ప్రధాన మంత్రి కార్యాలయం
దృఢసంకల్పం, ఆత్మనిగ్రహం, వివేకం వంటి సద్గుణాల విలువను చాటే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధాని
प्रविष्टि तिथि:
02 JUN 2026 8:30AM by PIB Hyderabad
దృఢ సంకల్పం, ఆత్మనిగ్రహం వంటి లక్షణాలను.. అత్యంత కష్టతరమైన మార్గాలను కూడా సులభతరం చేసే శక్తులుగా పేర్కొంటూ ఒక సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రజలతో పంచుకున్నారు. ఇదే సంకల్పంతో నేడు మన యువత నిరంతరం దేశ నిర్మాణంలో నిమగ్నమై ఉన్నారని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
‘‘దృఢ సంకల్పం, ఆత్మనిగ్రహాలు.. అత్యంత కష్టతరమైన మార్గాలను సైతం సులభతరం చేసే శక్తులు. ఇదే సంకల్పంతో నేడు మన యువత దేశ నిర్మాణంలో అవిశ్రాంతంగా నిమగ్నమై ఉన్నారు.
నిశ్చిత్య యః ప్రక్రమతే
నాన్తర్వసతి కర్మణః
అబన్ధ్యకాలో వశ్యాత్మ
స వై పండిత ఉచ్యతే.
ఒక పనిని జాగ్రత్తగా ఆలోచించి, దృఢ సంకల్పంతో ప్రారంభించి, ఎన్నడూ దానిని అసంపూర్తిగా వదిలిపెట్టకుండా, సమయాన్ని తెలివిగా ఉపయోగించుకుంటూ, ఇంద్రియాలపై పూర్తి అదుపును కలిగి ఉండే వ్యక్తి మాత్రమే నిజమైన జ్ఞాని.
***
(रिलीज़ आईडी: 2267912)
आगंतुक पटल : 78
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam