ప్రధాన మంత్రి కార్యాలయం
నియామక సందర్భంగా ప్రొఫెసర్ గోబర్ధన్ దాస్‌కు ప్రధాని అభినందన
प्रविष्टि तिथि:
25 APR 2026 10:47PM by PIB Hyderabad
నీతి ఆయోగ్ సభ్యుడిగా నియమితుడైన ప్రొఫెసర్ గోబర్ధన్ దాస్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. పదవీకాలాన్ని విజయవంతంగా కొనసాగించాలంటూ శుభాకాంక్షలు అందించారు. ఆయన నిగర్వి అనీ, అలుపెరుగని అంకితభావంతో ఆయన ప్రస్థానం స్ఫూర్తిదాయకంగా కొనసాగుతోందనీ శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ప్రజారోగ్యం, విజ్ఞాన శాస్త్రం, ఆవిష్కరణ రంగాల్లో ప్రొఫెసర్ దాస్ అమూల్య సేవలను ఆయన కొనియాడారు. ఆయన విజయాలతో దేశమంతా గర్విస్తోందన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
“ప్రొఫెసర్ గోబర్ధన్ దాస్ గారూ, మీకు అభినందనలు!
అలుపెరుగని కృషి, వినమ్రత కలబోసిన మీ ప్రస్థానం అందరికీ స్ఫూర్తిదాయకం. ప్రజారోగ్యం, విజ్ఞాన శాస్త్రాలు, ఆవిష్కరణ రంగాల్లో మీ సేవలకు యావద్దేశమూ గర్విస్తోంది. మీ పదవీకాలం విజయవంతంగా కొనసాగాలని కోరుకుంటూ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.’’
(रिलीज़ आईडी: 2255724)
आगंतुक पटल : 47
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam