నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పీఎం-సేతు (PM-SETU) కింద మొదటి వ్యూహాత్మక పెట్టుబడి ప్రణాళిక ఆమోదం పొందిన ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా; పరిశ్రమల భాగస్వామ్యంతో ఐటీఐల మార్పులో ముందంజలో నిలిచిన ఆంధ్రప్రదేశ్

విశాఖపట్నం ఐటిఐ క్లస్టర్కు జాతీయ స్టీరింగ్ కమిటీ ఆమోదం: ఇది రూ.60,000 కోట్ల పీఎం-సేతు పథకం కింద అమల్లోకి వచ్చిన మొదటి పారిశ్రామిక భాగస్వామ్యం.

నాడు పోస్టు చేయడమైనది: 30 MAY 2026 1:40PM by PIB Vijayawada

పీఎం- సేతు (ప్రధానమంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ఫార్మేషన్ త్రూ అప్గ్రేడెడ్ ఐటీఐస్) పథకం కింద కీలక ముందడుగు పడింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఐటీఐ క్లస్టర్ కోసం ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా, వారి విద్యా భాగస్వామి 'న్యూ ఏజ్ మేకర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ' (NAMTECH)తో కలిసి సమర్పించిన వ్యూహాత్మక పెట్టుబడి ప్రణాళికకు జాతీయ స్టీరింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. పీఎం-సేతు పథకం కింద ఆమోదం పొందిన దేశంలోని మొట్టమొదటి వ్యూహాత్మక పెట్టుబడి ప్రణాళిక ఇదే కావడం విశేషం. ఆమోదంతో, పథకం కింద పరిశ్రమ భాగస్వామ్యాన్ని విజయవంతంగా ఆచరణలోకి తీసుకువచ్చిన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది.

కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ (MSDE) న్యూదిల్లీలోని 'కౌశల్ భవన్'లో నిర్వహించిన 3 జాతీయ స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఆమోదం లభించింది. రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రముఖ పరిశ్రమల మధ్య బలమైన భాగస్వామ్యాల ద్వారా, ప్రభుత్వ ఐటీఐలను (ITIs) పరిశ్రమల ఆధ్వర్యంలో నడిచేలా, ఫలితాల ఆధారిత సంస్థలుగా మార్చాలనే పీఎం-సేతు (PM-SETU) ఆశయ సాధనలో పరిణామం కీలక ముందడుగుగా నిలిచింది.

సమావేశానికి కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీమతి దేబశ్రీ ముఖర్జీ అధ్యక్షత వహించగా, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ (DGT) డైరెక్టర్ జనరల్ శ్రీ దిలీప్ కుమార్, నేషనల్ స్టీరింగ్ కమిటీ సభ్యులు హాజరయ్యారు. చర్చల్లో కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ (CBC), నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (NCVET), వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ, భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ, కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ ప్రతినిధులు, భాగస్వామ్య రాష్ట్ర ప్రభుత్వాలు, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL), హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, ఐటీసీ లిమిటెడ్, ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ (AM/NS) ఇండియా వంటి పరిశ్రమల ప్రముఖులు, నామ్టెక్ (NAMTECH) తో పాటు ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ వంటి అభివృద్ధి భాగస్వాములు చర్చల్లో పాల్గొన్నారు.

సమావేశంలో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఐటీఐ క్లస్టర్ కోసం ఆర్సెలార్మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా సమర్పించిన వ్యూహాత్మక పెట్టుబడి ప్రణాళికకు ఆమోదం లభించింది. ఆమోదంతో, PM-SETU పథకం కింద ఒక 'యాంకర్ ఇండస్ట్రీ పార్ట్నర్‌'ను చేర్చుకుని, పారిశ్రామిక భాగస్వామ్యాన్ని విజయవంతంగా ఆచరణలోకి తీసుకువచ్చిన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది. ఇది పథకంలో అత్యంత కీలకమైన పరిశ్రమల నేతృత్వంలోని 'హబ్-అండ్-స్పోక్' మోడల్ను అమలు చేయడంలో ఒక ప్రధాన మైలురాయి.

విశాఖపట్నం క్లస్టర్ ఆమోదం.. పారిశ్రామిక శిక్షణ సంస్థలను (ITIs) మారుతున్న శ్రామిక శక్తి అవసరాలకు అనుగుణంగా స్పందించగల, పరిశ్రమలు నిర్వహించే, ఫలితాల ఆధారిత సంస్థలుగా మార్చడానికి పడిన కీలక అడుగు. అలాగే.. వృత్తి విద్యా శిక్షణలో పరిశ్రమల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి మరియు దేశవ్యాప్తంగా పీఎం-సేతు కార్యక్రమాల అమలును వేగవంతం చేయడానికి ప్రయత్నిస్తున్న ఇతర రాష్ట్రాలకు నమూనాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

భాగస్వామ్య రాష్ట్రాలలో PM-SETU అమలు పురోగతిని జాతీయ స్టీరింగ్ కమిటీ సమీక్షించింది. పరిశ్రమల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, సంస్థాగత పాలనను మెరుగుపరచడం, స్పెషల్ పర్పస్ వెహికల్స్ (SPVs) ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించడం, పథకం కింద ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయడం వంటి విధానపరమైన, అమలు చర్యలపై చర్చించింది.

భారతదేశ వృత్తి విద్యా శిక్షణా వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న రంగాల డిమాండ్లకు, భవిష్యత్తు శ్రామిక శక్తి అవసరాలకు అనుగుణంగా ఉండేలా చూడటం కోసం.. పరిశ్రమల నేతృత్వంలోని పాలనా యంత్రాంగాలను ముందుకు తీసుకెళ్లడం, ఫలితాల ఆధారిత నైపుణ్యాలను ప్రోత్సహించడం, పరిశ్రమలు, రాష్ట్ర ప్రభుత్వాలు, శిక్షణా సంస్థల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై చర్చలు ప్రధానంగా సాగాయి.

రూ. 60,000 కోట్ల వ్యయంతో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినపీఎం-సేతు’ (PM-SETU) పథకం, పరిశ్రమల ఆధ్వర్యంలో నడిచేహబ్-అండ్-స్పోక్నమూనా ద్వారా 1,000 ప్రభుత్వ ఐటీఐలను (ITIs) మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఐటీఐలలో మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం, పరిశ్రమల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, వేగంగా వృద్ధి చెందుతున్న రంగాలలోజాతీయ నైపుణ్య కేంద్రాలనుస్థాపించడానికి పథకం కృషి చేస్తుంది. తద్వారా, ప్రభుత్వ-పరిశ్రమల మధ్య బలమైన భాగస్వామ్యాన్ని పెంపొందించి, అధునాతన ఉత్పాదకత, సరికొత్త సాంకేతిక రంగాలలో భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్యం కలిగిన మానవ వనరులను  సిద్ధం చేయడం పథకం ప్రధాన ఉద్దేశ్యం.

దేశంలోని 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పటికే తమ రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీలను ఏర్పాటు చేశాయి. అలాగే, ‘యాంకర్ ఇండస్ట్రీ పార్ట్నర్స్ఎంపికలో పరిశ్రమల భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తూ 12 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు టెండర్లను కూడా జారీ చేశాయి. వీటిలో చాలా వరకు రాబోయే కొద్ది వారాల్లో ముగింపు దశకు చేరుకోనున్నాయి. పరిణామాలతో పీఎం-సేతు (PM-SETU) పథకం ఇప్పుడు పరిశ్రమల ఆధ్వర్యంలో పూర్తిస్థాయిలో అమలు కాబోయే కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే రాష్ట్రాలు-పరిశ్రమల మధ్య పలు విడతల సంప్రదింపులు విజయవంతంగా ముగిశాయి. రాబోయే వారాల్లో మరికొన్ని చర్చలు జరగనున్నాయి. బలమైన సంప్రదింపుల ప్రక్రియ, పరిశ్రమల ఆసక్తికిరాష్ట్రాల సంసిద్ధతకు మధ్య ఉన్న సమన్వయాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తోంది.

ఇప్పటివరకు జరిగిన ముందస్తు ఏర్పాట్లు అందించిన ఉత్సాహంతో, క్షేత్రస్థాయిలో ప్రాజెక్టులను వేగంగా అమలు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత సమన్వయంతో పనిచేస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఐటీఐల (ITIs) రూపురేఖలను పెద్ద ఎత్తున మార్చడానికి పరిశ్రమల భాగస్వామ్యాలు సిద్ధంగా ఉన్నాయి. రాబోయే నెలల్లో మరికొన్ని వ్యూహాత్మక పెట్టుబడి ప్రణాళికలు (SIPs) జాతీయ స్టీరింగ్ కమిటీ ఆమోదం పొందుతాయని భావిస్తున్నారు. ఇదివికసిత్ భారత్ 2047’ లక్ష్యానికి అనుగుణంగా, దేశంలోని వృత్తి విద్యా, శిక్షణా వ్యవస్థలో ఒక సరికొత్త మార్పునకు మార్గం సుగమం చేస్తుంది.


(రిలీజ్ ఐడి: 2267114) సందర్శకుల సూచీ సంఖ్య : : 18
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil