రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

ఆత్మనిర్భర్‌ భారత్‌కు మరింత ఊతం: గగనతలం నుంచి భూమిపైకి, గగనతలం నుంచి గగనతలానికి ప్రయోగించే మానవ రహిత ప్రిసిషన్‌ గైడెడ్‌ మిస్సైల్‌-వీ3ని విజయవంతంగా పరీక్షించిన డీఆర్‌డీఓ

నాడు పోస్టు చేయడమైనది: 19 MAY 2026 9:50PM by PIB Hyderabad

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు వద్ద డీఆర్‌డీఓ పరీక్షా కేంద్రంలో గగనతలం నుంచి భూమిపైకి, గగనతలం నుంచి గగనతలానికి ప్రయోగించే మానవరహిత ప్రిసిషన్‌ గైడెడ్‌ మిస్సైల్‌ (యూఎల్‌పీజీఎం)-వీ3కి సంబంధించి తుది పరీక్షలను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) విజయవంతంగా పూర్తి చేసింది. యూఎల్‌పీజీఎం ఆయుధ వ్యవస్థకు ఆదేశాలివ్వటం, నియంత్రించేందుకు సమగ్ర భూతల నియంత్రణ వ్యవస్థ (జీసీఎస్‌)ను ఉపయోగించి ఈ పరీక్షలు నిర్వహించారు. సన్నద్ధత, ప్రయోగ కార్యకలాపాలను ఆటోమేటిక్ చేసే అత్యాధునిక సాంకేతికత ఈ జీసీఎస్‌లో ఉంది.

ఈ క్షిపణుల అభివృద్ధి, ఉత్పత్తి కోసం రెండు ఉత్పాదక సంస్థలు.. హైదరాబాద్‌లోని భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్, అదానీ డిఫెన్స్‌ సిస్టమ్స్‌, టెక్నాలజీస్‌ లిమిటెడ్‌తో డీఆర్‌డీఓ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రస్తుత పరీక్షల కోసం బెంగుళూరుకు చెందిన న్యూస్పేస్ రీసెర్చ్‌, టెక్నాలజీస్‌ అభివృద్ధి చేసిన మానవ రహిత విమానాలతో (యూఏవీలు) ఈ వ‌్యవస్థను అనుసంధానించారు.

 

*****


(రిలీజ్ ఐడి: 2263278) సందర్శకుల సూచీ సంఖ్య : : 85
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Punjabi , Tamil