ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బుద్ధ పూర్ణిమ సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు


అష్టాంగ మార్గాన్ని వివరించే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 01 MAY 2026 9:11AM by PIB Hyderabad

బుద్ధ పూర్ణిమ పర్వదినం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. బుద్ధ భగవానుని ప్రబోధాల సాకారంపై అచంచల నిబద్ధతను స్పష్టం చేస్తూ- ఆయన ఆలోచనలు సమాజ సౌఖ్యం, ఐక్యతా స్ఫూర్తిని ఇనుమడింపజేయాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. శాంతి, కరుణ, సద్భావన మార్గంలో జీవనానికి స్ఫూర్తినిచ్చే ఈ పావన సందర్భంలో బుద్ధభగవానుడు ప్రబోధించిన జీవన విలువలను అనుసరించే దిశగా ప్రతి ఒక్కరూ సంకల్పం పూనాలని ఆయన కోరారు.

ఈ సందర్భంగా ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకుంటూ- గౌతమ బుద్ధుని ప్రబోధం మేరకు అంతర్గతంగా... బహిర్గతంగా శాశ్వత ఉనికి లేదనే సత్యాన్ని గ్రహించి ప్రతి వ్యక్తీ అష్టాంగ మార్గాన్ని అనుసరించాలన్నారు. సమ్యక్ దృష్టి.. సంకల్పం.. కర్మలను పాటిస్తే దుఃఖ విముక్తులై శాశ్వత శాంతిని పొందగలరని పేర్కొన్నారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన వరుస సందేశాల్లో:

“బుద్ధ పూర్ణిమ పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ నా శుభాకాంక్షలు. బుద్ధ భగవానుని ప్రబోధాల సాకారంపై మన నిబద్ధత అచంచలం. ఆయన ఆలోచనలు సమాజ సౌఖ్యం, ఐక్యతా స్ఫూర్తిని మరింత పెంపొందించాలని ఆకాంక్షిస్తున్నాను.

... శాంతి, కరుణ, సద్భావన మార్గానుసరణలో మనకెంతో స్ఫూర్తినిచ్చే ఈ పవిత్ర సందర్భంలో, బుద్ధ భగవానుని జీవన విలువలను పాటించే దిశగా మన సంకల్పాన్ని పునరుద్ఘాటిద్దాం.”

“నాన్తర్బహిశ్చ లోకేషు త్వాత్మానం దృష్టవాన్ క్వాచిత్ ।

అష్టాంగికేన్ మార్గం పరమం శాంతిమయౌ॥"

అంటే- గౌతమ బుద్ధుని ప్రబోధం మేరకు... అంతర్గతంగా... బహిర్గతంగా శాశ్వత ఉనికి లేదనే సత్యాన్ని గ్రహించి ప్రతి వ్యక్తీ అష్టాంగ మార్గాన్ని అనుసరించాలి. సమ్యక్ దృష్టి.. సంకల్పం.. కర్మలను పాటిస్తే దుఃఖ విముక్తులై శాశ్వత శాంతి పొందగలరు” అని ప్రధానమంత్రి వివరించారు.


(రిలీజ్ ఐడి: 2257274) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Gujarati , Kannada