సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పెన్షనర్లను ‘‘విలువైన జాతీయ వనరు’’గా అభివర్ణించిన కేంద్రమంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌


పెన్షన్ సంస్కరణలు పాలనను ‘‘నియమ పుస్తకాల ఆధారితం” నుంచి “పౌర కేంద్రీకృతం’’గా మార్చామన్న కేంద్రమంత్రి

కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అధ్యక్షతన 16వ అఖిల భారత పెన్షన్‌ అదాలత్‌ నిర్వహణ.. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న 985 కేసులను పరిష్కారం కోసం స్వీకరణ

పెన్షన్‌ పంపిణీని అత్యంత పారదర్శకంగా, అవాంతరాలు లేకుండా మార్చిన డిజిటల్ పెన్షన్‌ సంస్కరణలు: డాక్టర్ జితేంద్ర సింగ్

పింఛను అదాలత్ మార్గదర్శకాలను విడుదల చేసిన డాక్టర్ జితేంద్ర సింగ్... మానవ కేంద్రీకృత డిజిటల్ పెన్షన్ సంస్కరణలపై దృష్టి

నాడు పోస్టు చేయడమైనది: 13 MAY 2026 6:04PM by PIB Hyderabad

భారతపెన్షన్ పాలనా వ్యవస్థ గత పదేళ్లలో సమూల మార్పులకు లోనైందని కేంద్ర శాస్త్ర సాంకేతికభూ విజ్ఞాన శాస్త్రాల శాఖ సహాయ (స్వతంత్ర బాధ్యత)పీఎంఓసిబ్బందిప్రజా ఫిర్యాదులుపెన్షన్లుఅణుశక్తిఅంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. ఇది కేవలం నిబంధనలకు కట్టుబడి ఉండే వ్యవస్థ నుంచి పెన్షనర్ల గౌరవంపారదర్శకతజీవన సౌలభ్యంపై దృష్టి సారిస్తూ.. సాంకేతికతతో కూడినపౌర కేంద్రీకృత యంత్రాంగంగా పరిణామం చెందిందని తెలిపారు.

 

న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన 16వ అఖిల భారత పెన్షన్‌ అదాలతో ప్రసంగిస్తూ కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. పెన్షనర్లను కేవలం ప్రభుత్వ సాయం పొందే లబ్ధిదారులుగా చూడకూడదన్నారు. వారి అనుభవంనైపుణ్యంసంస్థాగత జ్ఞాపకశక్తి దేశానికి ఒక అమూల్యమైన ఆస్తిగా నిలుస్తాయన్నారు. ‘దేశ నిర్మాణంలో విలువైన భాగస్వాములుగా వారిని గుర్తించాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సరళమైనమానవీయబాధ్యతాయుతమైన పెన్షన్ యంత్రాంగం కోసం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.

 

భాగస్వాములందరూ ఒకే వేదికపైకి వచ్చి సమస్యలను సమిష్టిగా పరిష్కరించుకోవడమే పెన్షన్‌ అదాలత్‌ వ్యవస్థ అతి పెద్ద బలమని కేంద్రమంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ తెలిపారు. సాధారణ ఫైళ్ల బదిలీఅధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలకు పరిమితం కాకుండాముఖాముఖి చర్చల ద్వారా అనేక సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించవచ్చని ఆయన వివరించారు. ఇటువంటి ప్రత్యక్ష చర్చలు పరిపాలనా దృక్పథంలో మార్పు తీసుకువస్తాయనిదీనివల్ల పాలనలో మరింత ఆచరణాత్మకమానవీయ దృక్పథం పెరుగుతుందని డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు.

 

పెన్షన్పెన్షనర్ల సంక్షేమ శాఖ నిర్వహించిన 16వ పెన్షన్ అదాలత్‌లో వివిధ మంత్రిత్వ శాఖలువిభాగాలుసంస్థలకు చెందిన 985 దీర్ఘకాలిక పెన్షన్ ఫిర్యాదులను వేగవంతమైన పరిష్కారం కోసం స్వీకరించారు. ఈ కార్యక్రమం సందర్భంగా ‘విజయ గాథల కరపత్రాలను విడుదల చేయడంతో పాటు పెన్షన్ అదాలత్‌కు సంబంధించిన మార్గదర్శకాలను ఆవిష్కరించారు. అలాగే పెన్షన్ రంగానికి చెందిన పలు కీలక కేసులను సంయుక్త కార్యదర్శి (పెన్షన్) మంత్రికి వివరించారు.

 

15.04.2026 నాటికి 45 రోజుల కంటే ఎక్కువ కాలంగా పెండింగ్‌లో ఉన్న 37 మంత్రిత్వ శాఖలువిభాగాలకు చెందిన 985 కేసులను ఈ అదాలత్ పరిగణనలోకి తీసుకుంది. ఇప్పటి వరకు వీటిలో 728 కేసులు పరిష్కరమయ్యాయి. మొత్తం ఫిర్యాదులలో దాదాపు 74 శాతం ఇప్పటికే పరిష్కారం కావడం విశేషం.

 

 

ఈ కార్యక్రమ నిర్వహణ సమయంలో మొత్తం 16 మంత్రిత్వ శాఖలువిభాగాలకు చెందిన 26 కీలక కేసులను డాక్టర్ జితేంద్ర సింగ్ ముందు ఉంచారు. వీటిలో రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన 12 కేసులుహోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన 8 కేసులురైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన 2 కేసులు ఉండగా.. మిగిలిన కేసులు ఇతర మంత్రిత్వ శాఖలు,విభాగాలకు సంబంధించినవి ఉన్నాయి.

 

ఈ పెన్షన్ అదాలత్‌కు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెన్షనర్లువారి కుటుంబ పెన్షనర్లు హాజరయ్యారు. మహారాష్ట్రలోని అకోలాఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ వంటి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన లబ్దిదారులతో సహా ఎనిమిది మంది పెన్షనర్లు ప్రత్యక్షంగా హాజరయ్యారు. మరో 18 మంది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మండిరాజస్థాన్‌లోని బికనీర్‌పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాతమిళనాడులోని ఈరోడ్ వరకు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాల నుంచి పెన్షనర్లు ఇందులో భాగస్వాములయ్యారు. ఈ కార్యక్రమం దేశవ్యప్తంగా విస్తరిస్తున్న తీరును ప్రతిబింబిస్తుంది.

 

పెన్షన్ అదాలత్ యంత్రాంగం ద్వారా పరిష్కరించిన కేసుల్లో లబ్ధిదారులకు భారీ ఆర్థిక ఊరట లభించింది. ఒక కేసులో ఏకంగా రూ. 74 లక్షలకు పైగా పెన్షన్ ప్రయోజనాలను విడుదల చేశారు. మరో రెండు వేర్వేరు కేసుల్లో ఒక్కొక్కరికి సుమారు రూ. 46 లక్షల చొప్పున బకాయిలను చెల్లించారు.

 

ఈ కార్యక్రమంలో పెన్షన్పెన్షనర్ల సంక్షేమ శాఖ కార్యదర్శిభారత ప్రభుత్వ ఉన్నతాధికారులువివిధ మంత్రిత్వ శాఖలువిభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. వీరితో పాటు పెన్షనర్ల సంఘాలుబ్యాంకులుఇతర భాగస్వాములు ఈ చర్చల్లో భాగస్వాములయ్యారు.

 

2014 నుంచి పెన్షన్ సంస్కరణలు సాగిన తీరును కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. ఒకప్పుడు పెన్షన్పెన్షనర్ల సంక్షేమ శాఖ ప్రజల దృష్టికి దూరంగా కేవలం పరిమిత పరిపాలనా విధానంలోనే ఉండేదని అన్నారు. కానీ నేడు నిరంతర సంస్కరణలుడిజిటల్ జోక్యాలుపౌర కేంద్రీకృత నిర్ణయాల వల్ల ప్రభుత్వంలోనే అత్యంత వేగంగా స్పందించే శాఖలలో ఒకటిగా ఎదిగిందని ఆయన అన్నారు.

 

బయోమెట్రిక్ ప్రామాణీకరణ,డిజిటల్ సాంకేతికత ద్వారా జీవిత ధ్రువీకరణ పత్రం ప్రక్రియను సరళీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రస్తావించారు. డిజిటల్ లైఫ్‌ సర్టిఫికెట్‌ ప్రచారం ఇప్పుడు ఒక ప్రజా ఉద్యమంగా మారిందనిదీనివల్ల వృద్ధ పెన్షనర్లు ఎదుర్కొంటున్న కష్టాలు గణనీయంగా తగ్గాయని ఆయన తెలిపారు.ఇప్పటివరకు ఒక కోటి మందికి పైగా పెన్షనర్లు ఈ విధానం ద్వారా ప్రయోజనం పొందారనిఇది పెన్షన్ పంపిణీని మరింత పారదర్శకంగాసులభంగా మార్చిందని వివరించారు.

 

కుటుంబ పెన్షన్ నిబంధనల సరళీకరణవ్యక్తులు కనబడకుండా పోయిన కేసులకు సంబంధించిన పాత నిబంధనలను తొలగించడంవిడాకులు తీసుకున్న లేదా విడిపోయిన కుమార్తెలకుఅలాగే ఇతరులపై ఆధారపడే దివ్యాంగులకు చేకూర్చేలా నిబంధనలను సడలించడంతో సహా ఇటీవలి సంవత్సరాలలో చేపట్టిన అనేక సంస్కరణలను కేంద్రమంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ ప్రస్తావించారు. ఈ సంస్కరణలన్నీ క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులనుపెన్షనర్ల కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకునిఎంతో సున్నితత్వంతో రూపొందించినవని మంత్రి స్పష్టం చేశారు.

 

మిషన్ కర్మయోగి గురించి ప్రస్తావిస్తూ.. పరిపాలన అనేది కేవలం నిబంధనలను యాంత్రికంగా అమలు చేయడం కాదనిప్రజా సేవల పంపిణీ వెనుక ఉన్న ఉన్నతమైన లక్ష్యంపై దృష్టి సారించాలని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. విధానపరమైన సంక్లిష్టతల్లో చిక్కుకుపోకుండాపౌరులు సకాలంలో అర్థవంతమైన ఫలితాలు పొందేలా అధికారులు పరిష్కార మార్గాల దిశగా ఆలోచించాలని  సూచించారు.

 

సంక్లిష్టమైనదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదుల పరిష్కారానికి పెన్షన్ అదాలత్‌లు ఒక శక్తిమంతమైన సంస్థాగత వ్యవస్థగా ఎదిగాయని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. 2017లో ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 15 పెన్షన్ అదాలత్‌లు నిర్వహించారని తెలిపారు. వీటిలో మొత్తం 27,812 కేసులను స్వీకరించగా, 19,948 ఫిర్యాదులు అదాలత్ జరుగుతున్న సమయంలోనే పరిష్కారమయ్యాయన్నారు. అంటే దాదాపు 71.72 శాతం విజయవంతమైన పరిష్కార రేటు నమోదైందని చెప్పారు. మిగిలిన కేసులను తదుపరి దశలో వివిధ మంత్రిత్వ శాఖల సమన్వయంసమీక్షా యంత్రాంగాల ద్వారా పరిష్కరించారని తెలిపారు.

 

పెన్షన్ సంస్కరణలుఫిర్యాదుల పరిష్కార వేదికలపై మరింత అవగాహనవిస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న పెన్షనర్లకు ప్రభుత్వ కార్యక్రమాలపై పూర్తి సమాచారం అందేలావారు ప్రభుత్వంతో అనుసంధానమై ఉండేలా.. సోషల్ మీడియాఆధునిక సమాచార సాధనాలను విస్తృతంగా ఉపయోగించాలని ఆయన అన్ని శాఖలుసంస్థలకు పిలుపునిచ్చారు.

***


(రిలీజ్ ఐడి: 2260965) సందర్శకుల సూచీ సంఖ్య : : 24
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Punjabi , Tamil