ప్రధాన మంత్రి కార్యాలయం
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జరిగిన మహిళా సమ్మేళనం ముఖ్యాంశాల్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
28 APR 2026 9:41PM by PIB Hyderabad
వారణాసిలో జరిగిన మహిళా సమ్మేళనం ముఖ్యాంశాల్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు. మహిళలకు సాధికారతను కల్పించడానికి, నారీ శక్తి కి స్ఫూర్తిదాయక భాగస్వామ్యాన్ని అందించడానికి, కాశీని నిరంతరం అభివృద్ధి బాటలో ముందుకు తీసుకుపోవడానికి తమ ప్రభుత్వం అచంచల నిబద్ధతతో పని చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి వరుస సందేశాల్లో ఇలా రాశారు..:
‘‘వారణాసిలో నిర్వహించిన మహిళా సమ్మేళనంలో మన నారీ శక్తి పాలుపంచుకున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది.’’
‘‘మా ప్రభుత్వం విధానాల రూపకల్పన ప్రక్రియలో అక్కాచెల్లెళ్లకు, కుమార్తెలకు కీలక ప్రాధాన్యాన్ని ఇస్తోంది. కాశీలో మహిళా సమ్మేళనాన్ని నిర్వహించడం కూడా నారీ శక్తికి వందనాలు చేసే, వారి అభివృద్ధికి ప్రతిన బూనే ఉత్సవమే.’’
‘‘ఉత్తరప్రదేశ్‌లో బనాస్ డెయిరీతో అనుబంధాన్ని కలిగివున్న లక్షల మంది అక్కచెల్లెళ్లు అద్భుతమైన పనిని చేస్తున్నారు. ఇవాళ ఈ అక్కచెల్లెళ్లకు బోనస్ నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయింది. ఈ అక్కచెల్లెళ్లందరికీ అనేకానేక అభినందనల్ని తెలియజేస్తున్నాను.’’
‘‘మహిళల రిజర్వేషనుకు అడ్డం పడిన కుటుంబవాదులతో పాటు సంతోషపరిచే విధానంలో మునిగితేలుతున్న పార్టీల కుటిల ఉద్దేశాల్ని దేశంలోని అక్కచెల్లెళ్లూ, కుమార్తెలూ అర్థం చేసుకున్నారు. అస్సాం, కేరళం, పుదుచ్చేరి, బంగాల్, తమిళనాడుల్లో రికార్డు స్థాయిలో నమోదైన ఓటింగు వీరికి శిక్ష వేయడానికే సుమా.’’
‘‘అనుసంధానం కానివ్వండి, ఆరోగ్య సంబంధిత అనుబంధ విస్తారిత వ్యవస్థ కానివ్వండి, లేదా కాశీ వారసత్వాన్ని సంరక్షించడం కానివ్వండి.. ఇక్కడి ప్రజల జీవనాన్ని సరళతరంగా మార్చడానికి ఎలాంటి ప్రయత్నాల్నీ మేం వదిలేసే ప్రసక్తే లేదు.’’
***
(రిలీజ్ ఐడి: 2256503)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Malayalam