మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

యువసంగమ్ ఆరో దశ కింద మేఘాలయ విద్యార్థి ప్రతినిధి బృందంతో సంభాషించిన తెలంగాణ గవర్నర్

నాడు పోస్టు చేయడమైనది: 02 JUN 2026 12:24PM by PIB Hyderabad

మేఘాలయ విద్యార్థి ప్రతినిధి బృందంతో 2026 మే 28న హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సమావేశమయ్యారు.

యువతలో జాతీయ సమైక్యతనువిభిన్న సంస్కృతుల అవగాహనను పెంపొందించే లక్ష్యంతో చేపట్టిన విద్యా సాంస్కృతిక వినిమయ కార్యక్రమంలో భాగంగా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్షిల్లాంగ్ నేతృత్వంలోని విద్యార్థి ప్రతినిధి బృందం తెలంగాణలో పర్యటిస్తోంది.

అంతకుముందు మే 25.. ఈ పర్యటనకు ఆతిథ్య సంస్థ అయిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్‌లో ఈ విద్యార్థుల ప్రతినిధి బృందానికి ఘనస్వాగతం లభించిందిదీంతో రాష్ట్రవ్యాప్తంగా వారి సమగ్ర అవగాహనసాంస్కృతిక అధ్యయన ప్రయాణం ప్రారంభమైంది.

జాతీయ సమైక్యతను బలోపేతం చేయడంలోసాంస్కృతిక అవగాహనను పెంపొందించడంలోదేశ నిర్మాణానికి దోహదపడడంలో యువత కీలక పాత్ర పోషిస్తుందని ఈ సమావేశంలో గవర్నర్ వివరించారుఈ సందర్భంగా యువసంగమ్ యాత్ర అనుభవాలను పంచుకున్న ప్రతినిధులు.. గౌరవ సూచకంగా గవర్నర్‌కు ఒక జ్ఞాపికను బహూకరించారుదేశ వైవిధ్యంప్రజాస్వామ్య విలువలుఐక్యతా స్ఫూర్తిపై విద్యార్థుల అవగాహనను ఈ సమావేశం మరింత మెరుగుపరిచింది.

హుస్సేన్ సాగర్సమతా మూర్తిరామప్ప ఆలయంవరంగల్ కోటభద్రకాళి ఆలయంవెయ్యి స్తంభాల గుడి వంటి ప్రసిద్ధ చారిత్రక ప్రదేశాలతోపాటు సాంస్కృతికవిద్యాఆవిష్కరణ కేంద్రాలను విద్యార్థి ప్రతినిధి బృందం సందర్శించిందిసుసంపన్నమైన తెలంగాణ వారసత్వంసాంస్కృతిక పరంపరవిద్యా నైపుణ్యంఅభివృద్ధి కార్యక్రమాలపై విలువైన సమాచారాన్ని వారు తెలుసుకున్నారుకన్హా శాంతి వనంటి-హబ్‌లను కూడా సందర్శించి.. సంపూర్ణ ఆరోగ్య పద్ధతులతోపాటు దేశంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఆవిష్కరణఅంకుర సంస్థల గురించిన విశేషాలను తెలుసుకున్నారు.

ఎన్ఐటీవరంగల్‌లో పరిశోధన ఆవిష్కరణ కేంద్రాలను వారు పరిశీలించారుపర్యావరణ సుస్థిరతను ప్రోత్సహించే మొక్కల పెంపకం కార్యక్రమంలో పాల్గొన్నారుయువసంగమ్ ప్రయాణంలో వారి అభ్యసనానుభవాలుసాంస్కృతిక అధ్యయన కార్యక్రమాన్ని ముగిస్తూ.. 2026 మే 30న వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొన్నారు. 2026 మే 31న విద్యార్థి ప్రతినిధి బృందం మేఘాలయకు బయలుదేరింది.

విద్యా మంత్రిత్వశాఖ పరిధిలోని ఉన్నత విద్యాశాఖ యువసంగమ్ ఆరో దశ కార్యక్రమాన్ని ప్రారంభించిందిసమగ్ర విద్యాసాంస్కృతిక కార్యక్రమాల ద్వారా జాతీయ సమైక్యతను బలోపేతం చేయడంసాంస్కృతిక సామరస్యంభావోద్వేగాల ఏకీకరణ దీని ప్రధాన లక్ష్యాలుఈ కార్యక్రమం 22 రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులను ఒకచోట చేర్చి.. భారత్ వైవిధ్యంఆవిష్కరణ వ్యవస్థలుదేశ నిర్మాణానికి సంబంధించి సమష్టి ఆకాంక్షల దిశగా విస్తృతమైన అవగాహన మార్గాలను అందిస్తుంది  

***


(రిలీజ్ ఐడి: 2267966) సందర్శకుల సూచీ సంఖ్య : : 12
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Assamese , Tamil