ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గుజరాత్‌లోని సోమనాథ్‌ ఆలయంలో మహాపూజ, కుంభాభిషేకం నిర్వహించిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 11 MAY 2026 3:49PM by PIB Hyderabad

నేడు గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయాన్ని సందర్శించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అక్కడ మహాపూజ, కుంభాభిషేకం కార్యక్రమాలను నిర్వహించారు.

 

ఈ భాగ్యం లభించడం తన జీవితంలో అత్యంత భావోద్వేగభరితమైన, మరువలేని క్షణాల్లో ఒకటి అని ప్రధానమంత్రి అభివర్ణించారు. పునర్నిర్మించిన సోమనాథ్ ఆలయ ద్వారాలు తెరిచి 75 ఏళ్లు పూర్తయిన ఈ విశేష సందర్భంలో మహాదేవుడిని ప్రార్థించడం ఒక అపురూపమైన అనుభూతిని ఇచ్చిందని పేర్కొన్నారు. ఇక్కడి దర్శనం, పూజలు అపారమైన ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదిస్తాయని వెల్లడించారు.

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో చేసిన వరుస పోస్టులో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.

 

‘‘గొప్ప, దివ్యమైన పుణ్యక్షేత్రమైన సోమనాథ్‌లో మహాదేవుని పాదాల చెంత మహాపూజ, కుంభాభిషేకం చేసే పరమ సౌభాగ్యం లభించడం నా జీవితంలో అత్యంత భావోద్వేగభరితమైన, మరువలేని క్షణం. ప్రజా రూపుడైన ఆ దైవాన్ని స్మరించుకుంటూ మహాదేవుడిని దర్శించి, పూజించే ఈ అసాధారణ సందర్భం.. నా హృదయాన్ని అనంతమైన ఆధ్యాత్మిక శక్తితో, శ్రద్ధతో, శివమయ చేతనతో ముంచెత్తింది’’.

 

‘‘పునర్నిర్మించిన సోమనాథ ఆలయం ప్రారంభమై 75 సంవత్సరాలు పూర్తయిన ఈ ప్రత్యేక సందర్భంలో మహాదేవుడిని ప్రార్థించడం నేను ఎప్పటికీ మరచిపోలేని అనుభవం. మహాదేవుని దర్శనం, పూజ అపారమైన ఆధ్యాత్మిక శక్తికి మూలం’’.


(రిలీజ్ ఐడి: 2259885) సందర్శకుల సూచీ సంఖ్య : : 8