ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పట్టుదల, దృఢ సంకల్పాలకు ఉన్న శక్తిని చెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 27 MAY 2026 8:36AM by PIB Hyderabad

నిరంతర శ్రమ, ఓర్పు, దృఢ సంకల్పం.. వీటితో అతి పెద్ద లక్ష్యాలనైనా సరే, నెరవేర్చుకోవచ్చని ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు. ప్రస్తుతం దేశ ప్రజలు ఇదే భావన నుంచి మార్గదర్శకత్వాన్ని పొంది, భారత్‌ను కొత్త శిఖరాలకు చేర్చుతున్నారని ఆయన తెలిపారు.
సంస్కృత భాషలో ఉన్న ఈ కింది సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి పంచుకున్నారు.
‘‘యో యమర్థం ప్రార్థయతే తదర్థం చేహ తే క్రమాత్
అవశ్యం స తమాప్నోతి న చేదర్థాన్ నివర్తతే’’.
‘నిర్దిష్ట లక్ష్యాన్ని ఆశించడం, లేదా  దాని కోసం ప్రార్థించే వ్యక్తి, నిరంతరాయంగా, క్రమబద్ధంగా ప్రయత్నిస్తే ఆ లక్ష్యాన్ని తప్పక సాధిస్తారు. ఇందులో అనుమానం అక్కర్లేదు. అయితే, అందుకోసం ఆ వ్యక్తి సాధనను మధ్యలో వదలిపెట్టకుండా, తన దారి నుంచి వెనుదిరగకుండా ఉండాలి సుమా’ అని ఈ సుభాషితం మనకు బోధిస్తోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో  ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ :
‘‘నిరంతర ప్రయత్నం, ధైర్యం, దృఢ సంకల్పం.. వీటితో ఎంత పెద్ద లక్ష్యాన్నైనా సక్రమంగా తప్పక నెరవేర్చుకోవడం సాధ్యపడుతుంది. ప్రస్తుతం దేశ ప్రజలు ఇదే భావనతో భారత్‌ను కొత్త శిఖరాల వైపునకు తీసుకుపోతున్నారు.
‘‘యో యమర్థం ప్రార్థయతే తదర్థం చేహ తే క్రమాత్
అవశ్యం స తమాప్నోతి న చేదర్థాన్ నివర్తతే’’ అని పేర్కొన్నారు.

***


(రిలీజ్ ఐడి: 2265799) సందర్శకుల సూచీ సంఖ్య : : 10