ప్రధాన మంత్రి కార్యాలయం
చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు అందించడంలో తమ చిత్తశుద్ధిని పునరుద్ఘాటిస్తూ... నారీశక్తికి రాసిన లేఖను పంచుకున్న ప్రధాని
నాడు పోస్టు చేయడమైనది:
14 APR 2026 9:29AM by PIB Hyderabad
చట్టసభల్లో స్త్రీలకు రిజర్వేషన్లను కల్పించే చొరవను దేశవ్యాప్తంగా మహిళందరూ ప్రశంసిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
దశాబ్దాలుగా నిలిచిపోయిన ఈ అంశాన్ని అమలు చేయడంలో ప్రభుత్వానికున్న చిత్తశుద్ధిని పునరుద్ఘాటిస్తూ... భారత నారీశక్తికి అంకింతం చేస్తూ రాసిన లేఖను పంచుకున్నారు.
2029లో జరిగే లోక్‌సభ, రాష్ట్ర శాసనసభ ఎన్నికల నుంచి మహిళలకు రిజర్వేషన్లు కల్పించే ఈ నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా ఉన్న మాతృమూర్తులు, సోదరీమణులు, కుమార్తెలు ప్రశంసిస్తున్నారని ఆయన అన్నారు.
దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న ఈ వాగ్ధానాన్ని వీలైనంత త్వరగా నెరవేర్చడంపై తన ఆలోచనలను భారత దేశ నారీశక్తికి అంకితం చేసిన ఈ లేఖలో ప్రధానమంత్రి పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఇలా రాశారు:
‘‘చట్ట సభల్లో స్త్రీలకు రిజర్వేషన్లను కల్పించే ఈ చొరవను దేశవ్యాప్తంగా ఉన్న మహిళలు ప్రశంసిస్తున్నారు.
దశాబ్దాలుగా పెండింగులో ఉన్న ఈ అంశాన్ని అమలు చేయడంలో మా చిత్తశుద్ధిని పునరుద్ఘాటిస్తూ.. నారీశక్తికి నేను రాసిన లేఖ ఇది..’’
‘‘2029 లోక్ సభ, విధాన సభ ఎన్నికల నుంచి మహిళలకు రిజర్వేషన్లను అందించే నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా ఉన్న మాతృమూర్తులు, సోదరీమణులు, కుమార్తెలు స్వాగతిస్తున్నారు.
భారత నారీశక్తికి అంకితం చేసిన ఈ లేఖలో, దశాబ్దాల నాటి ఆకాంక్షను వీలైనంత త్వరగా సాకారం చేయడం గురించి నా ఆలోచనలను దేశ ప్రజలతో పంచుకుంటున్నాను...’’
(రిలీజ్ ఐడి: 2251898)
సందర్శకుల సూచీ సంఖ్య : : 12