ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గుజరాత్‌లోని హజీరాలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను సందర్శించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 05 JUN 2026 10:08PM by PIB Hyderabad

గుజరాత్‌లోని హజీరాలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సందర్శించారు. ‘భారత్‌లో తయారీ’ కార్యక్రమం కింద రక్షణ రంగంలో దేశం సాధిస్తున్న అభివృద్ధి, పెరుగుతున్న సామర్థ్యాలను ఆయన ఈ సందర్భంగా పరిశీలించారు.

రక్షణ రంగంలో స్వదేశీకరణ, ఆత్మనిర్భరతను పెంపొందించడానికి జరుగుతున్న లక్ష్యబద్ధమైన ప్రయత్నాలకు ఈ ప్రదర్శన ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు:

"గుజరాత్‌లోని హజీరాలో ఏర్పాటు చేసిన ప్రదర్శనకు హాజరయ్యే అవకాశం లభించింది. ‘భారత్‌లో తయారీ’ కార్యక్రమం కింద రక్షణ రంగంలో మన దేశం సాధిస్తున్న అద్భుతమైన సామర్థ్యాలను నేను ఇక్కడ స్వయంగా వీక్షించాను. రక్షణ రంగంలో స్వదేశీకరణను పెంపొందించడానికి మనం చేస్తున్న కృషికి ఈ ప్రదర్శన ఒక అద్భుతమైన ఉదాహరణ.”


(रिलीज़ आईडी: 2269927) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Manipuri , Gujarati , Tamil , Kannada , Malayalam