ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పండగ వేళల్లో రైతులకు కృతజ్ఞతలు తెలియజేసే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 15 APR 2026 7:58AM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పలు పండగలను జరుపుకుంటున్నారని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారుఆనందంఉత్సాహం నిండిన ఇలాంటి సందర్భాల్లో యావత్ దేశ అవసరాలను తీరుస్తున్న శ్రమ జీవి రైతు సోదరీసోదరుల పట్ల దేశం కృతజ్ఞతతో ఉంటుందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి పంచుకున్నారు.

"ఇత్థం ఫలతి శుద్ధేన సిక్తం సంకల్పవారిణా

పుణ్యబీజమపి స్వల్పం పుంసాం కృషికృతామివ"

రైతు నాటిన చిన్న విత్తనానికి తగిన సమయంలో నీరందించటం వల్ల క్రమంగా పెరిగి గొప్ప పంటను ఇచ్చినట్లుగా.. స్వచ్ఛమైన సంకల్పంతో చేసే చిన్న ప్రయత్నం కూడా కాలక్రమేణా మనిషిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని ఈ సుభాషితం తెలియజేస్తుంది.

సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.

"దేశంలోని వివిధ ప్రాంతాల్లో అనేక పండగలు జరుగుతున్నాయిఈ ఆనందకరఉత్సాహకర సందర్భంలో యావత్ దేశాన్ని పోషించే కష్టజీవి రైతు సోదరీసోదరుల పట్ల మనమంతా కృతజ్ఞతతో ఉండాలి.

ఇత్థం ఫలతి శుద్ధేన సిక్తం సంకల్పవారిణా

పుణ్యబీజమపి స్వల్పం పుంసాం కృషికృతామివ"


(रिलीज़ आईडी: 2252081) आगंतुक पटल : 66
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Bengali-TR , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam