ప్రధాన మంత్రి కార్యాలయం
సోమనాథ్ ఆలయాన్ని సందర్శించిన ప్రధానమంత్రి
సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన ఈ సందర్భాన్ని భారత నాగరికత ప్రయాణంలో కీలక ఘట్టంగా అభివర్ణించిన పీఎం
నాడు పోస్టు చేయడమైనది:
11 MAY 2026 12:28PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ సోమనాథ్ ఆలయాన్ని సందర్శించారు. పునర్నిర్మాణం తర్వాత సోమనాథ్ ఆలయంలోకి భక్తులను అనుమతించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆలయ సందర్శనకు వెళ్లటం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.
పునర్నిర్మించిన సోమనాథ్ ఆలయ ప్రారంభోత్సవం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ పవిత్ర క్షేత్రంలో దైవిక అనుభూతిని పొందినట్లు ప్రధానమంత్రి తెలిపారు. ఆలయ మార్గంలో సోమనాథుని భక్తుల శక్తి, ఉత్సాహం... ఉద్వేగాన్ని కలిగించిందన్నారు. పునర్నిర్మించిన ఆలయ ప్రారంభోత్సవ సమయంలో భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఎలాంటి అనుభూతిని పొంది ఉంటారో, సరిగ్గా అలాంటి అనుభూతినే ఇవాళ తానూ అనుభవిస్తున్నట్లు చెప్పారు. సోమనాథ్ అమృత్ మహోత్సవం సృష్టించిన భక్తి వాతావరణం, అంతటా అద్భుతమైన శక్తిని నింపుతోందని కొనియాడారు.
సోమనాథ్ క్షేత్రంలోని ప్రతి అణువులోనూ భక్తిని అనుభవించవచ్చని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. పునర్నిర్మించిన ఈ ఆలయం ప్రారంభమై 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అధిక సంఖ్యలో ప్రజలు ఇక్కడికి తరలివస్తున్నారని అన్నారు. భారత నాగరికత ప్రస్థానంలో ఈ చరిత్రాత్మకమైన రోజు ఒక కీలక ఘట్టమని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లోని వరుస పోస్టుల్లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
“జై సోమనాథ్! పునర్నిర్మించిన సోమనాథ్ ఆలయాన్ని భక్తుల కోసం తెరిచి 75 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో ఆలయ సందర్శనకు రావటం నా అదృష్టం”.
“పునర్నిర్మించిన సోమనాథ ఆలయ ప్రారంభం జరిగి 75వ వార్షికోత్సవం సందర్భంగా ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించటం దివ్యమైన అనుభూతిని కలిగించింది. ఈ సందర్భంగా ఆలయ మార్గంలో సోమనాథ భక్తుల అపారమైన శక్తి, ఉత్సాహం.. నన్ను భావోద్వేగానికి గురిచేశాయి. పునర్నిర్మించిన ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా భారతదేశ మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ పొందిన అనుభూతినే ఇవాళ నేను అనుభవిస్తున్నాను. సోమనాథ్ అమృత్ మహోత్సవంలోని భక్తి వాతావరణం అంతటా అద్భుతమైన శక్తిని నింపుతోంది”.
“సోమనాథ్ క్షేత్రంలోని ప్రతి అణువులోనూ భక్తిని అనుభవించవచ్చు. పునర్నిర్మించిన ఈ ఆలయం ప్రారంభమై 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎంతో మంది ప్రజలు తరలివస్తున్నారు. భారత నాగరికతా ప్రస్థానంలో ఈ రోజు ఒక కీలక ఘట్టం”.
***
(రిలీజ్ ఐడి: 2259832)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam