ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఇండియాఏఐ స్టార్టప్స్ గ్లోబల్ యాక్సిలరేషన్ ప్రోగ్రామ్ బృందం-IIకి ఎంపికైన 10 అత్యాధునిక భారత అంకుర సంస్థలు


హెల్త్ టెక్, క్లైమేట్ టెక్, ఎడ్‌టెక్, శాటిలైట్ ఇంటెలిజెన్స్, కాగ్నిటివ్ ఏఐ వంటి రంగాలకు విస్తరించిన రెండో బృందం.. స్టేషన్ ఎఫ్, హెచ్ఈసీ పారిస్‌లతో ఇండియా ఏఐ మిషన్ భాగస్వామ్యం ద్వారా ప్రపంచస్థాయి ఏఐ నిపుణులను తయారు చేయాలన్న భారత్ లక్ష్యం వేగవంతం

నాడు పోస్టు చేయడమైనది: 17 APR 2026 11:50AM by PIB Hyderabad

ప్రపంచ వేదికపై భారత ఏఐ సామర్థ్యాలను మరింతగా విస్తరించాలనే నిబద్ధతతో కేంద్ర ఎలక్ట్రానిక్స్సమాచార సాంకేతిక (ఎంఈఐటీవైమంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియాఏఐ మిషన్ కీలక ప్రకటన చేసిందిపారిస్‌కు చెందిన స్టేషన్ ఎఫ్హెచ్ఈసీ పారిస్ భాగస్వామ్యంతో అంతర్జాతీయ స్థాయిలో రూపొందించిన ఇండియా ఏఐ స్టార్టప్స్ గ్లోబల్ యాక్సిలరేషన్ ప్రోగ్రామ్ రెండో బృందం కోసం అత్యున్నత సాంకేతికత గల 10 భారతీయ ఏఐ అంకుర సంస్థలను ఎంపిక చేసినట్లు ప్రకటించింది.

ఇండియాఏఐ మిషన్ఎంఈఐటీవై స్టార్టప్ ఫైనాన్సింగ్ పిల్లర్ ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ క్యాంపస్ స్టేషన్ ఎఫ్ఐరోపాలోని అగ్రశ్రేణి బిజినెస్ స్కూల్స్‌లో ఒకటైన హెచ్ఈసీ పారిస్ సహకారంతో ఇండియాఏఐ స్టార్టప్స్ గ్లోబల్ యాక్సిలరేషన్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించిందిఈ కార్యక్రమంలోని ప్రతి బృందంఎంపికైన 10 భారతీయ ఏఐ అంకుర సంస్థలకు అంతర్జాతీయ స్థాయిలో విస్తరించటానికిఅవసరమైన వనరులునైపుణ్యంవ్యూహాత్మక సంబంధాలను పెంపొందించటానికి దోహదపడుతుంది.

భారతదేశ జాతీయ ఏఐ వ్యూహానికి అనుగుణంగా ఈ కార్యక్రమం ఉందిఇది సరిహద్దుల మధ్య జ్ఞాన మార్పిడిఅధునాతన పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థలకు పరిచయంప్రపంచ మార్కెట్ అనుసంధానానికి ప్రాధాన్యతనిస్తుందిఅంతర్జాతీయ మార్కెట్లకు మార్గాన్ని సులభతరం చేయటంఆవిష్కరణలను ప్రోత్సహించటంప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారాఏఐ ఆధారిత పరిష్కారాల్లో అగ్రగామిగా నిలవాలన్న భారతదేశ దార్శనికతకు ఈ కార్యక్రమం మద్దతిస్తుంది.

ఐఎస్‌జీ బృందం-IIకి ఎంపికైన అంకుర సంస్థలు

·  ఏఐ హెల్త్ హైవే ఇండియా ప్రైవేట్ లిమిటెడ్: గుండెశ్వాస సంబంధిత వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించటానికిపరీక్షించటానికిఅంచనా వేయటానికి ఏఐ ఆధారిత స్మార్ట్ స్టెతస్కోప్‌ను ఈ సంస్థ అభివృద్ధి చేస్తోంది.

·  అవీరోస్విశాలమైన పరిసరాల్లో సందర్భోచిత అవగాహనతో మేధస్సుఆటోమేషన్ ను అందించే విజన్ఏఐ వేదిక

·  కాగ్నేక్టో: ఏఐ మౌలిక సదుపాయాల విశ్లేషణ వేదిక

·  ఫ్లాంట్అందంఫ్యాషన్ పోకడలుషార్ట్-వీడియో మార్కెటింగ్ కోసం మల్టీమోడల్ ఏఐ ఏజెంట్లు

·  గ్రీన్ఎఫ్ఐ.ఏఐ (క్లైమేట్ ఫోర్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్): పర్యావరణసామాజికసుపరిపాలననిబంధనల విధింపునకు ఏఐ ఆధారిత రిస్క్ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్

·  ఇన్ఫిహీల్ హెల్త్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్హీలో.. ఇది మానవ పర్యక్షణలో పనిచేసే బహుభాషా ఏఐ మానసిక ఆరోగ్య నేస్తం

·  ఇన్‌లస్ట్రో లెర్నింగ్ ప్రైవేట్ లిమిటెడ్: మనుషులుఏఐ ఏజెంట్లు నిజమైన పనిలో చేరకముందుగానే పనితీరు సామర్థ్యాన్ని పరీక్షించే ఏఐ ఆధారిత జాబ్ సిమ్యులేషన్ వేదిక

·  ప్రెడ్‌కో: ఆధునిక తయారీ రంగంలో వ్యక్తులుపద్ధతులుఉత్పత్తులకు సంబంధించి అన్ని నిబంధనలను పక్కాగా అమలు చేసేలా చూసే ఏఐ సాంకేతికత

·  స్కైసర్వ్ (హైస్పేస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్): భూమిఅంతరిక్ష పర్యవేక్షణకు ఏఐ మౌలిక సదుపాయాల వేదిక

·  టెస్ట్-ఏఐ-ఇంగ్ సొల్యూషన్స్: విశ్వసనీయబాధ్యతాయుతమైన ఏఐ పనితీరుని నిర్ధారించేలా ఏఐ పరిష్కారాల కోసం రూపొందించిన క్యూఏనిబంధనల అమలు విభాగం

ఎన్నో దశల్లో కఠినమైన ఎంపిక ప్రక్రియ ద్వారా ఈ 10 అంకుర సంస్థలు ఎంపికయ్యాయిభారతదేశపు శక్తిమంతమైన ఏఐ ఆవిష్కరణల వ్యవస్థకు ప్రతినిధులుగా ఇవి స్టేషన్ ఎఫ్‌లో పాల్గొంటాయిఈ అంకుర సంస్థలు అంతర్జాతీయ స్థాయిలో వృద్ధి చెందేందుకు తోడ్పడేలా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారుఇందులో భాగంగా మూడు వారాల పాటు ఆన్‌లైన్ శిక్షణ ఆ తర్వాత ఫ్రాన్స్‌లోని పారిస్‌లో మూడు నెలల పాటు అక్కడే ఉండి నేరుగా శిక్షణ పొందాల్సి ఉంటుంది.

బాధ్యతాయుతమైనవిస్తరించదగినసమ్మిళిత ఏఐ రంగంలో భారతదేశ నాయకత్వాన్ని వేగవంతం చేయాలనే ఇండియాఏఐ మిషన్ విస్తృత దార్శనికతలో ఈ కార్యక్రమం ఒక భాగంహెచ్ఈసీ పారిస్ రూపొందించిన ఈ కార్యక్రమం.. నేరుగా శిక్షణ పొందే సమయంలో అంకుర సంస్థలకు ఫ్రాన్స్ఐరోపాలోని ప్రముఖ పారిశ్రామిక వ్యవస్థల ప్రతినిధులతో వనరులుమార్గదర్శకత్వంనెట్‌వర్కింగ్ అవకాశాలను అందిస్తుంది

 

***


(రిలీజ్ ఐడి: 2252973) సందర్శకుల సూచీ సంఖ్య : : 14
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , हिन्दी , Bengali