ప్రధాన మంత్రి కార్యాలయం
గురువుకు అంకిత భావంతో సేవ చేయడం ద్వారానే జ్ఞానాన్ని సంపాదించగలమని చెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
12 MAY 2026 2:21PM by PIB Hyderabad
జ్ఞానాన్ని గురువుకు అంకిత భావంతో సేవ చేసినప్పుడే సాధించగలుగుతామని స్పష్టం చేస్తున్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
ప్రధానమంత్రి పేర్కొన్న సంస్కృత సుభాషితం ఇలా ఉంది:
‘‘యథా ఖాత్వా ఖనిత్రేణ భూతలే వారి విన్దతి
తథా గురుగతాం విద్యాం శుష్రూషురధిగచ్ఛతి’’.
నీళ్ల కోసం నేలను కష్టపడి, ఓర్మితో బాగా లోతుగా తవ్వాల్సివుంటుంది. అదే విధంగా, గురువు పట్ల విశ్వాసాన్ని కలిగివుంటూ, అంకితభావంతో, క్రమశిక్షణతో, హృదయపూర్వకంగా సేవ చేయడం ద్వారా మాత్రమే జ్ఞానాన్ని సాధించగలుగుతామనే సందేశాన్ని ఈ సుభాషితం మనకు అందిస్తోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా రాశారు.. :
‘‘యథా ఖాత్వా ఖనిత్రేణ భూతలే వారి విన్దతి
తథా గురుగతాం విద్యాం శుష్రూషురధిగచ్ఛతి’’.
(రిలీజ్ ఐడి: 2260256)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam