కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

విపత్తులపై తక్షణ హెచ్చరికల కోసం దేశవ్యాప్తంగా స్వదేశీ సెల్ బ్రాడ్‌కాస్ట్ వ్యవస్థ పరీక్షలు


పరీక్షల దశలో మొబైల్ ఫోన్లకు ఇంగ్లీష్, హిందీ ప్రాంతీయ భాషల్లో పరీక్ష సందేశాలు… అయితే వాటిపై ఎటువంటి చర్యలు తీసుకోకూడదని స్వీకర్తలకు విజ్ఞప్తి

నాడు పోస్టు చేయడమైనది: 29 APR 2026 6:51PM by PIB Hyderabad

భారత ప్రభుత్వ కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ పరిధిలోని టెలీకమ్యూనికేషన్ల విభాగం (డాట్జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ)తో కలిసిపౌరులకు కీలక సమాచారం సకాలంలో అందేలా చూసేందుకు దేశవ్యాప్తంగా మొబైల్ ఆధారిత విపత్తు సమాచార వ్యవస్థలను చురుగ్గా బలోపేతం చేస్తోంది.

టెలీకమ్యూనికేషన్ల విభాగానికి చెందిన ప్రధాన పరిశోధన అభివృద్ధి కేంద్రం టెలిమాటిక్స్ అభివృద్ధి కేంద్రం రూపొందించిన సమగ్ర హెచ్చరిక వ్యవస్థ సాచెట్ను ఎన్డీఎంఏ విజయవంతంగా అమలులోకి తెచ్చిందిఅంతర్జాతీయ టెలీకమ్యూనికేషన్ యూనియన్ సిఫార్సు చేసిన సాధారణ హెచ్చరిక నియమావళి (కామన్ అలర్టింగ్ ప్రోటోకాల్సీఏపీఆధారంగా ఈ వ్యవస్థ పనిచేస్తుందిఇది ప్రస్తుతం భారతదేశంలోని మొత్తం 36 రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలలో అమల్లో ఉందిభౌగోళికంగా లక్షిత ప్రాంతాలలో ఉన్న మొబైల్ వినియోగదారులకు విపత్తుఅత్యవసర సంబంధిత హెచ్చరికలను సంక్షిప్త సందేశాల ద్వారా అందజేస్తుంది.

విపత్తు నిర్వహణ అధికారులు ఈ వ్యవస్థను విస్తృతంగా వినియోగించుకుంటున్నారుప్రకృతి వైపరీత్యాలువాతావరణ హెచ్చరికలుతుపాను సమయాలలో 19 పైగా  భారతీయ భాషలలో నేటి వరకు 13,400 కోట్లకు పైగా లఘు సందేశాలను పంపడానికి ఇది వీలు కల్పించింది.

సునామీలుభూకంపాలుపిడుగులు వంటి అత్యవసర సమయాల్లోనూగ్యాస్ లీకేజీలురసాయన ప్రమాదాల వంటి మానవ తప్పిద అత్యవసర పరిస్థితుల్లోనూ హెచ్చరికల చేరవేతను మరింత పటిష్టం చేయడానికిలఘు సందేశాలతో పాటు సెల్ ప్రసార సాంకేతికతను అందుబాటులోకి తెచ్చారుసెల్ ప్రసార వ్యవస్థలోనిర్ణీత భౌగోళిక ప్రాంతంలో ఉన్న అన్ని మొబైల్ ఫోన్లకు ఏకకాలంలో హెచ్చరికలను పంపుతారుతద్వారా హెచ్చరికలు తక్షణమే అందేలా చూస్తారు.

ఈ సెల్ ప్రసార ఆధారిత ప్రజా అత్యవసర హెచ్చరిక వ్యవస్థ స్వదేశీ అభివృద్ధిఅమలు బాధ్యతలను సీడాట్ కు అప్పగించారు.

