భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పీఎం ఈ-డ్రైవ్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కల్పనపై జాతీయ సదస్సు

నాడు పోస్టు చేయడమైనది: 12 MAY 2026 6:24PM by PIB Hyderabad

భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఈవీ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందిహెచ్‌.డీకుమారస్వామి

"పీఎం ఈ-డ్రైవ్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కల్పన"పై భారత ప్రభుత్వ భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఐమే 12, 2026న బెంగళూరులో జాతీయ సదస్సును నిర్వహించింది.

సదస్సులో కేంద్ర భారీ పరిశ్రమలుఉక్కు శాఖ మంత్రి శ్రీ హెచ్‌.డీకుమారస్వామి మాట్లాడుతూ.. దేశంలో స్వచ్ఛ రవాణాకు మద్దతుగా ఆధునికనమ్మకమైన ఈవీ ఛార్జింగ్ వ్యవస్థను రూపొందించేందుకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారుపీఎం ఈ-డ్రైవ్ పథకం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలను పట్టణ ప్రాంతాల్లోనే కాకగ్రామీణ భారతానికి అందుబాటులోకి తీసుకురావాలనితక్కువ ధరలో విశ్వసనీయమైన ప్రయాణాన్ని అందించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని తెలియజేశారుగౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారీ స్థాయిలో ఈవీల వినియోగాన్ని వేగవంతం చేసేందుకు ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయటం అత్యవసరమని స్పష్టం చేశారు.

కర్ణాటకలో రూ.123.26 కోట్ల వ్యయంతో 1,243 ఈవీ ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటు ప్రతిపాదనలకు గౌరవ మంత్రి ఆమోదం తెలిపారుఇప్పటివరకు వివిధ రాష్ట్రాలుసీపీఎస్‌ఈల పరిధిలో మొత్తం 4,874 ఈవీ ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటునకు రూ. 503.86 కోట్ల వ్యయంతో కూడిన ప్రతిపాదనలకు ఆమోదం లభించిందిఈ ఆమోదిత ప్రతిపాదనల్లో హెచ్‌పీసీఎల్‌ఐఓసీఎల్‌బీపీసీఎల్‌ వంటి ప్రధాన ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు రాజస్థాన్ఆంధ్రప్రదేశ్ఉత్తరప్రదేశ్గుజరాత్కేరళతెలంగాణకర్ణాటకతమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి.

భారత ప్రభుత్వ భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ హనిఫ్ ఖురేషీ మాట్లాడుతూ.. అవాంతరాలు లేనిభవిష్యత్తు అవసరాలకు అనువైన ఈవీ ఛార్జింగ్ వ్యవస్థను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసేందుకు పీఎం ఈ-డ్రైవ్ పథకం కీలకమని అన్నారుఎలక్ట్రిక్ ద్విచక్రత్రిచక్ర వాహనాలుకార్లుబస్సులుట్రక్కుల ఛార్జింగ్ వ్యవస్థలకు ఎంహెచ్‌ఐ మద్దతిస్తుందని ఆయన తెలిపారుదేశంలో తదుపరి తరం విద్యుత్ రవాణా అభివృద్ధికి అవసరమైన సమర్థవంతమైన ఛార్జింగ్ వ్యవస్థను రూపొందించటంలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలుబీహెచ్‌ఈఎల్‌ఛార్జ్ పాయింట్ ఆపరేటర్లుపరిశ్రమ భాగస్వాముల మధ్య సమన్వయం కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు.

పీఎం ఈ-డ్రైవ్‌తో పాటు ఈవీలను ప్రోత్సహించేందుకు ఎంహెచ్‌ఐ పలు పథకాలను అమలు చేస్తోందిఅవి.. పీఎల్‌ఐ ఆటో (రూ. 25,938 కోట్లు), పీఎల్‌ఐ ఏసీసీ (రూ. 18,100 కోట్లు), పేమెంట్ సెక్యూరిటీ మెకానిజం (రూ. 3,435 కోట్లు), అరుదైన ఖనిజ అయస్కాంతం కోసం ఉద్దేశించిన పథకం (రూ. 7,280 కోట్లు).

దేశవ్యాప్తంగా ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను వేగవంతం చేయటంపై దృష్టి సారించిన సమావేశం

దేశవ్యాప్తంగా ఈవీ పబ్లిక్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాల (ఈవీ పీసీఎస్విస్తరణను వేగవంతం చేయటంభారత ఎలక్ట్రిక్ మొబిలిటీ వ్యవస్థను బలోపేతం చేయటం వంటి అంశాలపై చర్చించేందుకు కీలక వేదికగా ఈ సమావేశం నిలిచిందిఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాల ఉన్నతాధికారులుఛార్జ్ పాయింట్ ఆపరేటర్లు (సీపీఓలు), ఈవీ తయారీదారులు (ఓఈఎంలు), చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు), కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (సీపీఎస్‌ఈలు), ఆటోమొబైల్ పరిశ్రమ సంఘాలుఇతర కీలక వాటాదారులు పాల్గొన్నారు.

ఉత్తమ పద్ధతులుఅమలు వ్యూహాలను పంచుకున్న రాష్ట్రాలు

ఈ సమావేశానికి తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఇంధన శాఖఐఏఎస్‌ శ్రీ నవీన్ మిట్టల్కేరళ ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి (విద్యుత్ శాఖఐఏఎస్‌ శ్రీ పునీత్ కుమార్కేరళ ప్రభుత్వ కేఎస్‌ఈబీసీఎండీ శ్రీ మిన్హాజ్ ఆలంకర్ణాటక ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి (ఇంధన శాఖశ్రీ గౌరవ్ గుప్తాఒడిశా ప్రభుత్వ రవాణా కమిషనర్ శ్రీ అమితాబ్ ఠాకూర్ వంటి సీనియర్ అధికారులు హాజరయ్యారుఈవీ ఛార్జింగ్ కేంద్రాల విస్తరణవాటిని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సంబంధించి అనుభవాలనువిధానపరమైన నిర్ణయాలనురాష్ట్ర స్థాయి వ్యూహాలను అధికారులు పంచుకున్నారు.

పీఎం ఈ-డ్రైవ్ పథకం ద్వారా దేశవ్యాప్త ఛార్జింగ్ నెట్‌వర్క్‌ విస్తరణ

పీఎం ఈ-డ్రైవ్ పథకం ద్వారా విద్యుత్ వాహన వినియోగాన్ని ప్రోత్సహించేందుకుఈవీ వ్యవస్థ అభివృద్ధికి మద్దతుగా రూ.10,900 కోట్లను కేటాయించేందుకు భారత ప్రభుత్వం ఆమోదం తెలిపిందిఈ పథకం వివిధ వాహన వర్గాలువిడిభాగాల విషయంలో డిమాండ్ ప్రోత్సాహకాలనుమౌలిక సదుపాయాల మద్దతును అందిస్తుందిఈ పథకం ద్వారా సుమారు 24.79 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు (-2డబ్ల్యూ), -రిక్షాలు-కార్టులుఎల్‌కేటగిరీ వాహనాలతో కలిపి దాదాపు 3.16 లక్షల ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాలకు (-3డబ్ల్యూప్రోత్సాహకాలను అందించాలనిఅదనంగా 14,028లకు పైగా ఎలక్ట్రిక్ బస్సుల వినియోగానికి రూ. 4,391 కోట్ల ఆర్థిక సాయం అందించాలని ప్రతిపాదించారువాణిజ్యప్రజా సేవా రంగాల్లో వీటి వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఈ-అంబులెన్స్‌లు-ట్రక్కులకు కూడా ప్రత్యేక కేటాయింపులు చేశారు.

మొత్తం కేటాయింపుల్లో రూ.3,679 కోట్లను ఈ-2డబ్ల్యూలు-3డబ్ల్యూలు-అంబులెన్సులు-ట్రక్కులుఇతర అభివృద్ధి చెందుతున్న ఈవీ విభాగాలకు ప్రోత్సాహకంగా అందించేందుకు కేటాయించారు.

దేశవ్యాప్తంగా ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.2,000 కోట్లు కేటాయించారుఅదనంగా భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని వాహన పరీక్షా సంస్థల ఆధునీకరణఉన్నతీకరణకు రూ. 780 కోట్లు కేటాయించారు.

విస్తరించగలవిశ్వసనీయమైన ఈవీ మౌలిక సదుపాయాలకు కీలక సహకారం

దేశవ్యాప్తంగా ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాల విస్తరణపరస్పర అనుసంధానతప్రామాణీకరణవిశ్వసనీయతతో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలుకేంద్ర మంత్రిత్వ శాఖలుఓఎంసీలుఓఈఎంలుసీపీఓలుఅమలు సంస్థల మధ్య సన్నిహిత సమన్వయం అవసరమని ఈ సదస్సు స్పష్టం చేసిందిభారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈవీ వ్యవస్థకు మద్దతుగా ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరించటంఉమ్మడి సాంకేతిక ప్రమాణాలను పాటించటంపబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యాలను బలోపేతం చేయాల్సిన అవసరముందని ప్రతినిధులు తెలిపారు.

స్వచ్ఛ రవాణా లక్ష్యాల పట్ల నిబద్ధతను స్పష్టం చేసిన ఎంహెచ్‌ఐ

భారతదేశంలో ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను వేగంగా ఏర్పాటు చేసేందుకు రాష్ట్రాలకుసంబంధిత సంస్థలకు పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మరోసారి స్పష్టం చేసింది. 2070 నాటికి కర్బన ఉద్గారాలను పూర్తిగా తగ్గించటంవికసిత్ భారత్ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలను సాధించటంలో స్వచ్ఛ రవాణా వ్యవస్థ కీలకమని మంత్రిత్వ శాఖ తెలిపింది.

***


(రిలీజ్ ఐడి: 2260699) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Kannada