ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ గర్వాల్‌లో ప్రమాదం.. ప్రాణనష్టంపై ప్రధానమంత్రి సంతాపం

పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌ నుంచి నష్ట పరిహారాన్ని ప్రకటించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 23 APR 2026 7:24PM by PIB Hyderabad

ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ గర్వాల్ జిల్లాలో జరిగిన ప్రమాదంలో పలువురు మృతిచెందడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటనలో తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు.

 

మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రధానమంత్రి ప్రకటించారు.

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.

 

‘‘ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ గర్వాల్ జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణ నష్టం సంభవించడం విచారకరం. ఈ దుర్ఘటనలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.

 

మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ. 2 లక్షలు.. గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున నష్ట పరిహారాన్ని అందజేస్తున్నాను: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ’’.


(रिलीज़ आईडी: 2255150) आगंतुक पटल : 59
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Kannada , Malayalam