సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఉత్తర ప్రదేశ్ లోని వారణాసిలో రెండో బ్రిక్స్ సాంస్కృతిక కార్యాచరణ బృందం సమావేశం


ప్రారంభ సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ వివేక్ అగర్వాల్

प्रविष्टि तिथि: 04 JUN 2026 7:03PM by PIB Hyderabad

బ్రిక్స్ సభ్య దేశాల భాగస్వామ్యంతో రెండో బ్రిక్స్ సాంస్కతిక కార్యాచరణ బృందం (సీడబ్ల్యూజీ) రెండు రోజుల సమావేశాలు ఈరోజు ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో  ప్రారంభమయ్యాయి. ప్రారంభ సమావేశానికి భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ వివేక్ అగర్వాల్ అధ్యక్షత వహించారు. బ్రెజిల్, చైనా, ఇండోనేషియా, ఇరాన్, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల ప్రతినిధులు స్వయంగా  హాజరుకాగా, ఇథియోపియా, ఈజిప్ట్ రష్యన్ ఫెడరేషన్ ప్రతినిధులు వర్చువల్ గా  పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభ్య దేశాలు ఎజెండాలోని అంశాలపై తమ ప్రాధాన్యతలను, దృక్పథాలను పంచుకున్నాయి.

 

సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ,  ప్రజల మధ్య సహకారం: ఆవిష్కరణలు, భాగస్వామ్యాలు భవిష్యత్తు కార్యాచరణ అనే ఇతివృత్తంతో  జరిగిన మొదటి ప్యానెల్ చర్చకు భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ వివేక్ అగర్వాల్ సమన్వయకర్తగా వ్యవహరించారు. సమ్మేళిత అభివృద్ధి, సామాజిక సామరస్యం, సాంస్కృతిక మార్పిడి, మార్కెట్ లభ్యత, డిజిటల్ ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ పాత్రపై ఈ చర్చ ప్రధానంగా దృష్టి సారించింది.

సృజనాత్మక ఆర్థిక వ్యవస్థలో కాపీరైట్,  నైతిక విలువల ఆధారిత కృత్రిమ మేధ, ఉత్తమ పద్ధతులను పెంపొందించడం అనే ఇతివృత్తంతో జరిగిన రెండవ ప్యానెల్ చర్చకు ఐజీఎన్‌సీఏ సభ్య కార్యదర్శి డాక్టర్ సచ్చిదానంద్ జోషి సమన్వయకర్తగా  వ్యవహరించారు. సృజనాత్మక రంగంలో కాపీరైట్ పరిరక్షణ, సాంస్కృతిక గుర్తింపు,  కృత్రిమ మేధ ) వినియోగానికి సంబంధించిన నైతిక అంశాల ప్రాధాన్యతను ఈ చర్చలు ప్రముఖంగా ప్రస్తావించాయి. బ్రిక్స్ దేశాల మధ్య భవిష్యత్తు సహకారానికి ఉన్న అవకాశాలను కూడా ఇందులో అన్వేషించారు.

 

భారత సుసంపన్నమైన, విభిన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని చాటిచెప్పేలా నిర్వహించిన  సాంస్కృతిక కార్యక్రమంతో ఈ సమావేశాలు ముగిశాయి. దేశంలోని వివిధ ప్రాంతాల విశిష్ట సంగీత సంప్రదాయాలను ప్రతిబింబించేలా ప్రదర్శించిన సంగీత సమ్మేళనం భారత సాంస్కృతిక వైవిధ్యాన్ని, ఐక్యతను ఆవిష్కరించింది.  కలర్స్ ఆఫ్ ఇండియా  పేరుతో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రకాల శాస్త్రీయ,  జానపద నృత్య రూపాలను ప్రదర్శిస్తూ ఒక శక్తివంతమైన సాంస్కృతిక ప్రదర్శనను కూడా ఏర్పాటు చేశారు. ఇది భారత సంపన్న కళా సంప్రదాయాలను  సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతినిధులకు కళ్లకు కట్టినట్లు చూపించింది.

ఈ సమావేశం 2026 జూన్ 5న కూడా కొనసాగుతుంది. ఇందులో బ్రిక్స్ సభ్య దేశాల మధ్య సాంస్కృతిక సహకారానికి సంబంధించిన ప్రాధాన్యతా రంగాలపై మరింతగా చర్చిస్తారు.

***


(रिलीज़ आईडी: 2269157) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: हिन्दी , English , Urdu , Tamil