ప్రధాన మంత్రి కార్యాలయం
అనేక మందిని ఒకే కుటుంబ సభ్యుల్లా భూమాత అక్కున చేర్చుకొంటుందంటూ
ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
19 MAY 2026 9:05AM by PIB Hyderabad
మానవజాతినంతా ఒకే కుటుంబంగా భూమాత భావిస్తుందని చెబుతున్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు. ధరణీమాత దృష్టిలో ప్రపంచమంతా ఒక ఇల్లు అనీ, అందులో ప్రతి సంస్కృతికీ తనదంటూ ప్రాధాన్యం, గౌరవం ఉన్నాయనీ శ్రీ మోదీ స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ -
‘‘పూర్తి మానవ జాతిని ఒకే పరివారమని ధరణీమాత భావిస్తుంది. ధరిత్రి దృష్టిలో ఈ యావత్ ప్రపంచం ఒక ఇల్లు లాంటిది. దీనిలో ప్రతి ఒక్క సంస్కృతికీ తనదైన ప్రాధాన్యం, గౌరవమంటూ ఉన్నాయి.
జనం బిభ్రతీ బహుధా వివాచసం నానాధర్మాణం పృథివీ యథౌకసమ్
సహస్రం ధారా ద్రవిణస్య మే దుహాం ధ్రువేవ ధేనురనపస్ఫురన్తి’’..
వివిధ భాషల్ని మాట్లాడే, వేరు వేరు ధర్మాల్నీ, సంప్రదాయాల్నీ అనుసరించే వారిని ఒకే కుటుంబ సభ్యుల్లా భూమాత అక్కున చేర్చుకుంటోంది. శాంతియుత, ప్రేమమయ గోమాత పాలు అందించినట్లుగా ఈ భూమాత కూడా మన కోసం సమృద్ధి ధారల్ని వేలాదిగా కురిపించుగాక అని ఈ సుభాషితం సూచిస్తోంది’’ అని పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2262645)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Malayalam