ప్రధాన మంత్రి కార్యాలయం
కేరళలోని త్రిస్సూర్ బాణసంచా పరిశ్రమలో ప్రమాదం... ప్రాణనష్టంపై ప్రధానమంత్రి సంతాపం
పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి నష్ట పరిహారం ప్రకటించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
21 APR 2026 8:24PM by PIB Hyderabad
కేరళలోని త్రిస్సూర్‌లో ఓ బాణాసంచా కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో ప్రాణ నష్టం సంభవించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున నష్ట పరిహారాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ ప్రకటించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.
‘‘కేరళలోని త్రిస్సూర్‌లో ఒక బాణాసంచా పరిశ్రమంలో జరిగిన ప్రమాదంలో అనేక మంత్రి ప్రాణాలు కోల్పోయారన్న వార్త విని కలత చెందాను. ఈ ఘటనలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను: ప్రధానమంత్రి’’
‘‘మరణించిన వారి కుటుంబ సభ్యులకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ. 2 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేయనున్నట్లు.. అలాగే గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఇవ్వనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు’’.
***
(రిలీజ్ ఐడి: 2254364)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Malayalam