రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

భారత సైన్యానికి అయిదు గ్రౌండ్‌ బేస్డ్ మొబైల్‌ ఎలక్ట్రానిక్‌ సిస్టమ్స్‌ కొనుగోలు కోసం


బీఈఎల్‌తో రక్షణ శాఖ రూ. 1,476 కోట్ల విలువైన ఒప్పందం

प्रविष्टि तिथि: 05 MAY 2026 3:33PM by PIB Hyderabad

భారత సైన్యం కోసం రూ. 1,476 కోట్ల విలువైన అయిదు గ్రౌండ్-బేస్డ్ మొబైల్ ఎలక్ట్రానిక్ వ్యవస్థల కొనుగోలుకు సంబంధించి రక్షణ మంత్రిత్వ శాఖ హైదరాబాద్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుందికనీసం 72 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో కూడిన ఈ ప్రాజెక్టును బై (భారతీయ- రూపకల్పనఅభివృద్ధితయారీవిభాగం కింద చేపట్టారుమే 05, 2026న న్యూఢిల్లీలోని కర్తవ్య భవన్-2లో రక్షణ శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి.

ఈ వ్యవస్థల ద్వారా భారత సైనిక విభాగాల ఆధునికీకరణ జరగడమే కాకుండాదేశీయ రక్షణ తయారీ రంగం మరింత బలోపేతం కానుందిరక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలను సాధించడంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వ నిబద్ధతను ఈ ఒప్పందం మరోసారి చాటిచెప్పింది.

***


(रिलीज़ आईडी: 2258038) आगंतुक पटल : 70
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Punjabi