ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రితో నేపాల్ రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ చైర్మన్ భేటీ
प्रविष्टि तिथि:
03 JUN 2026 3:03PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో నేపాల్ రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ చైర్మన్ శ్రీ రబీ లామిఛానే ఈ రోజు సమావేశమయ్యారు.
శ్రీ లామిఛానేతో భేటీ అయినందుకు ప్రధానమంత్రి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ‘ఉమ్మడి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కలిసి పనిచేయాలని ఉందన్న శ్రీ లామిఛానే అభిలాషను స్వాగతిస్తున్నాను. ఆయన అభిలాషను పూర్తి స్థాయిలో సమర్ధిస్తున్నాను’ అని ప్రధానమంత్రి అన్నారు.
‘ఇరుగుపొరుగు దేశాలకు ప్రాధాన్యం’ విధానంలో భాగంగా నేపాల్ ఓ ప్రధాన భాగస్వామ్య దేశమని శ్రీ మోదీ అన్నారు. రెండు దేశాల మధ్య ప్రత్యేక, బహుముఖీన సంబంధాల్లో కొత్త అధ్యాయాలను రచించడానికి నూతన ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని భారత్ ఉత్సాహంతో ఉందని ఆయన స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘నేపాల్ రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ చైర్మన్ శ్రీ రబీ లామిఛానేతో భేటీ అయినందుకు సంతోషంగా ఉంది. ఉమ్మడి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కలిసి పనిచేయాలన్న ఆయన అభిలాషను స్వాగతిస్తున్నాను. ఆ అభిలాషతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.
మనం అనుసరిస్తున్న ‘ఇరుగుపొరుగు దేశాలకు ప్రాధాన్యం’ విధానంలో భాగంగా ప్రధాన భాగస్వామ్య దేశాల్లో ఒకటిగా నేపాల్ ఉంది. మన ఇరు దేశాల మధ్య గల ప్రత్యేక, బహుముఖీన సంబంధాల్ని మరింత విస్తరించడానికి కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని భారత్ ఉత్సాహంతో ఉంది’’ అని పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 2268393)
आगंतुक पटल : 14
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam