ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉత్తరాఖండ్‌.. ఉత్తరప్రదేశ్‌లలో తన పర్యటన విశేషాలను ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 14 APR 2026 9:42PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల పర్యటనలోని విశేషాలను ప్రజలతో పంచుకున్నారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన వరుస సందేశాల్లో:

“సహారన్‌పూర్‌కు భారీగా తరలివచ్చిన నా కుటుంబ సభ్యుల అపార మద్దతు, వారిచ్చిన ఆశీస్సులు నాలో నవ్యోత్తేజం నింపాయి.”

“డెహ్రాడూన్‌లోని ప్రసిద్ధ జై దాత్ కాళీమాత ఆలయానికి వెళ్లి, పూజలు చేసే భాగ్యం నాకు దక్కింది. నా దేశ ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అమ్మవారిని ప్రార్థించాను.”

“ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్‌లో ఢిల్లీ-డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్‌పై వన్యప్రాణుల కోసం నిర్మితమవుతున్న ఎలివేటెడ్ కారిడార్‌ను చూసే అవకాశం నాకు లభించింది. దీనివల్ల వన్యప్రాణుల సంచారం నిరాటంకంగా, సురక్షితంగా సాగిపోవడమే కాకుండా పర్యాటక, వాణిజ్య రంగాల్లో కొత్త అవకాశాలు అందివస్తాయి.”

“ఉత్తరాఖండ్‌లో ద్వంద్వ చోదక ప్రభుత్వం సారథ్యాన అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతుండటంపై ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో డెహ్రాడూన్‌లో నా సోదరీసోదరులు ప్రదర్శించిన అపరిమిత ఆనందోత్సాహాలు స్పష్టం చేశాయి.”

“డెహ్రాడూన్ కార్యక్రమంలో ప్రజానీకం నాపై చూపిన ప్రేమాదరాలు నన్ను మంత్రముగ్ధుడిని చేశాయి.” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

***


(రిలీజ్ ఐడి: 2252047) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Gujarati , Kannada