ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బెంగళూరులోని ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ 45వ వార్షికోత్సవాల్లో ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం

నాడు పోస్టు చేయడమైనది: 10 MAY 2026 2:01PM by PIB Hyderabad

గౌరవనీయులైన శ్రీ శ్రీ రవి శంకర్ఇక్కడకు విచ్చేసిన సాధువులందరికీసోదరీ సోదరులారాఅందరికీ నమస్కారం.

ఈ ఉదయం నాకు ప్రత్యేకమైన అనుభవాన్ని అందించిందివేద మంత్రోచ్చారణతో చిన్నారులు పలికిన స్వాగతంశ్రీ గణేశుని దర్శనంశ్రీ శ్రీ రవి శంకర్ 70వ జన్మదినోత్సవంఆర్ట్ ఆఫ్ లివింగ్‌ 45వ వార్షికోత్సవం.. ఈ క్షణాలన్నీ నా జ్ఞాపకాల్లో ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతాయిఈ అద్భుతమైన ఉత్సవాలకు నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

ఇప్పుడే గురుదేవ్ అనేక విషయాలు చెప్పారుఆయన నన్ను పొగుడుతున్నారని మీరు అనుకోవచ్చుకానీ నేను మాత్రం ఆయన నాకు పని అప్పగించారని భావిస్తున్నానుమీరు చెప్పింది నిజమేనేను మీకు కృతజ్ఞతలు చెప్పలేనుఎందుకంటే నేను మీలో ఒకరినిమీ మధ్యకుమీ కోసమే వచ్చానునేను ఏ స్థాయిలోఉన్నా అది మీ వల్లేఈ రోజు గురుదేవ్ 70 ఏళ్ల జన్మదినోత్సవంమీ కుటుంబంలో నేనూ ఒక భాగం కాబట్టి... మీ శత జన్మదిన ఉత్సవాల్లో పాల్గొనేందుకు మళ్లీ వస్తానని బహిరంగంగా చెబుతున్నాను.

పవిత్రమైనగొప్పదైన ధ్యాన మందిరం ఈ రోజు ప్రారంభమైందిస్పష్టమైన సంకల్పం ఉండిసేవా స్ఫూర్తితో పని చేసినప్పుడు.. ప్రతి ప్రయత్నం మంచి ఫలితాలను అందిస్తుందిఏది జరిగినాజరగకపోయినా.. మనమందరమూ పద్మం నీడలోనే ఉన్నాంమీకు అర్థమవుతుంటే.. చప్పట్లు కొడుతూ ఉండండిగురుదేవుని ఆశీర్వాదంతో ఈ పద్మం రక్షణ దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళుతుందిఈ ధ్యాన మందిరం ప్రారంభం సందర్భంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ సభ్యులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా,

బెంగళూరు వాతావరణం ఎప్పుడూ ప్రత్యేకమేసాఫ్ట్‌వేర్సేవల రంగంలో ఈ నగరం అంతర్జాతీయంగా గుర్తింపు పొందిందిఅలాగేభారతీయ సాంస్కృతిక గుర్తింపునుఆధ్యాత్మికతనుఆధ్యాత్మిక చైతన్యాన్ని నూతన శిఖరాలకు చేర్చిందిభారతీయ సంప్రదాయంలో యోగాధ్యానంప్రాణాయామం అంతర్భాగంగా ఉన్నాయిగురుదేవ్ చెప్పినట్లుగా.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రజలు భారతదేశ ఆధ్యాత్మిక సంప్రదాయాల కారణంగా ప్రభావితమవుతున్నారుభారత దేశంలోని అనేక సంస్థలు కూడా ఈ ప్రాచీన సంప్రదాయాల నుంచి స్ఫూర్తి పొందుతున్నాయి.

మిత్రులారా,

ఈ స్ఫూర్తితోనే శ్రీ శ్రీ రవి శంకర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనే విత్తనాన్ని నాటారుఇప్పుడది ఓ పెద్ద వట వృక్షంలాగా ఎదిగిందిఈ వృక్షం కొమ్మలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది మందిని స్పృశిస్తున్నాయిప్రభుత్వం పని మీద నేను విదేశాలకు వెళ్లినప్పుడు మీతో సంబంధమున్న ఎవరో ఒకరిని నేను కలుసుకుంటూనే ఉంటాను.

