సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
ఏప్రిల్ 24–26 తేదీల్లో చండీగఢ్‌లోని చింతన్ శిబిరంలో స్మైల్-బెగ్గరీ సర్వే మొబైల్ యాప్ ప్రారంభం
నాడు పోస్టు చేయడమైనది:
25 APR 2026 10:42AM by PIB Hyderabad
కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ 2026 ఏప్రిల్ 24 నుంచి 26 వరకు వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో చండీగఢ్‌లో నిర్వహించిన చింతన్ శిబిరం సందర్భంగా ‘స్మైల్ బెగ్గరీ’(భిక్షాటన) సర్వే మొబైల్ యాప్‌ను ప్రారంభించింది.
భిక్షాటనలో నిమగ్నమైన వ్యక్తుల సమగ్ర పునరావాసం కోసం ఉద్దేశించిన స్మైల్-బెగ్గరీ ఉప-పథకం కింద ఈ సరికొత్త మొబైల్ అప్లికేషన్‌ను ప్రభుత్వం రూపొందించింది. క్షేత్రస్థాయిలో పథకం అమలును మరింత బలోపేతం చేయడం, ఎప్పటికప్పుడు డేటా సేకరణ, మెరుగైన పర్యవేక్షణే లక్ష్యంగా ఈ యాప్‌ను అభివృద్ధి చేశారు. అమలు చేసే సంస్థలు, జిల్లా అధికారులకు సర్వే వివరాలను డిజిటల్ రూపంలో నమోదు చేసేందుకు ఈ యాప్ వీలు కల్పిస్తుంది. దీని వల్ల సమాచార సేకరణలో ఖచ్చితత్వం, పారదర్శకత పెరగడంతో పాటు సకాలంలో నివేదికలు అందించడం సాధ్యమవుతుంది.
గతంలో డేటా రిపోర్టింగులో తలెత్తే జాప్యం, అస్థిరత వంటి సవాళ్లను అధిగమించడంలో ఈ మొబైల్ యాప్ ప్రారంభం కీలక మైలురాయిగా నిలవనుంది. అలాగే దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో పనుల పురోగతిని పర్యవేక్షించడం, డేటా విశ్లేషణ, పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించే విషయంలో మంత్రిత్వ శాఖ సామర్థ్యాన్ని ఇది గణనీయంగా పెంచుతుంది.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రిత్వ శాఖ వారు మాట్లాడుతూ.. ‘‘భిక్షా వృత్తి ముక్త్ భారత్’’ (భిక్షాటన లేని భారత్) సాధించాలన్న ప్రభుత్వ దార్శనికతకు ఈ కార్యక్రమం పూర్తి అనుగుణంగా ఉంటుందని చెప్పారు. ఈ యాప్ రాకతో పథకానికి సంబంధించిన మొత్తం పర్యవేక్షణ యంత్రాంగం మరింత శక్తిమంతం కానుంది. గుర్తించిన వ్యక్తులను తిరిగి సమాజ ప్రధాన స్రవంతిలోకి చేర్చేందుకు, వారు ఆత్మవిశ్వాసంతో, గౌరవంగా జీవితాన్ని గడిపేలా చేసేందుకు సాంకేతికతతో కూడిన పరిష్కారాలను వినియోగించుకోవడమే కాకుండా, సంస్థాగత వ్యవస్థలను బలోపేతం చేయడానికి తాము కట్టుబడి ఉన్నట్లు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
***
(రిలీజ్ ఐడి: 2255518)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6