ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

ఎయిమ్స్ రిషికేశ్ 6వ స్నాతకోత్సవంలో ఉపరాష్ట్రపతి ప్రసంగం


దేశ నిర్మాణంలో సానుభూతి, నిజాయితీ, నిబద్ధతతో సేవ చేయాలని పట్టభద్రులకు ఉపరాష్ట్రపతి పిలుపు

ఎయిమ్స్ విస్తరణపై ఉపరాష్ట్రపతి ప్రశంసలు.. చివరి వ్యక్తి వరకు వైద్య సేవలు చేరాలని సూచన

వైద్య సేవలు కేవలం ఆసుపత్రులకే పరిమితం కాకూడదు.. రిషికేశ్ ఎయిమ్స్‌లో టెలిమెడిసిన్, ఆవిష్కరణలను ప్రశంసించిన ఉపరాష్ట్రపతి

కోవిడ్ సమయంలో భారత్ చూపిన సమానత్వ ధోరణిని గుర్తుచేసిన ఉపరాష్ట్రపతి.. వ్యాక్సిన్ మైత్రి కార్యక్రమంపై ప్రశంసలు

మౌలిక సదుపాయాలు, సేవలను బలోపేతం చేయడంలో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి నాయకత్వాన్ని అభినందించిన ఉపరాష్ట్రపతి

నాడు పోస్టు చేయడమైనది: 23 APR 2026 1:58PM by PIB Hyderabad

ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్ లో ఉన్న ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) 6వ స్నాతకోత్సవ వేడుకల్లో నేడు భారత ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధకృష్ణన్ ప్రసంగించారుఆయన మాట్లాడుతూ.. పట్టభద్రులవుతున్న విద్యార్థుల జీవితంలో ఇది మార్పుఆత్మపరిశీలనబాధ్యతకు సంబంధించిన కీలకమైన సమయమని అభివర్ణించారు.

రిషికేశ్ ఆధ్యాత్మికసాంస్కృతిక ప్రాముఖ్యతను ఉపరాష్ట్రపతి ప్రస్తావించారురిషికేశ్ ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక చింతనకుప్రశాంతతకు నిలయమనిహిమాలయాలకు ముఖద్వారమని పేర్కొన్న ఉపరాష్ట్రపతి..  ఇలాంటి పవిత్రమైన ప్రదేశంలో ఈ స్నాతకోత్సవ వేడుకలు జరగడం ఈ కార్యక్రమానికి మరింత అర్థాన్ని ఇస్తుందని అన్నారు.

స్నాతకోత్సవం.. కేవలం ఇన్నేళ్ల క్రమశిక్షణతో కూడిన కృషికిత్యాగానికి లభించిన ముగింపు మాత్రమే కాదనీసమాజందేశం పట్ల మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన సమయమానికి ఆరంభమని శ్రీ సీపీ రాధ కృష్ణన్ అన్నారుపట్టభద్రులందరూ వృత్తిపరమైన విధులను అంకితభావంతోగొప్ప లక్ష్యంతో నిర్వర్తించాలని ఆయన కోరారు.

కోవిడ్-19 మహమ్మారి తీసుకొచ్చిన సవాళ్లను ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ పట్టుదలనుఆవిష్కరణలనునిబద్ధతను చాటుకుందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారుదేశంలోని 140 కోట్లకు పైగా పౌరులకు ఉచితంగా వ్యాక్సిన్లను అందించడం ద్వారా ప్రతి ఒక్కరికీ వైద్య సేవలు సమానంగా అందేలా చేసిన భారీ టీకా కార్యక్రమాన్ని కొనియాడారుభారతీయ శాస్త్రవేత్తలు కేవలం లాభాపేక్ష కోసం కాకుండామానవ సంక్షేమం కోసమే టీకాలను అభివృద్ధి చేసినట్లు చెప్పారు.

100 కంటే ఎక్కువ దేశాలకు టీకాలను సరఫరా చేసిన ‘వ్యాక్సిన్ మైత్రి’ కార్యక్రమం ద్వారా భారత్ తన ప్రపంచ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించిందని ఉపరాష్ట్రపతి తెలిపారుఈ కార్యక్రమం ద్వారా ‘వసుధైక కుటుంబం’ స్ఫూర్తిని ప్రతిబింబించడమే కాకుండాబాధ్యత కలిగిన ప్రపంచ భాగస్వామిగా భారత్ తన పాత్రను మరింత బలోపేతం చేసిందని అన్నారు.

ఆరోగ్య మౌలిక సదుపాయాల విస్తరణ గురించి వివరిస్తూ.. గత దశాబ్ద కాలంలో దేశవ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన ఎయిమ్స్ సంస్థలు... ముఖ్యంగా వెనకబడిన ప్రాంతాల్లో  నాణ్యమైన వైద్య సేవలనువైద్య విద్యను ప్రజలకు చేరువ చేశాయని ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ పేర్కొన్నారుప్రజల అవసరాలను అర్థం చేసుకుని వారికి సేవ చేయడమే సుపరిపాలనకు అసలైన అర్థమని ఆయన వ్యాఖ్యానించారు.

ఎయిమ్స్ రిషికేశ్ పై ఉపరాష్ట్రపతి ప్రశంసలు కురిపించారువైద్య సేవలుమంచి విద్యా బోధనపరిశోధనఆవిష్కరణ సామాజిక నిబద్ధత కలిగిన ఈ సంస్థ ఒక అద్భుతమైన ప్రదర్శనకు ఆదర్శంగా నిలిచిందని కొనియాడారుముఖ్యంగా ఇక్కడి టెలిమెడిసిన్ కార్యక్రమాలను ఆయన అభినందించారువైద్య సేవలు కేవలం ఆసుపత్రి ప్రాంగణాలకే పరిమితం కాకుండామారుమూలవెనుకబడిన ప్రజలకు కూడా చేరాలని సూచించారు.

హెలికాప్టర్ ద్వారా అత్యవసర వైద్య సేవలుచార్ ధామ్ యాత్ర సమయంలో మారుమూల ప్రాంతాలకు మందులను చేరవేసేందుకు డ్రోన్లను ఉపయోగించడం వంటి వినూత్న ఆరోగ్య సేవలను ఉపరాష్ట్రపతి అభినందించారువైద్య సేవల రంగంలో దీర్ఘకాలంగా ఉన్న సవాళ్లకు ఇవి సమర్థవంతమైన పరిష్కారాలని పేర్కొన్నారు.

ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేతో సహా ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాల వేగవంతమైన అభివృద్ధిని ఉపరాష్ట్రపతి ప్రత్యేకంగా ప్రస్తావించారుసమ్మిళిత అభివృద్ధిని ప్రోత్సహించడంమౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంవైద్య సేవలను మెరుగుపరచడంలో ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ ధామి నాయకత్వంలోని ఉత్తరాఖండ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఆయన అభినందించారు.

వైద్య సేవలు ప్రజల నమ్మకానికి నిదర్శనమనిదేశ నిర్మాణంలో వైద్య నిపుణులు కీలక పాత్ర పోషిస్తారని శ్రీ సీపీ రాధాకృష్ణన్ తెలిపారుముందస్తు జాగ్రత్త చర్యలువైద్య సేవలు గ్రామాలకూ చేరుకోవడంపరిశోధనఆవిష్కరణల ద్వారా దేశానికి తమ వంతు సహకారం అందించాలని సూచించారుసానుభూతినిజాయితీ,  సేవా దృక్పథం వంటి విలువలతో ముందుకు సాగాలని ఆయన  కోరారు.

ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్ (పదవీ విరరమణ), ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ ధామికేంద్ర ఆరోగ్యకుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియ పటేల్ఎయిమ్స్ రిషికేశ్ అధ్యక్షులు ప్రొఫెసర్ రాజ్ బహదూర్డీన్ (అకడమిక్ప్రొఫెసర్ సౌరభ్ఎయిమ్స్ కార్యనిర్వాహక డైరెక్టర్ ప్రొఫెసర్ మీను సింగ్అధ్యాపక బృందంవిద్యార్థులుఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2254879) సందర్శకుల సూచీ సంఖ్య : : 15
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Gujarati