ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నౌకానిర్మాణం, షిప్పింగ్, నౌకా రవాణాపై భాగస్వామ్యానికి భారత్-ఆర్‌వోకే సమగ్ర విధానం


సామర్థ్యం, విస్తృతితో కూడిన యార్డు ఆధారిత వృద్ధి కార్యకలాపాలకు ఉమ్మడి దార్శనికత (వాయేజెస్)

నాడు పోస్టు చేయడమైనది: 20 APR 2026 10:51PM by PIB Hyderabad

భారత్‌లో అధికారిక పర్యటన సందర్భంగా కొరియా రిపబ్లిక్ (ఆర్‌వోకేఅధ్యక్షుడు శ్రీ లీ జే మ్యుంగ్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీతో 2026 ఏప్రిల్ 20న సమావేశమయ్యారుఈ చర్చల్లో నౌకా నిర్మాణంషిప్పింగునౌకా రవాణా భాగస్వామ్యంలో ప్రభుత్వప్రైవేటు సంస్థల మధ్య పరస్పర ప్రయోజనకరమైన సహకారంపై ఉభయపక్షాలు ఫలవంతమైనవిస్తృతమైన ఆలోచనలను పంచుకున్నాయి.
భారత్ఆర్‌వోకే రెండు దేశాలకూ ఘనమైన నౌకా వాణిజ్య సంప్రదాయాలున్నాయినౌకా వాణిజ్య రంగంలో పరస్పర ఆసక్తులనుబలాలను కలిగి ఉన్నాయివేగంగా విస్తరిస్తున్న ఆర్థిక వృద్ధిఅంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థగా పేరు గడిస్తున్న నేపథ్యంలో భారత భద్రతకుసంక్షేమానికి సముద్ర వాణిజ్య రంగం కీలకంగా మారింది.

నౌకా నిర్మాణంనౌకా వాణిజ్య సంప్రదాయాల్లో అగ్రగామిగా ఉన్న మిత్ర దేశం కొరియాతో దీర్ఘకాల ఒప్పందానికి గణనీయమైన అవకాశాలను మారిటైం అమృత్ కాల్ 2047 దార్శనికత పరిధిలోని భారత దేశ నౌకా వాణిజ్య లక్ష్యాలు అందించాయని ఇరుపక్షాలు అంగీకరించాయినౌకానిర్మాణంఓడరేవుల అభివృద్ధినౌకా రవాణాలో సహకారం భారత్-ఆర్‌వోకే మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందిఇది రెండు దేశాలకు ప్రయోజనం చేకూర్చేలా ఆచరణాత్మక ఫలితాలనుఆర్థిక విలువను అందిస్తుందిఅదే సమయంలో తమ ప్రజల మధ్య అవగాహననుభాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది.

దేశంలో పెద్ద స్థాయిలో గ్రీన్ ఫీల్డ్ నౌకా నిర్మాణ క్లస్టర్లు ఏర్పాటు చేయడానికి ఉన్న అవకాశాలునౌకా నిర్మాణ అభివృద్ధి పథకం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాల గురించి భారత పక్షం ఆర్‌ఓకే పక్షానికి వివరించిందివీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వాలుభారతీయ ఆర్థిక సంస్థలు అందించే ప్రోత్సాహకాల గురించి కూడా తెలియజేసిందినమూనాప్రొడక్షన్ ఇంజినీరింగ్అధునాతన తయారీనాణ్యతభద్రతా నియమాలుకార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనడం ద్వారా ఈ క్లస్టర్లకు సాంకేతికవ్యూహాత్మక భాగస్వాములుగా ఉండాలని ఆర్‌వోకేకు చెందిన ప్రముఖ షిప్ బిల్డర్లను భారతీయ పక్షం ఆహ్వానించిందివ్యాపార రంగంలో భాగస్వామ్యం ఆధారంగా ఈ సహకారం అభివృద్ధి చెందుతుందని ఆర్‌వోకే పక్షం ఆశాభావం వ్యక్తం చేసింది.
ఈ దిశగా కొరియన్భారతీయ పరిశ్రమల మధ్య ఒప్పందాలపై ఇరుపక్షాలు సానుకూలంగా స్పందించాయితప్పనిసరిగా కట్టుబడి ఉండాలన్న నిబంధనకు అతీతంగాదక్షిణ భారతదేశంలో కొత్తగా నౌకాశ్రయాన్ని సంయుక్తంగా అభివృద్ధి చేయడానికిఆర్థిక సహకారానికినిర్మాణానికికార్యకకలాపాలకు సంబంధించి ఒక ఒప్పందం కుదిరిందిక్లస్టర్‌ను అభివృద్ధి చేసే సంస్థగా గుర్తింపు పొందిన కొరియన్ నౌకా నిర్మాణ సంస్థ హెచ్‌డీ కొరియా షిప్ బిల్డింగ్ అండ్ ఆఫ్షోర్ ఇంజినీరింగ్ కంపెనీ లిమిటెడ్ (హెచ్‌డీ కేఎస్ఓఈ)కుమూలధన పెట్టుబడిని అందించే నౌకా వాణిజ్య అభివృద్ధి నిధి (ఎండీఎఫ్మధ్య ఈ ఒప్పందం ఏర్పాటైందిఈ ప్రాజెక్టును సత్వరమే ఏర్పాటు చేయాలని రెండు సంస్థలు భావిస్తున్నాయి.

ఇండియా మారిటైమ్ వీక్ - 2025 సందర్భంగా సమీప భవిష్యత్తులో దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం 2.2 లక్షల కోట్లు (సుమారు 25 బిలియన్ల అమెరికన్ డాలర్లువిలువ కలిగిన 400కు పైగా నౌకలను కొనుగోలు చేయాలనే ప్రణాళికను భారత్ ప్రకటించిందిస్థానిక తయారీ రంగానికి భారత ప్రభుత్వం అందిస్తున్న ఉత్పత్తి ఆధారిత ఆర్థిక సహకారాన్ని పరిగణనలోకి తీసుకుంటూ.. భారత్ఆర్‌వోకేకు చెందిన సంబంధిత పరిశ్రమల మధ్య సహకారాన్ని ఉభయపక్షాలు సమర్థించాయిఈ డిమాండును ద్వైపాక్షిక భాగస్వామ్యాలుగా మార్చడానికిసుస్థిరమైన నౌకా నిర్మాణ పరిశ్రమను బలోపేతం చేయడానికి ఒక సమర్థమైన సహకార యంత్రాంగం ఏర్పాటుకు మద్దతు తెలిపాయి.

భారతీయ నౌకా నిర్మాణ రంగానికి భారత ప్రభుత్వం అందిస్తున్న విధానపరమైనఆర్థికపరమైన సహకారంతో నౌకా నిర్మాణంలో ఉపయోగించే విడిభాగాలుఅనుబంధ పరిశ్రమలకు అదనపు డిమాండ్‌ను ఏర్పడుతుందని ఇరుపక్షాలు విశ్వసిస్తున్నాయిఇది స్థానికంగా ఉత్పత్తి చేయడం ద్వారా తమ వ్యాపారాన్ని విస్తరించుకొనేలా కొరియన్ నౌకా నిర్మాణ విడిభాగాల తయారీదారులకు ఆకర్షణీయమైన మార్కెట్‌ను అందిస్తుందిఈ దిశగాముంబైలో కొరియా మెరైన్ ఎక్విప్‌మెంట్ అసోసియేషన్ (కేఓఎంఈఏశాఖ ప్రారంభాన్నిఈ సహకారం పట్ల కొరియా మెరైన్ ఎక్విప్‌మెంట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (కేఓఎంఈఆర్ఐకనబరుస్తున్న ఆసక్తిని ఇరు దేశాలు స్వాగతించాయిఅలాగేభారతీయ నౌకా నిర్మాణ రంగ వృద్ధికి తోడ్పడటానికి రెండు దేశాల్లోని సంబంధిత సంస్థలుపరిశ్రమల మధ్య సహకారాన్ని పెంపొందించుకోవడానికి అంగీకరించారు.
భారత ఓడరేవులుషిప్పింగుజలమార్గాలు (ఎంవోపీఎస్‌డబ్ల్యూమంత్రిత్వ శాఖతో కొరియా ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (కేవోఐసీఏఏర్పాటు చేసుకున్న భాగస్వామ్యం ద్వారా భారత దేశంలో నౌకా నిర్మాణ రంగంలో నైపుణ్య శిక్షణ అందించడానికి ఉభయపక్షాలు అంగీకరించాయిరెండు దేశాల మధ్య అభివృద్ధి సహకారంప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా భారత నౌకా నిర్మాణ లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన సామర్థ్య నిర్మాణానికి ఈ ప్రాజెక్టు సహకరిస్తుందని వారు గుర్తించారు.
సరళీకృత యాజమాన్య విధానాలుఅందుబాటులో ఉన్న ఆర్థిక ప్రోత్సాహకాల ప్రయోజనాలను పొందేందుకు భారత దేశంలో అమలు చేస్తున్న జీఐఎఫ్‌టీ ఐఎఫ్ఎస్‌సీఏ-సముద్రను ఉపయోగించుకొని తమ నౌకలను నమోదు చేసుకోవాలని కొరియా నౌకా యజమానులకు భారత పక్షం సూచించింది.
భారత్‌లో నావికుల సంఖ్య వేగంగా పెరుగుతోంది (సుమారు 320,000కు పైమాటేదీనిలో మహిళా నావికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది). ఇది కొరియన్ నావికా కార్యకలాపాలకు అవసరమైన సిబ్బందిని నియమించుకోవడానికి వీలు కల్పిస్తుంది.
ఓడరేవుల అభివృద్ధికి సహకారం కోసం భారత ప్రభుత్వ నౌకాయానఓడరేవులుజలమార్గాల మంత్రిత్వ శాఖఆర్‌వోకే మహాసముద్రాలుమత్స్య మంత్రిత్వ శాఖల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంపై సంతకాలు చేయడాన్ని ఇరుపక్షాలు స్వాగతించాయిఈ ఒప్పందం మౌలిక సదుపాయాల అభివృద్ధిజ్ఞానాన్ని పంచుకోవడం తదితరమైన వాటిలో పరస్పర సహకారానికి మార్గం సుగమం చేస్తుందివచ్చే ఏళ్లలో సుమారు 13.3 బిలియన్ డాలర్ల అంచనా విలువతో పీపీపీ విధానంలో భారతదేశం పైప్‌లైన్ యాంత్రీకరణలో పాల్గొనేందుకు కొరియా ఓడరేవుల అభివృద్ధిదారులకుటెర్మినల్ ఆపరేటర్లకు అవకాశాలను కల్పిస్తుందిఈ ప్రాజెక్టులలో 23 మిలియన్ టీఈయూ వధవాన్ కంటైనర్ పోర్ట్ (మహారాష్ట్ర), బహుదా (ఒడిశాలోని 150 ఎంటీపీఏ మల్టీపర్పస్ టెర్మినల్దీన్ దయాల్ పోర్ట్ (గుజరాత్లోని 135 ఎంటీపీఏ ఆధునిక టెర్మినల్ ఉన్నాయి

భారతదేశానికి చెందిన భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్, ఆర్‌‌వోకేకు చెందిన హెచ్‌డి కొరియా షిప్‌బిల్డింగ్ అండ్ ఆఫ్‌షోర్ ఇంజనీరింగ్ కో లిమిటెడ్ (హెచ్‌డీ కేఎస్ఓఈ), హెచ్‌డి హ్యుందాయ్ సామ్హో కంపెనీ లిమిటెడ్‌ల మధ్య కుదిరిన ఎంవోయూను ఇరుపక్షాలు స్వాగతించాయిభారతదేశంలో అత్యాధునికమైనస్వయంప్రతిపత్తి కలిగిన నౌకా వాణిజ్యంపోర్టు క్రేన్ల రూపకల్పనతయారీ, సహాయక సేవలను సంయుక్తంగా అందించడానికి ఈ ఒప్పందం కుదిరింది.

ఇండియన్ మారిటైమ్ విశ్వవిద్యాలయం (ఐఎంయూ), కొరియా మారిటైమ్ అండ్ ఓషన్ యూనివర్సిటీ (కేఎంవోయూజరుగుతున్న చర్చలను ఇరుపక్షాలు సానుకూలంగా గుర్తించాయినౌకా నిర్మాణంమెరైన్ ఇంజినీరింగ్పోర్టు నిర్వహణలో విద్యపరిశోధనఆవిష్కరణల దిశగా ఉమ్మడి కార్యక్రమాలుహరిత షిప్పింగ్ టెక్నాలజీలుఅటానమస్ నౌకలుక్రేన్ ఆటోమేషన్‌లో సహకారాత్మక ఆర్ అండ్ డీవిద్యార్థుల మార్పిడిఅధ్యాపక ఒప్పందాలుభారతీయఆర్‌వోకే సంస్థల భాగస్వామ్యంతో పరిశ్రమ అనుసంధానిత ప్రాజెక్టులపై వ్యూహాత్మతక భాగస్వామ్యాన్ని ఖరారు చేసుకోవాలని సూచించారు.
రెండు దేశాల మధ్య కొనసాగుతున్న నౌకా వాణిజ్య వారసత్వానికి ఉన్న ప్రాచీన మూలాలను ఉభయపక్షాలు గర్వంగా గుర్తు చేసుకున్నాయిభారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలో ఉన్న లోథాల్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద నౌకావాణిజ్య సముదాయంగా 'నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్' (ఎన్ఎంహెచ్‌సీను అభివృద్ధి చేస్తున్నట్లు భారత పక్షం తెలిపిందిచారిత్రక వస్తువులుసమాచారాన్ని పంచుకోవడంసాంకేతిక సహకారంఉమ్మడి కార్యకలాపాలువిశ్వవిద్యాలయాలుమ్యూజియంలుఇతర సంస్థల మధ్య సహకారాన్ని పెంపొందించుకోవడానికి 'నౌకావాణిజ్య వారసత్వరంగంలో కుదిరిన అవగాహన ఒప్పందంపై సంతకాలు చేయడాన్ని ఇరుపక్షాలు స్వాగతించాయి.
నౌకా నిర్మాణంషిప్పింగ్ఓడరేవుల రంగాలలో భారతదేశంఆర్‌ఓకే మధ్య జరుగుతున్న సహకార పురోగతి దిశనుదానిలోని అంశాల పట్ల ప్రధానమంత్రి మోదీఅధ్యక్షుడు లీ సంతృప్తి వ్యక్తం చేశారుభవిష్యత్తులో భారత్-కొరియా భాగస్వామ్యం ఇరు దేశాలకే కాకుండాప్రపంచం మొత్తానికి ప్రయోజనాలను చేకూరుస్తుందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.

 

***


(రిలీజ్ ఐడి: 2254230) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Kannada