లా వర్ణించారుసేవనైతిక విలువలతో కూడిన వ్యాపార పద్ధతులుదాతృత్వంసామాజిక బాధ్యత ద్వారా దేశ నిర్మాణానికి వారు చేసిన అమూల్యమైన కృషిని ప్రశంసించారువిద్యవైద్యంప్రజాసేవ కోసం వివిధ ప్రాంతాల్లో సంస్థలను స్థాపించడంవాటిని నిర్వహించడం ద్వారా సామాజిక సంక్షేమం కోసం ఈ సమాజం నిరంతరం ప్రయత్నిస్తోందని ఆయన తెలియజేశారు.

పరిస్థితులకు అనుగుణంగా మారే తత్వాన్నివ్యాపార దక్షతను మహేశ్వరి సమాజం ప్రదర్శిస్తూ.. ప్రాంతీయ ఆర్థిక పరివర్తనలను ముందుకు నడిపించిందని లోక్ సభ స్పీకర్ అన్నారుమెట్రోపాలిటన్ కేంద్రాలైనాఈశాన్య ప్రాంతమైనా లేదా దక్షిణ భారతమైనా.. ఈ సమాజానికి చెందిన వారు అవకాశాలను సృష్టించారుఉపాధిని కల్పించారుస్థానిక ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేశారునిజాయతీనైతిక విలువలుసామాజిక సామరస్యం పట్ల ఉన్న నిబద్ధతతో ఈ సమాజం.. వ్యాపార ప్రపంచంలో మార్గదర్శక ప్రమాణాలను నెలకొల్పింది.

సంపదను సృష్టించడం ఒక్కటే విజయానికి నిజమైన కొలమానం కాదనీవిలువసానుకూల సామాజిక మార్పును తీసుకురావడమేనని శ్రీ బిర్లా చెప్పారుశ్రీ ఆనంద్ రాఠీ సాధించిన పారిశ్రామిక విజయాలను ప్రశంసించారుఆయన మార్గదర్శక ప్రయాణం అనేక తరాల పాటు యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తిగా నిలుస్తుందని తెలియజేశారుజస్టిస్ జేకే మహేశ్వరి చేసిన సేవలను కూడా ఆయన ప్రశంసించారున్యాయ వ్యవస్థను బలోపేతం చేయడంలోనూన్యాయ సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడంలోనూ ఆయన చేసిన కృషి.. కీలక పాత్రను పోషించిందని తెలియజేశారుఇలాంటి విశిష్ట వ్యక్తులు సమాజంలోని ఉత్కృష్టతనాయకత్వంప్రజాసేవ అనే గొప్ప సంప్రదాయాలను ప్రతిబింబిస్తారని వివరించారు.

భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత పోషించే పాత్రను శ్రీ బిర్లా వివరించారువికసిత్ భారత్ - 2047 లక్ష్యానికి విద్యావంతులైననైపుణ్యాలున్నసాంకేతిక పరిజ్ఞానం కలిగిన యువతే అతి పెద్ద బలం అని ఆయన అన్నారుప్రపంచ అగ్రగామిగా భారత్‌ను నిలబెట్టేందుకు ఆవిష్కరణలనూకృత్రిమ మేధనూనూతనంగా ఆవిర్భవిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాలనూ యువత స్వీకరించాలని ఆయన కోరారురాబోయే యుగం విజ్ఞానంఆవిష్కరణలతోనే ముందుకు సాగుతుందని ఆయన చెప్పారుఉద్యోగాలను అన్వేషించేవారిగా కాకుండా.. ఉద్యోగాలను కల్పించేవారిగా యువత మారాలని పిలుపునిచ్చారు.

గత దశాబ్దంలో భారత్ సాధించిన పురోగతి దేశ స్థిరత్వాన్నిఆత్మవిశ్వాసాన్నిసమష్టి సంకల్పాన్ని ప్రదర్శించిందనీ స్పీకర్ చెప్పారుహక్కులను బాధ్యతలతో సమతుల్యం చేసుకోవాల్సిన ప్రాధాన్యాన్ని ఆయన స్పష్టం చేశారుదేశాభివృద్ధిని కొనసాగించడానికి బాధ్యతాయుతమైన పౌరసత్వంవ్యవస్థల పట్ల గౌరవంప్రజాజీవితంలో చురుకైన భాగస్వామ్యం అవసరమని స్పీకర్ స్పష్టం చేశారుపార్లమెంటుప్రజాస్వామ్య సంస్థల ద్వారా చేపట్టిన శాసన సంస్కరణలు పారదర్శకతను గణనీయమైన రీతిలో పెంచాయనీవ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరిచాయనీ ఆయన తెలియజేశారు.

ఐక్యతా స్ఫూర్తిసేవవ్యాపారం, ‘దేశమే ముందు’ అనే సూత్రం ద్వారా వికసిత్ భారత్ - 2047 లక్ష్యాన్ని దేశం సాధించగలదనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ శ్రీ బిర్లా తన ప్రసంగాన్ని ముగించారుఆవిష్కరణలునైతిక విలువలతో కూడిన నాయకత్వంసామాజిక నిబద్ధత ద్వారా దేశాభివృద్ధికి దోహదపడాలని మహేశ్వరి సమాజానికి ముఖ్యంగా యువతకు పిలుపునిచ్చారుప్రగతిలో ప్రతి పౌరుడూ చురుగ్గా పాల్గొన్నప్పుడేసామాజిక బాధ్యతసామూహిక సంక్షేమంతో కలసి ఆర్థిక వృద్ధి కలసి నడిచినప్పుడే అభివృద్ధి చెందిన భారత్ నిర్మితమవుతుందని శ్రీ బిర్లా స్పష్టం చేశారు.

 

***


(रिलीज़ आईडी: 2270207) आगंतुक पटल : 33
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali