ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

వీర్ సావర్కర్ గారి జీవితం నుంచి నేర్వదగిన పాఠాలను ప్రస్తావిస్తూ ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 26 FEB 2026 10:47AM by PIB Hyderabad

వీర్ సావర్కర్ గారి జీవితం నుంచి నేర్వదగిన పాఠాలను ప్రస్తావిస్తూఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ పంచుకున్నారు.

కష్టపడి పనిచేసేఅంకిత భావం కలిగిన భరతమాత పుత్రుల్లో వీర్ సావర్కర్ గారు ఒకరనీప్రతికూల పరిస్థితుల్లో కూడా మన సంకల్పాన్ని విడనాడకూడదనే పాఠాన్ని ఆయన జీవితం నుంచి మనం నేర్చుకోవచ్చనీ ప్రధానమంత్రి అన్నారుఆయన ధైర్య సాహసాలుమాతృభూమి పట్ల అంకిత భావం దేశప్రజలకు నిరంతరం మార్గదర్శనం చేస్తుంటాయని ప్రధాని అన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -

‘‘కష్టపడి పనిచేసే భరత మాత ముద్దుబిడ్డ వీర్ సావర్కర్ గారి జీవితం నుంచివిపరీత పరిస్థితుల్లోనయినా సరే మన సంకల్పాన్ని విడనాడ కూడదనే పాఠాన్ని నేర్చుకొందాంఆయన సాహసంసంయమనంమాతృభూమి పట్ల చాటిన అంకిత భావం సదా దేశప్రజలకు మార్గాన్ని చూపుతుంటాయి.

ధీరాశోకం తరిష్యన్తి లభన్తే సిద్ధిముత్తమామ్

ధీరై: సంప్రాప్యతే లక్ష్మీధైర్యం సర్వత్ర సాధనమ్’’.

‘‘సాహసికులుదృఢ సంకల్పం గల వ్యక్తులు కష్టాలను అధిగమించి తమ జీవితాల్లో సాఫల్యాన్ని చేజిక్కించుకోగలుగుతారుఅలాంటి మనుషులు ధనికులు కావడంతో పాటు సమృద్ధిని కూడా పొందుతారుఈ కారణంగాధైర్య సాహసాలూ ఓర్పూ జీవితంలో సదా విజయాన్ని సాధించడానికి తోడ్పడే సర్వోత్తమ సాధనాలుగా నిలుస్తున్నాయి’’ అని పేర్కొన్నారు.

 

***


(रिलीज़ आईडी: 2254250) आगंतुक पटल : 18
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam