ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సమ్మిళిత కృత్రిమ మేధ వ్యవస్థ బలోపేతానికి కార్య సంస్థతో ఇండియా ఏఐ అవగాహన ఒప్పందం

నాడు పోస్టు చేయడమైనది: 13 MAY 2026 6:32PM by PIB Hyderabad

కృత్రిమ మేధ ఆర్థిక వ్యవస్థను విస్తృతంగా అందుబాటులోకి లక్ష్యంతో లాభాపేక్ష రహితంగా పని చేసే సంస్థ కార్యతో, కేంద్ర ఎలక్ట్రానిక్స్ , సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియా-ఏఐ మిషన్‌ కీలక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం డేటా, సాంకేతికత, నైపుణ్యాభివృద్ధి అంశాల్లో భారత్‌లో సమ్మిళిత ఏఐ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ రెండు సంస్థలు కలిసి కృషి చేయనున్నాయి.

సమ్మిళిత, ప్రాతినిధ్య కృత్రిమ మేధ వ్యవస్థలకు మద్దతు ఇవ్వడానికి, అధిక నాణ్యత గల భాషా, బహుళ విధాన డేటాసెట్ల అభివృద్ధి, నిర్వహణ, భాగస్వామ్యంపై ఈ అవగాహన ఒప్పందం ప్రధానంగా దృష్టి సారిస్తుంది.

ఈ భాగస్వామ్యంలో భాగంగా ఏఐకోష్ డేటా మౌలిక సదుపాయాలు, నమూనా మూల్యాంకన విధానాలు, డేటాసెట్ నాణ్యత, ధ్రువీకరణ, పరస్పర అనుకూలత కోసం ప్రమాణాలను బలోపేతం చేయడానికి ఇరు సంస్థలు సాంకేతిక సహకారాన్ని ఇచ్చిపుచ్చుకుంటాయి.

ఈ భాగస్వామ్యంపై మంత్రిత్వ శాఖ శాస్త్రవేత్త ‘జి’, జెనరల్ కోఆర్డినేటర్,  ఇండియా మిషన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీమతి కవితా భాటియా మాట్లాడుతూ... ‘‘నిజమైన సమ్మిళిత కృత్రిమ మేధ వ్యవస్థను నిర్మించడానికి మన ప్రజలు, భాషల పూర్తి వైవిధ్యాన్ని ప్రతిబింబించే డేటా అవసరం. కార్య సంస్థతో మా సహకారం పరస్పర అనుబంధ బలాలను ఒకచోటికి తీసుకువస్తుంది. అధిక నాణ్యతతో కూడిన,  సమాజంలోని అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించే వనరులను సృష్టించేందుకు మేం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’’ అని తెలిపారు.

శిక్షణ కార్యక్రమాలు, వర్క్‌షాప్‌లు, సాంకేతిక సంప్రదింపులు, జ్ఞాన-భాగస్వామ్య కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ, భాగస్వామ్య సంస్థల్లో ఏఐ వ్యవస్థను అభివృద్ధి చేయడం, నైపుణ్యాలను పెంచడమే ఈ ఒప్పందం లక్ష్యం.

***


(రిలీజ్ ఐడి: 2260928) సందర్శకుల సూచీ సంఖ్య : : 130
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil