ఔషధాల విభాగం
azadi ka amrit mahotsav

9వ ఇండియా ఫార్మా ముఖ్యాంశాలు: విధానపరమైన ప్రోత్సాహం, ఆవిష్కరణలే ఈ రంగ వృద్ధికి కీలకం


బయోసిమిలర్స్, ప్రత్యేక ఔషధాలపై దృష్టి సారించటం ద్వారా ప్రపంచ ఔషధ రంగంలో అగ్రగామిగా భారత్: కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా

కేవలం ఉత్పత్తులకు పరిమితం కాకుండా, నూతన ఆవిష్కరణలపై ఔషధ రంగం దృష్టి సారించాలన్న కేంద్ర సహాయమంత్రి శ్రీమతి అనుప్రియా పటేల్.. పరిశ్రమలు-విద్యాసంస్థల సమన్వయాన్ని బలోపేతం చేసేందుకు పిలుపు

నాడు పోస్టు చేయడమైనది: 13 APR 2026 3:54PM by PIB Hyderabad

భారత ప్రభుత్వ రసాయనాలుఎరువుల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఔషధాల విభాగం (డీఓపీప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఇండియా ఫార్మా-2026, 9వ ఎడిషన్ ఇవాళ న్యూఢిల్లీలో ప్రారంభమైందిఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్ఐసీసీఐ), ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ (ఐపీఏసహకారంతో నిర్వహిస్తున్న ఈ రెండు రోజుల సదస్సు (ఏప్రిల్ 13 నుంచి14), అంతర్జాతీయ ఫార్మాఆరోగ్య సంరక్షణ రంగ కీలక భాగస్వాములను ఒకచోటకు చేర్చిందిఆవిష్కరణలుస్వావలంబనప్రపంచ నాయకత్వం ఈ సదస్సు ప్రధాన లక్ష్యాలు.

సమావేశ ప్రారంభంలో కేంద్ర ఆరోగ్యకుటుంబ సంక్షేమరసాయనాలుఎరువుల శాఖ మంత్రి శ్రీ జేపీ నడ్డా వర్చువల్ గా ప్రసంగించారుఈ వేదిక భారత ఔషధ రంగ శక్తినిఅంతర్జాతీయంగా ఈ రంగానికి పెరుగుతున్న ప్రాధాన్యతను ప్రతిబింబిస్తోందన్నారుతక్కువ ధరలో నాణ్యమైన జనరిక్ మందులను అందించటంలో అగ్రగామిగా ఉన్న భారత్.. "ప్రపంచ ఫార్మసీగా గుర్తింపు పొందిందని వెల్లడించారుప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయనిప్రపంచం ఇప్పుడు బయోలాజిక్స్బయోసిమిలర్స్ప్రత్యేక ఔషధాల వైపు ఆసక్తి చూపుతోందని చెప్పారు. "మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా భారత్ మారటమే కాకప్రపంచ నాయకత్వ శక్తిగా ఎదగటానికి సిద్ధంగా ఉందిఅని ఆయన పేర్కొన్నారుఆవిష్కరణలను ప్రోత్సహించేందుకుపరిశోధనా సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వ ప్రాధాన్యతను స్పష్టం చేస్తూ.. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో బయోఫార్మాస్యూటికల్ ఆవిష్కరణల సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో రూ.10,000 కోట్ల వ్యయంతో ఇటీవల ప్రారంభించిన బయోఫార్మా శక్తి కార్యక్రమం గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.

ఫార్మాస్యూటికల్, వైద్య సాంకేతిక రంగాల్లో పరిశోధనలను ప్రోత్సహించే పీఆర్‌ఐపీ పథకం వంటి అనుబంధ కార్యక్రమాల గురించి ఆయన వివరించారుఇవి పరిశ్రమలువిద్యాసంస్థల మధ్య సహకారాన్ని బలోపేతం చేయటానికివినూత్న చికిత్సా పద్ధతుల అభివృద్ధిని వేగవంతం చేయటానికి దోహదపడతాయిస్వావలంబనపటిష్టమైన సరఫరా వ్యవస్థలను పెంపొందించేందుకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐపథకాలుబల్క్ డ్రగ్ పార్కుల అభివృద్ధి వంటి కార్యక్రమాల మద్దతుతో దేశీయ తయారీ రంగాన్ని బలోపేతం చేయటం ప్రధాన ప్రాధాన్యతగా కొనసాగుతోందిదేశవ్యాప్తంగా సరసమైన ధరలకే నాణ్యమైన మందులు అందించే ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలందరికీ చౌకగా వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన మరోసారి స్పష్టం చేశారు.

చర్చలను ప్రోత్సహించేందుకు, భాగస్వామ్యాలను పెంపొందించేందుకుఈ రంగానికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించేందుకు ఇండియా ఫార్మా-2026 కీలక వేదిక కానున్నట్లు ఆయన తెలిపారు.

ఆరోగ్యం, కుటుంబ సంక్షేమరసాయనాలుఎరువుల శాఖ సహాయమంత్రి శ్రీమతి అనుప్రియా పటేల్ మాట్లాడుతూ.. ప్రపంచ స్థాయి జెనరిక్ ఔషధాల అగ్రగామి దేశం స్థాయి నుంచి బయోఫార్మా ఆవిష్కరణల కేంద్రంగా భారత్ అభివృద్ధి చెందుతోందని అన్నారుప్రపంచవ్యాప్త జెనరిక్ ఔషధాల సరఫరాలో దాదాపు 20 శాతాన్ని భారత్ అందిస్తోందనిప్రపంచ టీకాల అవసరాల్లో సుమారు 70 శాతం భారత్ తీరుస్తోందని వెల్లడించారుఇది దేశ తయారీ రంగంలో పటిష్టమైన సామర్థ్యాలను స్పష్టం చేస్తున్నాయన్నారు.

భవిష్యత్ అవకాశాల గురించి ప్రస్తావిస్తూ.."ప్రపంచవ్యాప్తంగా బయోలాజిక్స్బయోసిమిలర్స్ డిమాండ్ వేగంగా పెరుగుతోందని, 2030 నాటికి బయోసిమిలర్స్ మార్కెట్ 75 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశాలున్నట్లు తెలిపారుగ్లోబల్ ఫార్మాస్యూటికల్ మార్కెట్ విలువలో దాదాపు 87 శాతం వాటా వినూత్న ఔషధాలదేనని ఆమె చెప్పారుఈ నేపథ్యంలో ఆవిష్కరణల ఆధారిత విభాగాలపై భారత్ మరింత దృష్టి సారించాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు.

ఔషధాల పరిశోధన, అభివృద్ధిలో కృత్రిమ మేధ అనుసంధానం గురించి శ్రీమతి పటేల్ వివరించారుఅధునాతన పరిశోధనలుఆవిష్కరణలకు సహకరించేందుకు ఎన్ఐపీఈఆర్ఐఐటీల వంటి ప్రతిష్టాత్మక సంస్థల ద్వారా మానవ వనరులను బలోపేతం చేయటం కీలకమని ఆమె స్పష్టం చేశారు.

ఆవిష్కరణల వేగాన్ని పెంచాల్సిన అవసరముందని, అంకుర సంస్థల వ్యవస్థలను బలోపేతం చేయాలనిక్లినికల్ ట్రయల్స్అధునాతన పరిశోధనల కోసం పటిష్టమైన మౌలిక సదుపాయాలను నిర్మించాలని ఫార్మాస్యూటికల్స్ విభాగం కార్యదర్శి శ్రీ మనోజ్ జోషి స్పష్టం చేశారుమెరుగైన నిధుల లభ్యతపరిశ్రమప్రభుత్వాల మధ్య సన్నిహిత సహకారంనైపుణ్యం గల మానవ వనరుల అభివృద్ధి ప్రాముఖ్యతను ఆయన వివరించారు.

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీమతి పుణ్య సలీల శ్రీవాస్తవ ప్రసంగిస్తూ.. నియంత్రణ వ్యవస్థను బలోపేతం చేసేందుకుఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ నిబద్ధతను స్పష్టం చేశారుఅనుమతుల ప్రక్రియను క్రమబద్ధీకరించటానికిపరిశోధనల నిర్వహణను సులభతరం చేసేందుకు ఎన్నో చర్యలు చేపట్టినట్లు ఆమె పేర్కొన్నారుతద్వారా భారతదేశాన్ని "ప్రపంచ ఫార్మసీస్థాయి నుండి "ప్రపంచ ఆవిష్కర్త"గా మార్చడమే లక్ష్యమని తెలిపారు.

ఫిక్కీ ఫార్మా కమిటీ ఛైర్మన్, మ్యాన్ కైండ్ ఫార్మా సీఓఓ శ్రీ అర్జున్ జునేజా మాట్లాడుతూ.. భారతదేశపు పటిష్టమైన ఔషధ రంగాన్ని కొనియాడారుదేశంలో 3,000కు పైగా కంపెనీలు, 10,500కు పైగా తయారీ కేంద్రాలున్నాయని.. వీటిలో అమెరికా వెలుపల అత్యధిక సంఖ్యలో యూఎస్ఎఫ్‌డీఏ ప్రమాణాలకనుగుణంగా పనిచేసే ప్లాంట్లు ఉన్నాయని చెప్పారుఆవిష్కరణల వృద్ధిని సాధించేందుకు భారత్అంతర్జాతీయ సంస్థల మధ్య బలమైన సహకారం అవసరమని స్పష్టం చేశారు.

ఫిక్కీ ఫార్మా కమిటీ సహాధ్యక్షుడుసిప్లా కంపెనీ ఎండీగ్లోబల్ సీఈఓ శ్రీ అచిన్ గుప్తా అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

రెండు రోజుల పాటు జరిగే సదస్సుప్రదర్శనలో.. ఆవిష్కరణల కోసం విధానపరమైన ముసాయిదాలుఔషధ ఆవిష్కరణల్లో కృత్రిమ మేధభవిష్యత్ సాంకేతికతలుజీవ శాస్త్ర రంగంలో భారత ప్రపంచస్థాయి పోటీతత్వాన్ని పెంపొందించే వ్యూహాలపై చర్చలు జరగనున్నాయిఫార్మాస్యూటికల్ రంగ భవిష్యత్ ప్రణాళికను రూపొందించటంలోప్రపంచ ఆరోగ్యత సంరక్షణ రంగాలో అగ్రగామిగా భారత్ స్థానాన్ని బలోపేతం చేయటంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2251661) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Marathi , English , Gujarati , Urdu , हिन्दी , Bengali , Kannada