రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

గేట్‌ స్కోర్ల ద్వారా సాంకేతిక విభాగం (అధికారి కేడర్‌)లో ప్రవేశాలను కోరిన భారత వైమానిక దళం

నాడు పోస్టు చేయడమైనది: 26 MAY 2026 4:07PM by PIB Hyderabad

భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌సాంకేతిక విభాగం (అధికారి కేడర్‌)లో ఉద్యోగాల భర్తీకి నూతన విధానాన్ని ప్రవేశపెట్టిందిదీని ప్రకారం అర్హులైన అభ్యర్థులు గేట్‌ స్కోర్‌ ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ నూతన విధానం ద్వారా చెల్లుబాటయ్యే గేట్‌ స్కోరు ఉన్న అభ్యర్థులు ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ బోర్డ్స్ (ఏఎఫ్‌ఎస్‌బీలువద్ద జరిగే పరీక్షలకు నేరుగా ఎంపిక చేసేందుకు అర్హులుమెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుందిదీనివల్ల ఈ అభ్యర్థులకు ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (ఏఎఫ్‌సీఏటీవంటి ప్రాథమిక రాత పరీక్ష నుంచి మినహాయింపు లభిస్తుందిగేట్‌ స్కోరు విధానం కేవలం సాంకేతిక విభాగంలో ప్రవేశానికి మాత్రమే వర్తిస్తుందిఐఏఎఫ్‌లోని సాంకేతిక విభాగంతో సహా అన్ని విభాగాల్లో నియామకాలకు ఏఎఫ్‌సీఏటీ ప్రామాణిక ప్రవేశ పరీక్షగా కొనసాగుతుంది.

గేట్‌ స్కోర్ విధానానికి సంబంధించిన ప్రాథమిక విద్యార్హతలుఏఎఫ్‌సీఏటీ ద్వారా సాంకేతిక విభాగంలో చేరటానికి ప్రస్తుతమున్న అర్హత ప్రమాణాల తరహాలోనే ఉంటాయిదీనికి అర్హత కలిగిన గేట్‌ సబ్జెక్టుల పూర్తి జాబితాను ఐఏఎఫ్‌ఏఎఫ్‌సీఏటీ నోటిఫికేషన్ 02, 2026లో అధికారికంగా ప్రకటించిందిఈ వివరాలను https:\\www.afcat.edcil.co.in, www.careeriaf.gov.in. వెబ్‌సైట్లలో చూడవచ్చుఅభ్యర్థులకు అధిక సౌలభ్యంమెరుగైన అవకాశాలను కల్పించేందుకు అర్హులైన అభ్యర్థుల ఆసక్తిని బట్టి ఏఎఫ్‌సీఏటీగేట్‌ స్కోర్ విధానాలు.. రెండింటి ద్వారా సాంకేతిక విభాగానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఐఏఎఫ్‌లో అధికారుల ప్రవేశ పథకాలకు సంబంధించిన తాజా సమాచారం కోసంఆసక్తిగల అభ్యర్థులు దిశ భారత వైమానిక దళ అధికారిక సోషల్ మీడియా ఖాతాలైన @careeriniaf (ఇన్‌స్టాగ్రామ్‌ఎక్స్‌), భారత వైమానిక దళ @DISHA (ఫేస్‌బుక్‌యూట్యూబ్‌లింక్డ్‌ఇన్‌)ను అనుసరించగలరు.

***


(రిలీజ్ ఐడి: 2265542) సందర్శకుల సూచీ సంఖ్య : : 12
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Tamil