ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కోయంబత్తూరు దుర్ఘటనపై విచారం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 17 APR 2026 9:22PM by PIB Hyderabad

తమిళనాడులోని కోయంబత్తూరు దుర్ఘటనపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.
రోడ్డు ప్రమాదం సంగతి తెలిసి బాధపడ్డానని, ఆత్మీయుల్ని కోల్పోయిన కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేశానని శ్రీ మోదీ అన్నారు. దుర్ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, ఇలా పేర్కొంది:
‘‘తమిళనాడులోని కోయంబత్తూరులో దుర్ఘటన గురించి తెలిసి, ఎంతో బాధపడ్డాను. ఈ రోడ్డు ప్రమాదంలో ఆత్మీయులను కోల్పోయిన వారికి సంతాపం తెలియజేశాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించాను: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ’’.


(रिलीज़ आईडी: 2253226) आगंतुक पटल : 38
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Kannada , Malayalam