ప్రధాన మంత్రి కార్యాలయం
జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలోని విశేషాలను పంచుకున్న ప్రధాని
నాడు పోస్టు చేయడమైనది:
18 APR 2026 11:55PM by PIB Hyderabad
జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలోని విశేషాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా చేసిన వరుస పోస్టులలో ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు:
"మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకించడం ద్వారా ప్రతిపక్షాలు రాజ్యాంగ నిర్మాతల మనోభావాలను అవమానించాయి. దేశ నారీ శక్తి ఆత్మగౌరవం, స్వాభిమానాన్ని దెబ్బతీసే వారు ఇక తల్లులు, సోదరీమణులు, కుమార్తెల ఆగ్రహం నుంచి తప్పించుకోలేరు.”
"భారతీయ మహిళలకు కొత్త రెక్కలు తొడిగేందుకు చేపట్టిన ఒక మహా యజ్ఞం నారీ శక్తి వందన్ అధినియమ్‌కు సంబంధించిన సవరణ. కానీ కాంగ్రెస్, టీఎంసీ, సమాజ్వాదీ పార్టీ, డీఎంకే వంటి పార్టీలు దీనిని పురిట్లోనే తుంచేశాయి."
"మహిళా రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటుందని నేను వ్యక్తిగతంగా ఆశించాను. కానీ మరోసారి ఆ పార్టీ ఈ అవకాశాన్ని వదులుకుంది."
"నారీ శక్తి వందన్ అధినియమ్ వ్యతిరేకతకు ఒక ప్రధాన కారణం ఉంది.. అది కుటుంబ రాజకీయ పార్టీల భయం! మహిళలు సాధికారత పొందితే తమ నాయకత్వం ప్రమాదంలో పడుతుందని వారు భయపడుతున్నారు."
***
(రిలీజ్ ఐడి: 2253463)
సందర్శకుల సూచీ సంఖ్య : : 16
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam