ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మనీలాండరింగ్, ఆర్థిక నేరాలను అరికట్టటానికి ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్-ఇండియా, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ మధ్య ఎంఓయూ

నాడు పోస్టు చేయడమైనది: 16 APR 2026 1:21PM by PIB Hyderabad

మనీలాండరింగ్ఆర్థిక నేరాలకు వ్యతిరేకంగా భారతదేశ పోరాటాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక ముందడుగులో భాగంగా సమాచార మార్పిడిపరస్పరం సమన్వయాన్ని పెంపొందించుకునేందుకు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్-ఇండియా (ఎఫ్ఐయూ-ఐఎన్‌డీ), పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్‌డీఏమధ్య అవగాహనా ఒప్పందం (ఎంఓయూకుదిరింది.

పీఎఫ్ఆర్‌డీఏ ఛైర్మన్ శ్రీ శివసుబ్రమణియన్ రమణ్ సమక్షంలో ఎఫ్ఐయూ-ఐఎన్‌డీ డైరెక్టర్ శ్రీ అమిత్ మోహన్ గోవిల్పీఎఫ్ఆర్‌డీఏ శాశ్వత సభ్యుడు శ్రీ రణదీప్ సింగ్ జగపాల్ ఈ ఎంఓయూపై సంతకాలు చేశారు.

 

 

నియంత్రితనివేదికలు అందించే సంస్థలకు అవగాహనశిక్షణ కార్యక్రమాలను చేపట్టేలా రెండు ఏజెన్సీలను శక్తిమంతం చేయటం ఈ ఎంఓయూ ముఖ్య ఉద్దేశంఇందులో భాగంగా పీఎఫ్ఆర్‌డీఏ పరిధిలోని సంస్థల మనీలాండరింగ్ నిరోధకఉగ్రవాద ఆర్థిక సహాయ నిరోధక (ఏఎంఎల్సీఎఫ్‌టీసామర్థ్యాలను మెరుగుపరచటంపై ప్రత్యేక దృష్టి సారిస్తారుఅంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వ్యవహరించేలా ఇరుపక్షాలు చూసుకుంటాయిసమాచార మార్పిడిపరస్పరం ఆసక్తి ఉన్న అంశాలపై చర్చించేందుకు ప్రతీ మూడు నెలలకు సమావేశాలు జరుగుతాయి.

 

రెండు సంస్థల మధ్య క్రమబద్ధమైన సమన్వయంపరస్పర చర్చలను సులభతరం చేయటానికి ఈ ఎంఓయూలో భాగస్వాములైన ప్రతీ పక్షం.. ఒక నోడల్ అధికారినిఒక ప్రత్యామ్నాయ నోడల్ అధికారిని నియమించాలిఈ ఒప్పందం ఎగ్మాంట్ గ్రూప్ సమాచార మార్పిడి సూత్రాల ద్వారా విదేశీ ఎఫ్ఐయూ సమాచారాన్ని పంచుకోవటంలోనూ సహకరిస్తుంది.

సంబంధిత ఆర్థిక ఉప రంగాల్లోని మనీలాండరింగ్ఉగ్రవాద ఆర్థిక సహాయ (ఎంఎల్టీఎఫ్ముప్పులనులోపాలను ఈ సహకారం ద్వారా అంచనా వేస్తారుఅనుమానాస్పద లావాదేవీలకు సంబంధించి రెడ్-ఫ్లాగ్ సూచీలను గుర్తించి ప్రచారం చేయటంపీఎంఎల్ఏపీఎంఎల్ నిబంధనలుపీఎఫ్ఆర్‌డీఏ మార్గదర్శకాల ప్రకారం నివేదికలు అందించే సంస్థల బాధ్యతలను పర్యవేక్షించటంతనిఖీ చేయటం ఈ సహకారంలో భాగం.

ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్-ఇండియా (ఎఫ్ఐయూ-ఐఎన్‌డీగురించి

మనీలాండరింగ్ఉగ్రవాదానికి నిధుల చేరవేయటాన్ని అరికట్టే ప్రయత్నాలను సమన్వయం చేయటంఅనుమానాస్పద ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని స్వీకరించటంప్రాసెస్ చేయటంవిశ్లేషించటంసంబంధిత సంస్థలకు చేరవేయటం వంటి బాధ్యతలను నిర్వహించే కేంద్ర జాతీయ సంస్థ ఎఫ్ఐయూ-ఐఎన్‌డీ.

పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్‌డీఏగురించి

పీఎఫ్ఆర్‌డీఏ చట్టం-2013 ద్వారా ఏర్పాటు చేసిన చట్టపరమైన నియంత్రణ సంస్థ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీజాతీయ పెన్షన్ వ్యవస్థ (ఎన్ పీఎస్), అటల్ పెన్షన్ యోజన (ఏపీవైసహా భారత్ లోని పెన్షన్ రంగాన్ని నియంత్రించటంఅభివృద్ధి చేయటంపర్యవేక్షించటం దీని బాధ్యతపెన్షన్ వ్యవస్థ క్రమంగా వృద్ధి చెందటానికిచందాదారుల ప్రయోజనాలను కాపాడటానికి పెన్షన్ నిధులుకేంద్ర రికార్డు నిర్వహణ సంస్థలుట్రస్టీలుఅగ్రిగేటర్లుసేవా కేంద్రాల వంటి మధ్యవర్తుల కోసం పీఎఫ్ఆర్‌డీఏ సమగ్ర నియంత్రణపర్యవేక్షణా వ్యవస్థను అందిస్తుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2252632) సందర్శకుల సూచీ సంఖ్య : : 21
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Punjabi , Gujarati