ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నిస్వార్థ భావనతో దానం చేయాలన్న సద్గుగుణాన్ని చాటి చెబుతున్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 23 APR 2026 10:02AM by PIB Hyderabad

దానాన్ని నిస్వార్థ బుద్ధితో ఇవ్వాలనీఅప్పుడే అది సద్గుణం అనిపించుకుంటుందనీ చాటిచెబుతున్న ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.

‘‘పద్మాకరం దినకరో వికచీకరోతి చంద్రో వికాసయతి కైరవచక్రవాలమ్

నాభ్యర్థితో జలధరోపి జలం దదాతి సన్తః స్వయం పరహితేషు కృతాభియోగాః’’

ఈ సుభాషితం ‘‘పద్మం వికసించడానికి సూర్యుడు సాయపడతాడుమరి లిల్లీపువ్వుల విషయంలో చంద్రుడూ ఇలాగే తోడ్పడుతాడుమేఘాలు వాటంతట అవే జలాన్ని వర్షిస్తాయిఇదే విధంగాఉత్తములు ఏదీ కోరుకోకుండానేపరులకు మేలు చేస్తారు’’ అని మనకు తెలియజేస్తోంది.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ -

‘‘పద్మాకరం దినకరో వికచీకరోతి చంద్రో వికాసయతి కైరవచక్రవాలమ్

నాభ్యర్థితో జలధరోపి జలం దదాతి సన్తః స్వయం పరహితేషు కృతాభియోగాః’’ అని పేర్కొన్నారు.

 

***


(रिलीज़ आईडी: 2254807) आगंतुक पटल : 53
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Kannada , Malayalam