జాతీయ మానవ హక్కుల కమిషన్
ఒడిశా.. గజపతి జిల్లాలో ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఇనుప గేటు విరిగిపడడంతో ఇద్దరు విద్యార్థినులు చనిపోయారంటూ వచ్చిన వార్తాకథనాన్ని సుమోటోగా తీసుకున్న భారత ఎన్‌హెచ్‌ఆర్‌సీ
ఈ ఘటనపై పూర్తి వివరాలతో రెండు వారాల్లోగా నివేదిక సమర్పించాలని
ఒడిశా రాష్ట్ర ప్రధాన కార్యదర్శికీ, గజపతి ఎస్పీకీ నోటీసులు
నాడు పోస్టు చేయడమైనది:
24 APR 2026 12:58PM by PIB Hyderabad
ఒడిశా.. గజపతి జిల్లాలో ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఇనుప గేటు ఈ నెల 15న విరిగి ఇద్దరు విద్యార్థినులపై పడడంతో, వారు మరణించారని ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తా కథనాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) స్వయంగా పరిశీలనకు స్వీకరించింది. బడి ప్రవేశద్వారం దగ్గర బాలికలు ఆడుకుంటున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు వార్తా కథనంలో పేర్కొన్నారు.
వార్తా కథనంలోని వివరాలు నిజమే అయిన పక్షంలో, బాధితుల మానవ హక్కుల విషయంలో తీవ్ర ఉల్లంఘన జరిగినట్లేనని కమిషన్ అభిప్రాయపడింది. ఈ కారణంగా, గజపతి పోలీస్ సూపరింటెండెంటుకీ, ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికీ కమిషన్ నోటీసులను జారీ చేసి, దీనిపై రెండు వారాల లోపల సమగ్ర నివేదికను ఇవ్వాలని స్పష్టం చేసింది.
విద్యార్థినులు శిథిలాల కింద చిక్కుబడిపోయారనీ, స్థానికులు వెంటనే బాధితుల్ని దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకువెళ్లారనీ 2026 ఏప్రిల్ 16 నాటి మీడియా కథనం పేర్కొంది. అయితే, ఆ బాలికలు అప్పటికే చనిపోయారని వైద్యులు ప్రకటించినట్లు ఆ వార్తా కథనం తెలిపింది.
***
(రిలీజ్ ఐడి: 2255266)
సందర్శకుల సూచీ సంఖ్య : : 12