పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఒడిశా వ్యాప్తంగా తగినంతగా, అంతరాయం లేకుండా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సరఫరా

నాడు పోస్టు చేయడమైనది: 15 MAY 2026 9:40PM by PIB Hyderabad

ఒడిశాలోని పలు బంకుల్లో పెట్రోల్‌డీజిల్‌ లభ్యత తగినంతగా లేదని ఇటీవల మీడియాలో వచ్చిన వార్తలపై స్పందిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విక్రయకేంద్రాల్లో సరిపడా పెట్రోల్‌డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని.. మొత్తంగా ఇంధన సరఫరా వ్యవస్థ సాధారణంగాస్థిరంగా ఉందని ఈ ప్రకటన స్పష్టం చేస్తోంది.

సంబంధిత బంకుల్లో పరిస్థితిని వీలైనంత త్వరగా సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు నిల్వలను పెంచుకునేందుకు ఓఎంసీలు సమన్వయంతో చర్యలు చేపట్టాయినిల్వలను నిరంతరం పర్యవేక్షిస్తూ.. పూర్తిగా స్టాక్ అయిపోయినట్లు నివేదించిన బంకులకు ప్రాధాన్యతనిస్తూ సరఫరా చేస్తున్నాయి.

పెద్ద మొత్తంలో ఇంధన సరఫరా చేసేందుకు పెట్రోల్‌ బంకులకు అనుమతి లేదుపెద్ద మొత్తంలో ఇంధనం కావాల్సిన వినియోగదారులు పెట్రోల్ బంకుల నుంచి కాకుండా.. నేరుగా సంబంధిత చమురు మార్కెటింగ్‌ కంపెనీల నుంచే కొనుగోలు చేయాలని ఓఎంసీలు సూచించాయి.

ఒడిశాలోని అన్ని బంకులుసరఫరా కేంద్రాల్లో తగినంత పెట్రోల్‌డీజిల్‌ నిల్వలు అందుబాటులో ఉన్నాయని ఇండియన్ ఆయిల్ స్పష్టం చేసింది.

ఇంధన లభ్యతపై ఆందోళన అవసరం లేదని ప్రజలకు ఇండియన్ ఆయిల్ హామీ ఇచ్చిందిఆందోళనతో అవసరానికి మించి ఇంధనాన్ని కొనుగోలు చేయవద్దని వినియోగదారులకు విజ్ఞప్తి చేసిందిఇంధన సరఫరాకు సంబంధించి ఖచ్చితమైనధ్రువీకరించిన సమాచారం కోసం ఇండియన్ ఆయిల్ సంస్థ వెలువరించిన అధికారిక ప్రకటనలను మాత్రమే విశ్వసించాలని పౌరులను కోరింది.

***


(రిలీజ్ ఐడి: 2261839) సందర్శకుల సూచీ సంఖ్య : : 58
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Odia , Tamil