మిత్రులారా,

పూర్తి వైవిధ్యంతో నిండిన దేశం భారత్అనేక భాషలుఅనేక సంప్రదాయాలుభిన్నమైన ఆచారవ్యవహారాలువిభిన్నమైన పూజా విధానాలు వీటన్నింటినీ చూసినప్పుడు ఇలాంటి అందమైన వైవిధ్యాలను కలిపి ఉంచుతున్న ప్రాథమిక అంశం ఏమిటిఅనే ప్రశ్న మన మనసులో సహజంగానే తలెత్తుతుందిమన కోసం మనం కాకుండా ఇతరుల కోసం జీవించడమే దీనికి సమాధానం. ‘అష్టాదశ పురాణేశువ్యాసస్య వచనాద్వయంపరోపకారః పుణ్యాయ, పాపాయ పరపీడనం’... అంటే ఇతరులకు సేవ చేయడం పుణ్యంబాధ కలిగించడం పాపంసేవే అత్యున్నత ధర్మంఇదే మన సమాజంలో ఇమిడి ఉన్న సహజ గుణంతరతరాలుగా సాగుతున్న ఈ విలువల ప్రవాహం మనల్ని తీర్చిదిద్దిందిమనకు స్ఫూర్తినిచ్చిందిఉత్సాహపరిచిందిభారత్‌లోని అనేక ఆధ్యాత్మిక ఉద్యమాలు అంతిమంగా మానవాళికి సేవ చేయడం ద్వారానే వ్యక్తమయ్యాయిఆర్ట్ ఆఫ్ లివింగ్ చేస్తున్న ప్రతి పనిలోనూ ఈ స్ఫూర్తి ప్రతిబింబిస్తుందిఇప్పుడే ప్రదర్శించిన వీడియోలో మొత్తం సేవ గురించే ఉందిప్రజా సంక్షేమమే ఉందిఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రయాణంలో భాగమైన వారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా,

సామాజిక శక్తి తోడైనప్పుడే ఏ కార్యక్రమమైనా విజయం సాధిస్తుందికాబట్టిప్రతి ముఖ్యమైన లక్ష్య సాధనలోనూ సమాజ శక్తిని మేల్కొల్పడం చాలా అవసరంరాజకీయాలుప్రభుత్వాల కంటే సమాజమే అత్యంత శక్తిమంతమైనదని నేను విశ్వసిస్తానుదేశ నిర్మాణంలో తనంత తానుగా సమాజం చురుగ్గా పాల్గొన్నప్పుడే ఏ ప్రభుత్వమైనా విజయం సాధిస్తుందిఉదాహరణకు స్వచ్ఛ భారత్ అభియాన్‌ను తీసుకోండిఇది ప్రభుత్వ కార్యక్రమంగా మాత్రమే కాకుండా.. ప్రజల జీవితాల్లో ఓ భాగంగా మారిపోయిందిఇప్పుడది సమాజ శక్తితోనే ముందుకు వెళుతోంది.

మిత్రులారా,

సమాజం చురుగ్గా మారినప్పుడుదేశం ఎదుర్కొంటున్న పెద్ద సవాళ్లకు ఉమ్మడి పరిష్కారాలు లభిస్తాయిఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఈ సామాజిక శక్తిని తనతో పాటు తీసుకెళ్లడం మంచి విషయంఅభివృద్ధి సంబంధిత కార్యక్రమాల్లో సామాజిక దృక్పథానికి మీరు చాలా ప్రాధాన్యమిచ్చారుఅది మొక్కలు నాటే కార్యక్రమంగ్రామీణ స్మార్ట్ విలేజ్ సెంటర్లుమహిళలుగిరిజన సమాజాలకు సాధికారత కల్పించే కార్యక్రమాలైనా లేదా ఖైదీల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే కార్యక్రమమైనా ఈ ప్రయత్నాలన్నీ దేశసమాజాభివృద్ధికి గణనీయంగా దోహదపడతాయి.

మిత్రులారా,

ఇక్కడకు హాజరైన వారందరినీ ఓ విషయంలో నేను అభినందించాలిఅదే యువశక్తిపై దృష్టి సారించడంప్రస్తుత ప్రపంచం అత్యంత వేగంగా భారీ మార్పులకు లోనవుతోందిప్రతిరోజూ నూతన అవకాశాలకు కొత్త దారులను సైన్స్ అందిస్తోందినూతన ఆవిష్కరణలు ఆర్థిక వ్యవస్థలనే మార్చేస్తున్నాయిభారత్ ఈ మార్పుల్లో భాగస్వామిగా మాత్రమే కాకుండా.. అనేక రంగాల్లో ముందంజలో ఉందిమన డిజిటల్ విప్లవం.. డిజిటల్ చెల్లింపులో భారత్‌ను అంతర్జాతీయ స్థాయిలో అగ్రగామిగా నిలిపిందిమౌలిక వసతులు సైతం భవిష్యత్తు దృక్పథంతో మునుపెన్నడూ లేని వేగంతో అభివృద్ధి చెందుతున్నాయిప్రపంచంలోనే మూడో అతిపెద్ద అంకుర సంస్థల వ్యవస్థగా భారత్ వేగంగా ఎదిగిందిమన యువత అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపిస్తున్నారుఈ విజయాలన్నింటికీ కారణం మన దేశ యువతఆర్ట్ ఆఫ్ లివింగ్ప్రస్తుత ఆధునిక యుగంలో ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారాలను వెతకడంలో యువతకు గురుదేవ్ఆర్ట్ ఆఫ్ లివింగ్ అందిస్తున్న సహకారం గొప్పది.

మిత్రులారా,

వేర్వేరు చోట్ల ఉన్న వ్యక్తులు టెక్నాలజీ సహాయంతో క్షణాల్లో ఒకరితో ఒకరు అనుసంధానమవుతున్నారుఈ ప్రపంచంతో మనం అనుసంధానమయినా కాకపోయినా.. మనతో మనం సంధానమవడం అవసరంవిత్తనం నాటడమైనాదాన్ని పోషించడమైనా లేదా దానికి శక్తినివ్వడమైనా అది మనతో మనం అనుసంధానమవడం అనే గొప్ప సంప్రదాయం ద్వారానే సాధ్యమవుతుందిమానసిక ప్రశాంతతసామాజిక బాధ్యతసమాజం పట్ల స్పందించే గుణమున్న యువతతోనే అభివృద్ధి చెందిన భారత్ సాధ్యమవుతుందిఅందుకే ఆధ్యాత్మిక సంక్షేమంమానసిక ఆరోగ్యంయోగాధ్యానంపై మీరు చేపడుతున్న కార్యకలాపాలువీటిపై కృషి చేస్తున్న ఇతర సంస్థలు అత్యంత ముఖ్యమైనవిఇవి ప్రజల మధ్య అనుసంధానంఐక్యతా భావంఉమ్మడి బాధ్యతను పెంపొదిస్తున్నాయిఅదే సమయంలో ప్రజలకు తమ సంస్కృతి గురించి తెలుసుకోవడానికిఅర్థం చేసుకోవడానికి అవకాశాన్ని అందిస్తున్నాయిఅనేక తరాల పాటు వేల మంది ప్రజలకు శాంతినిస్వస్థతను అందించే కేంద్రంగాఈ రోజు ప్రారంభమైన ధ్యాన మందిరం మారుతుందని నేను విశ్వసిస్తున్నాను.