దేశవ్యాప్త అమలుసెల్ ప్రసార సదుపాయం ప్రారంభంలో భాగంగావ్యవస్థ పనితీరువిశ్వసనీయతను అంచనా వేయడానికిఅధికారికంగా ప్రారంభించి జాతికి అంకితం చేయడానికి ముందుగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా పరీక్షలుపరిశీలనలు చేపట్టారుఈ సమయంలోప్రజలు తమ మొబైల్ ఫోన్లలో ఇంగ్లీష్హిందీప్రాంతీయ భాషలలో పరీక్షా సందేశాలను పొందవచ్చు.

అయితే ఈ టెస్ట్ సందేశాలు సెల్ బ్రాడ్‌కాస్ట్ టెస్ట్ ఛానెళ్లను ఎంచుకున్న మొబైల్ ఫోన్లకు మాత్రమే అందుతాయి (వినియోగదారులు తమ సెల్ ఫోన్లలో హెచ్చరికల కోసం ఆమోదం తెలపవచ్చులేదా తిరస్కరించవచ్చుసెట్టింగ్స్ → సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ → వైర్‌లెస్ ఎమర్జెన్సీ అలర్ట్స్ → టెస్ట్ అలర్ట్స్). టెస్టింగ్ ప్రక్రియలో భాగంగామొత్తం మొబైల్ నెట్‌వర్క్ మౌలిక వసతుల్లో సరైన పనితీరును ధ్రువీకరించడంలో గ్రహీతలు అనేక సందేశాలను అందుకోవచ్చు.

ఈ సందేశాలు ప్రణాళికాబద్ధమైన దేశవ్యాప్త పరీక్షా ప్రక్రియలో భాగం మాత్రమేఈ సందేశాలకు గ్రహీతలు ఏ రకంగానూ స్పందించాల్సిన అవసరం లేదు.

ఇంగ్లీష్హిందీ భాషల్లో ఉండే పరీక్షా సందేశంలోని సమాచారం తెలుగు అనువాదం ఈ క్రింది విధంగా ఉంటుంది:

ఇది హెచ్చరికల ప్రసారం కోసం సెల్ ప్రసార వ్యవస్థ పరీక్షలో భాగంగాభారత ప్రభుత్వ టెలీకమ్యూనికేషన్ల విభాగంతో కలిసి జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ పంపిన మొబైల్ ప్రసార పరీక్షా సందేశంసెల్ ప్రసార వ్యవస్థ పరీక్ష సమయంలోఈ సందేశం మీ మొబైల్ కు పలుమార్లు రావచ్చుదయచేసి ఈ సందేశాలను పట్టించుకోవద్దుమీ వైపు నుంచి  ఎటువంటి చర్యా అవసరం లేదు.

విజయవంతంగా పరీక్షించి అమల్లోకి తెచ్చిన తర్వాతసెల్ బ్రాడ్‌కాస్ట్ (సీబీ)వ్యవస్థను అన్ని మొబైల్ హ్యాండ్‌సెట్లలో టెస్ట్ ఛానెల్ సెట్టింగ్స్‌కు సంబంధం లేకుండా అనేక భారతీయ భాషల్లో హెచ్చరికలను పంపడానికి ఉపయోగిస్తారుతద్వారా అత్యవసర పరిస్థితుల్లో విస్తృతంగాసమగ్రంగా ప్రజలకు సమాచారం చేరుస్తారు

ముఖ్యమైన ఈ పరీక్షా దశలో ప్రజల సహకారాన్ని డాట్ కోరుతోందిఈ కాలంలో అందే పరీక్షా సందేశాలు కేవలం వ్యవస్థ పనితీరు ధ్రువీకరణ కోసం మాత్రమేననిస్వీకర్తలు ఎటువంటి చర్యలు తీసుకోనవసరం లేదని మరోసారి స్పష్టం చేస్తోంది.

మరింత సమాచారం కోసం డాట్ ఖాతాలను చూడండి: -

X - https://x.com/DoT_India

Insta-  https://www.instagram.com/department_of_telecom?igsh=MXUxbHFjd3llZTU0YQ==

Fb - https://www.facebook.com/DoTIndia

Youtube: https://youtube.com/@departmentoftelecom?si=DALnhYkt89U5jAaa

 

 

***


(రిలీజ్ ఐడి: 2256786) సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Gujarati