సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
2025-26లో సామాజిక న్యాయం-సాధికారత శాఖ వ్యయం ₹2042.08 కోట్లకు పెంపు
ఓబీసీ.. ఈబీసీ.. డీఎన్‌టీ విద్యార్థుల స్కాలర్‌షిప్ సహా “ఉన్నత స్థాయి విద్య” పథకాల అమలులో గణనీయ పురోగమనం
సామాజికంగా.. విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు నాణ్యమైన విద్యా సౌలభ్యం సహా విద్యా ప్రగతిని మెరుగుపరచడమే ఈ పథకాల లక్ష్యం: కేంద్ర మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్
నాడు పోస్టు చేయడమైనది:
29 APR 2026 6:36PM by PIB Hyderabad
దేశంలో విద్యా సాధికారత దిశగా ప్రభుత్వం కొనసాగిస్తున్న కృషిలో భాగంగా ఇతర వెనుకబడిన, ఆర్థికంగా వెనుకబడిన (ఓబీసీ, ఈబీసీ) తరగతులు సహా డీ-నోటిఫైడ్, సంచార, పాక్షిక సంచార తెగల (డీఎన్‌టీ) విద్యార్థుల కోసం సామాజిక న్యాయం-సాధికారత మంత్రిత్వ శాఖ అనేక పథకాలను అమలు చేస్తోంది.
ఈ వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యా సౌలభ్యం సహా విద్యా ప్రగతికి చేయూతనివ్వడం ఈ కార్యక్రమాల లక్ష్యమని కేంద్ర మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ తెలిపారు. ఈ మేరకు 2025-2026 ఆర్థిక సంవత్సరంలో ఈ కార్యక్రమాల కింద వ్యయాన్ని రూ.2042.08 కోట్లకు పెంచినట్లు ఆయన తెలిపారు.
మునుపటి (2024-25) ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2025-26లో ఓబీసీ సంక్షేమ పథకాల వ్యయం గణనీయంగా పెరిగి 36.96 శాతానికి చేరింది. అర్హులైన లబ్ధిదారులకు విద్యా సహాయం, లక్షిత సంక్షేమ ప్రదానంపై ప్రభుత్వం సదా దృష్టి సారిస్తుండటాన్ని ఇది ప్రతిబింబిస్తుంది.
అలాగే, 2024-25తో పోలిస్తే, మొత్తం నిధుల్లో పథకాల వారీగా పెరిగిన వ్యయాన్ని పరిశీలిస్తే- ఓబీసీ, ఈబీసీ, డీఎన్‌టీల కోసం ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్ కింద 59.13 శాతం, పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్ కింద 27.18 శాతం, పాఠశాలల్లో ఉన్నత స్థాయి విద్య కింద 154 శాతం, ఇదే వర్గాలకు కళాశాలల్లో ఉన్నత స్థాయి విద్య కింద 105.80 శాతం మేర పెరిగింది.
సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు విద్యావకాశాల విస్తరణలో ప్రభుత్వ నిరంతర నిబద్ధతను ఈ పథకాల వ్యయంలో పెరుగుదల ప్రతిబింబిస్తోంది. పథకాలను మరింత చురుగ్గా అమలు చేయడం, ప్రజలకు మరింత చేరువ చేయడం, అర్హులైన విద్యార్థులకు లక్షిత ప్రయోజనాలు సకాలంలో, సమర్థంగా అందేవిధఃగా చూడటంపై మంత్రిత్వ శాఖ దృష్టి సారించింది.
***
(రిలీజ్ ఐడి: 2256784)
సందర్శకుల సూచీ సంఖ్య : : 20