మిత్రులారా,

దేశం పట్లసమాజం పట్ల మీ బాధ్యతలను మీరు నెరవేరుస్తున్నారుకానీ నేనెప్పుడు మీ మధ్యకు వచ్చినా కొన్ని అభ్యర్థనలు చేయకుండా ఉండలేనునేను మాట్లాడక ముందే మీ తొమ్మిది వినతులకు అంగీకరించామని గురుదేవ్ చెప్పారుకాబట్టి నాకు చెప్పడానికి ఏమీ లేదుకానీ అలవాట్లు ఓ పట్టాన పోవు కదాభారత్ సంపూర్ణాభివృద్ధి కోసం అనేక స్థాయుల్లో సమష్టి ప్రయత్నాలు చేపట్టాల్సిన అవసరం ఉందిదీనిలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ లాంటి సంస్థలు కీలకమైన పాత్రను పోషించడమే కాకుండా.. ఈ పరివర్తనకు దృఢమైన సంరక్షునిగా మారగలవుమీలో అనేక మంది రైతులుగ్రామీణ సమాజాలతో కలసి పనిచేస్తారుఇక్కడ ప్రదర్శించిన చిత్రంలో మాదిరిగానే.. సహజ వ్యవసాయంతో రైతులను అనుసంధానించడానికి అనేక ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందిఅనారోగ్యంలో ఉన్నప్పటికీ ప్రజలు సహజ చికిత్స కోసం నేడు చూస్తున్నారుమన భూమాతకు కూడా సహజ చికిత్స అవసరం ఏర్పడిందిరసాయన ఎరువులు మన పొలాలనుమన భూమాతను నాశనం చేశాయిరసాయనాల నుంచి భూమాతను రక్షించడం కూడా ఆర్ట్ ఆఫ్ లివింగేపర్యావరణాన్నిఆర్థిక వ్యవస్థను వేరు చేసి చూడలేంనీటిని సమర్థంగా ఎలా వినియోగించుకోవాలో ‘పెర్ క్రాప్ మోర్ డ్రాప్’ ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నాంమీ సహకారంతో మరిన్ని మంచి ఫలితాలను సాధించవచ్చుఎందుకంటే ప్రతి నీటి బొట్టునూ ఆదా చేయడం కూడా ఆర్ట్ ఆఫ్ లివింగేమరికొన్ని వారాల్లో వర్షాకాలం రాబోతుందికాబట్టి నీటి సంరక్షణ గురించి విస్తృతంగా ప్రచారం చేయడానికి ఇదే సరైన సమయంఅదే విధంగా విద్యుత్తును ఆదా చేయడంఒకసారి వాడే పారేసే ప్లాస్టిక్‌‌ను నివారించడంస్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడం ఇవన్నీ కూడా ఆర్ట్ ఆఫ్ లివింగేప్రస్తుతం మిషన్ లైఫ్‌కు దేశం అత్యధిక ప్రాధాన్యమిస్తోందిమరింత బాధ్యతగాఅవగాహనతో జీవించాలని చెప్పే ఉద్యమమిదిప్రకృతితో సమతుల్యంగా ఉండే జీవన విధానాన్ని స్వీకరించాలని పిలుపునిచ్చే ఉద్యమం ఇదిమిషన్ లైఫ్ కూడా ఆర్ట్ ఆఫ్ లివింగ్ రూపమేమీరు ఎప్పటిలాగే భవిష్యత్తులో ఆర్ట్ ఆఫ్ లివింగ్‌కు సంబంధించిన అనేక అంశాలను విస్తరించిఅభివృద్ధి చేస్తారని నేను విశ్వసిస్తున్నానుసమాజంలోని విస్తృత వర్గాలతో మమేకమవ్వడానికి మీరు అధిక ప్రాధాన్యమిస్తారుగురుదేవ్ శత జన్మదినం జరుపుకొనే సమయానికి ఈ లక్ష్యాలను మనం పూర్తి చేయాలిమరోసారిశ్రీ శ్రీ రవిశంకర్ గురుదేవునికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానుసేవా స్ఫూర్తిఅంకితభావంతో పనిచేసే ఆర్ట్ ఆఫ్ లివింగ్ కుటుంబానికి చెందిన ప్రతి స్వచ్ఛంద సేవకున్నీ అభినందిస్తున్నానుమరోసారిమీ అందరి మధ్యకు వచ్చేఈ పవిత్ర వాతావరణంలో కొన్ని క్షణాలు గడిపేపద్మం నీడలో ఆలోచించే అవకాశాన్ని మీరు నాకు ఇచ్చారుదీనికోసం మీ అందరికీ హృదయపూర్వకం ధన్యవాదాలు తెలియజేస్తున్నానుజై గురుదేవ్.

సూచనఇది ప్రధానమంత్రి హిందీలో చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం.

***


(రిలీజ్ ఐడి: 2259826) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali , Manipuri , Gujarati , Kannada , Malayalam